ఐడియా

అందమైన ముఖ చర్మానికి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముఖం అందంగా, నునుపుగా ఉండాలని అనుకోవటం సహజం. ముఖచర్మంపై ఉన్న స్వేదరంధ్రాలపై దుమ్ము, ధూళి అంటుకోవడంతో పాటు ముఖం జిడ్డుగా తయారై వెంటనే మార్కెట్లో దొరికే సౌందర్య సాధనాల్ని కొని ఉపయోగిస్తుంటారు. దీనివల్ల స్వేదరంధ్రాలు మూసుకుపోయి ముఖం అందాన్ని కోల్పోతుంది. ఇలా కాకుండా అందమైన ముఖం కోసం ఇంట్లోనే సులభమైన చికిత్సలను నిర్భయంగా వాడుకోవచ్చు.
* రోజూ ఉదయానే్న కలబంద గుజ్జును తీసి ముఖంపై పట్టించి రుద్దాలి. ఇరవై నిముషాల తర్వాత వేడినీటి స్నానం చేయడం వల్ల ముఖ చర్మం బిగుతుగా తయారై పెద్దవైన చర్మరంధ్రాలు దగ్గరకు వచ్చి చర్మం నునుపు అవుతుంది.
* రోజ్‌వాటర్‌తో ముఖం తరచుగా శుభ్రపరడం వల్ల చర్మంపై ఉన్న సూక్ష్మరంధ్రాలు పరిశుభ్రంగా తయారవుతాయి.
* తేనె, నిమ్మరసం, కొద్దిగా చక్కెర కలిపి ఆ మిశ్రమాన్ని ముఖంపై పూయాలి. ఆ మిశ్రమం ఆరిపోయాక ముఖాన్ని చల్లటి నీటితో కడగాలి.
* ఒక గినె్నలో టొమాటో రసం, నిమ్మరసం, పాలు, కొద్దిగా నూనె కలిపి ముఖానికి పట్టిస్తుంటే ముఖ చర్మం అందంగా తయారవడమే కాక, మొటిమలు, మచ్చలు తొలగిపోతాయి.
* బాదం పప్పులను మెత్తగా నూరి ముఖానికి అంతా పట్టించాలి. ఇరవై నిముషాల తర్వాత నీటితో కడిగేయాలి.
* అందమైన ముఖ చర్మం కోసం పెరుగు బాగా ఉపయోగపడుతుంది. ముఖానికి పెరుగు పట్టిస్తే అందులో ఉండే లాక్టిక్ ఆసిడ్ చర్మ రంధ్రాలను శుభ్రపరుస్తుంది. ముఖంపై ఉన్న జిడ్డును కూడా పోగొడుతుంది.
* ముఖంపై తేనెను రాస్తే ముఖం తాజాగా కాంతులీనుతుంది.
* నీటిలో కీరదోస రసం గాని, ఆపిల్ రసంగాని, గ్రీన్ టీగాని కలిపి ఫ్రిజ్‌లో ఐస్‌గా చేయాలి. ఈ ఐస్‌ను ఓ శుభ్రమైన గుడ్డలో మూటకట్టి ముఖంపై కొద్దిసేపు ఉంచి కడిగేయాలి. ఇలా రెండు, మూడు సార్లు చేస్తే చర్మం అందంగా తయారవుతుంది. చూడగానే ముఖం నున్నగా, అందంగా కనిపిస్తూ కాంతులీనుతుంది.