Others

పిల్లల పెంపకంలో జాగ్రత తలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇంట్లో పాపాయి వున్నప్పుడు తల్లికి పని పెరుగుతుంది. ‘‘చంటి పిల్లలు హాయిగా నిద్రపోతారు. అల్లరి చేస్తారా? వస్తువులను పాడు చేస్తారా? ఆకలేస్తే ఏడుస్తారు.. కాసిని పాలు తాగి, కాసేపు ఆడుకుని అలసిపోయి పవళిస్తారు’’ అనుకుంటారు మగవాళ్ళు. కాని ఆ అభిప్రాయం సరికాదు. పాపాయి పెంపకంలో తల్లి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవడంతోపాటు ఎంతో శుభ్రతను పాటించాలి. పాపాయి వున్న ఇంట్లో పసిపాప ఎదుగుదలనూ, వారి ఆరోగ్యాన్ని గురించి సరైన శ్రద్ధ తీసుకోవలసి వుం టుంది. పాపాయిని పెంచడం, శిశువు ఎదుగుదలను చూడటం తల్లికి అదనపు బాధ్యతనే చెప్పొచ్చు.
పసిబిడ్డ ఎదుగుదలకు తోడ్పడే ఆహారం విషయంలో సరైన జాగ్రత్త తీసుకుంటూ శుభ్రతను పాటించాలి. తల్లి పాలను తాగించే పాపాయిలకు, తల్లి పాలు ఇచ్చే సమయంలో స్తనాలను శుభ్రపరచుకుని అప్పుడు పాలు తాగించాలి. పాపాయి పాలు తాగినతర్వాత వారి పెదాలను మెత్తని తడిబట్టతో శుభ్రంగా తుడవాలి. పోతపాలు పోసే పాపాయిలకు, పాలు కలిపేటప్పుడు ఉపయోగించే గినె్న, గ్లాసు, చెంచాలను పరిశుభ్రమైన నీటితో కడగాలి. అంతేగాకుండా రోజుకు రెండుసార్లయినా వేడినీటితో కడగాలి.
డబ్బామీద వున్న పట్టిక ప్రకారం పిల్లల వయసుకు తగినట్లుగా పాలపొడిని కలపాలి. పాల పీకను మరిగే నీటిలో వేసి, కొంచెంసేపు ఉంచి, ఆ తర్వాత సీసాను బ్రష్ చేసి శుభ్రమైన నీటితో కడగాలి. పిల్లలు తాగకుండా వదిలేసిన పాలపొడితో కలిపిన పాలను వెచ్చచేసి, తాగించకూడదు. కొన్ని గంటలు నిలవ ఉంచిన చల్లని పాలను తాగించకూడదు. అలా చేస్తే చంటి పిల్లల ఆరోగ్యం పాడవుతుంది.
పాపాయిని ఉయ్యాలలో పడుకోబెట్టేటప్పుడు పక్క మెత్తగా ఉండే విధంగా చూడాలి. ఉయ్యాలలో సరిపోయే విధంగా చిన్న పరుపు, దానిమీద రబ్బరు షీటును వేయాలి. ఆ రబ్బరు షీటు మీద మరో బట్టను వేసి పాపను పడుకోబెట్టాలి. రబ్బరు షీటు వేయడంవల్ల పరుపు తడవదు. పాపాయి పక్కబట్టలను తడిపినపుడు, ఆ బట్టలను ఆరేసి తిరిగి వాడటం బిడ్డ చర్మానికి అనారోగ్యం. పాపాయి తడిపిన బట్టలను శుభ్రంగా ఉతికి, డెట్టాల్ కలిపిన నీటితో నానబెట్టి, ఆ తర్వాత ఎండలో ఆరెయ్యాలి.
బిడ్డకు బట్టలు తొడిగేటప్పుడు శుభ్రంగా ఉన్నవి చూసి తొడగాలి. చీమలు, దుమ్ము, సన్నని పురుగులు వుంటే వాటిని దులపడంవల్ల పోతాయి. పాప నిద్రపోయే సమయంలో ఎలాస్టిక్ డ్రాయర్లను, ఎలాస్టిక్ దుస్తులను విప్పేసి వదులుగా ఉన్న బట్టలను తొడిగి పడుకోపెట్టాలి. ఎలాస్టిక్‌వల్ల లేత చర్మంమీద వాతపడుతుంది. పసిబిడ్డకు ఎలాస్టిక్ డ్రాయర్లు వాడేకంటే, మెత్తని సన్నని డ్రాయర్లలాంటి లంగోటీలను వాడటం మంచిది. లంగోటీని తడిసినప్పుడు అది తీసేసి మరొకటి వేసే ముందు చర్మానికి తడిలేకుండా శుభ్రంగా తుడిచి బేబీ పౌడర్‌ను అద్ది ఆ తర్వాత ఇంకోటి వేయాలి.
పాపాయి దుస్తులను, పక్కబట్టలను వేడినీటితో శుభ్రపరచాలి. అన్ని బట్టలతో కలపకుండా వేరుగా తడపాలి. పిల్లల బట్టలను వాషింగ్ సోడాతో ఉతకకూడదు. మరిగే వేడినీటిలో తడిపి సబ్బుతో ఉతికి ఎండలో ఆరవేయాలి. వారానికి రెండు మూడుసార్లయినా పసిపిల్లలకు సంబంధించిన బట్టలను డెట్టాల్ నీటిలో ముంచి ఆరేయటమే కాకుండా, పాపాయి వున్న ఇంట్లో ఫ్లోర్‌ను డెట్టాల్ కలిపిన నీటిలో తుడవాలి. అలా చేసినట్లయితే పిల్లలకు అనారోగ్యాలు, చర్మవ్యాధులు ఇన్‌ఫెక్షన్లు రావు.
పాకే వయసులో వుంటే ఫ్లోర్‌ను బాగా శుభ్రంగా ఉంచాలి. పాపాయి కంటికి కనిపించే వస్తువులన్నింటినీ నోట్లో పెట్టుకుంటుంది. అపరిశుభ్రమైన, దుమ్ముపడిన వస్తువులను, బట్టలు లాంటివాటిని, ఫ్లోర్‌మీద పాకిన చేతులను నోట్లో పెట్టుకోవడంవలన ఆ అపరిశుభ్రత పాపాయిల అనారోగ్యాలకు కారణం అవుతుంది. పిల్లలకోసం ప్రత్యేకంగా తయారుచేయబడిన బేబీఆయిల్, బేబీ సోప్, బేబీ పౌడర్ లాంటి వాటినే వాడాలి. పాపాయికి వాడే ప్రతి వస్తువు విషయంలోనూ తల్లి పరిశుభ్రతను జాగ్రత్తలను పాటించినట్లయితే, పిల్లలు ఆరోగ్యవంతంగా పెరగడమే కాకుండా వారికి అంటువ్యాధులు, చర్మ వ్యాధులు రాకుండా ఉంటాయి.

- పి.ఎం. సుందరరావు 9490657416