Others

భారతీయాత్మ అటల్జీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేహం మనసూ హిందూ హిందూ
జీవితమంతా హిందూ హిందూ
కణం కణంలో హిందూ హిందూ
నా పరిచయమిది హిందూ హిందూ ॥ దేహం॥
(హిందూ తన్ మన్ హిందూ జీవన్
రగ్ రగ్ హిందూ మేరా పరిచయ్)
.. ‘నా పరిచయమిది..’ అంటూ దివంగత మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజపేయి చెప్పిన కవితలోని ఈ పరిచయం యథార్థం. ఆయన పదవ తరగతిలో వ్రాసిన కవిత ఇది. అప్పుడప్పుడే ‘స్వయం సేవక్’ అయిన తొలి దశ అది.
భారతదేశ సామాజిక, రాజకీయ పరిస్థితులనవలోకించి, జమ్మూ కశ్మీర్‌ను ఆక్రమించాలనే ప్రయత్నంలో మాటిమాటికీ జరుగుతున్న పాకిస్తాన్ దురాక్రమణ మనస్తత్వాన్ని ఎండగట్టిన కాలంలో వ్రాసిన ‘జమ్మూకీ పుకార్’ అనే కవితలోని ఓ భాగం ఇది.
.. ఏమిటిది దేశమ్ము మళ్లీ/ చీలి ముక్కలు చెక్కలవునా!
రక్తసిక్తమ్మయి ధరిత్రి / నెత్తుటేరుల రుదిస్తుందా!
ఎంతవరకీ అసుర మాయల/ జ్వాలలిచ్చట క్రమిస్తాయి!
ఏమి భస్మాసురుని అడుగులు/ ఎన్నినాళ్లిల స్పృశిస్తాయి!
ఎంతవరకీ జమ్మూ ప్రాంతం/ జ్వలించంగా సహిస్తామో!
ఎంతవరకీ హింసామద్యం/ స్రవించంగా వహిస్తామో!
ఎంతవరకీ లాఠీ గోళీ/ వౌనులంగా భుజిస్తామో!
ఎంతవరకీ శత్రుమూకలు/ రక్తహోళీలాడుతాయో!
సహనమునకొక హద్దు ఉంటది/ అబ్ధి కడుపున అగ్గి ఉంటది!
మలయ పవనం తుఫానవుతది/ భోళాశంకరుని ఫాలనేత్రం
తప్పకుండా విచ్చుకొంటది...
దేశరక్షణ నిమిత్తం ఇలా అటల్జీ ఇచ్చిన సందేశం అపూర్వమైంది. ఇప్పుడాయన లేరు. 2018 ఆగస్టు 16న- 93 సంవత్సరాల భారత పూర్వ ప్రధానమంత్రి, కవి, పాత్రికేయుడు, రాజనీతి దురంధరుడు, పండితుడు, విమర్శకుడు, సమరసతావాది, సమన్వయవాది, ప్రఖర దేశభక్తుడు, యోగి అరవిందులు చెప్పిన అఖండ భారతాన్ని దర్శించిన మహాద్రష్ఠ, దార్శనికుడు, అన్నిటినీ మించి భారత జాతీయాత్మ, ఆజన్మ బ్రహ్మచారి అయిన అటల్ బిహారీ వాజపేరుూ నేడు మన మధ్య లేరు. కాని ఆయన అక్షరాలున్నాయి.. ఆ అక్షరాల అంతరంగాలున్నాయి. వాటిని అధ్యయనం చేసే భారతీయ జనత ఉన్నది.
భారత దేశ వికాసానికి, జాతీయాభ్యుదయానికి
ఆ రాజనీతిజ్ఞుడు చెప్పిన కొన్ని మాటల్ని విశే్లషించుకొందాం.
* హిందుత్వం మతం కాదు; అది జాతీయవాదం.
* జాతీయ భద్రత దేశ ప్రప్రథమ ఆవశ్యకత.
* కశ్మీరు విషయంలో 370వ ఆర్టికల్‌ను తొలగించాలి.
* ఉమ్మడి పౌర చట్టం కావాలి.
* అయోధ్యలో రామజన్మభూమి నిర్మాణం జరగాల్సిందే.
* భారత ప్రభుత్వం అణ్వస్తశ్రక్తిని సాధించాలి.
* విజ్ఞాన శాస్త్ర సాంకేతిక రంగాలు వికసించాలి.
* ‘జై జవాన్- జై కిసాన్’ నినాదానికి ‘జై విజ్ఞాన్’ కూడా కలపాలి.
* జాతి సంస్కృతి- సంప్రదాయాలు హిందుత్వ విలువల నుండే
ఆవిర్భవించాయి.
* ఈ దేశం (హిందుత్వం) సెక్యులరిజాన్ని అనాదిగా అనుసరిస్తోంది. సెక్యులరిజం అంటే సర్వధర్మ సమభావం, సమాన న్యాయం, అన్ని
మతాలకూ సమాన ఆదరణ.
* కులతత్త్వం- కుల రాజకీయాలు పనికిరావు.
* అంటరానితనం హిందూ ధర్మంలో లేదు. అది వికృతి, దురాచారం; దాన్ని నిర్మూలించాలి; అది పాపకార్యం; అది మన సంస్కృతికే ముప్పు.
* భారతదేశం సెక్యులర్‌గా ఉండడానికి హిందువులు అధిక
సంఖ్యాకులుగా ఉండడమే ప్రధాన కారణం.
* భారతదేశం అణ్వస్త్ర రహితంగా మారాలి. కాని అన్ని దేశాలు ఆ విధానాన్ని అనుసరించినప్పుడే అది సాధ్యం.
* సుసంపన్న గ్రామీణ భారతమే మా ఆకాంక్ష; గ్రామసీమలను సౌభాగ్య సీమలుగా తీర్చిదిద్దడమే మా ధ్యేయం.
* గాంధేయ సోషలిజమే మా మార్గం. గాంధేయ సోషలిజమంటే గాంధీజీ ఆశించిన రామరాజ్యం- గ్రామ స్వరాజ్యం; దీనదయాళ్‌జీ ఏకాత్మ మానవతావాదం, ఆర్య చాణక్యుని ధర్మకర్తృత్వ సిద్ధాంతం... ఇవన్నీ కలిపితే గాంధేయ సోషలిజం.
ఇవీ స్థూలంగా వాజపేయి ఆలోచనలు; ఈ దేశం గురించి,
ధర్మం గురించి, జాతి గురించి, సంస్కృతి గురించి,
వీటి పరిరక్షణ గురించి నిరంతరం తపించిన ఆయన
ఒక ఉపన్యాసంలోని కొన్ని ఆలోచనలు పరామర్శిద్దాం.
* గతం లోపలి మంచిని స్వీకరిద్దాం. ప్రగతి కాముక భావాలతో
ముందుకు సాగుదాం.
* హక్కులనూ బాధ్యతలనూ నిర్వహిస్తూ మనం జాగరూకతతో నడవాలి.
* వ్యక్తిగత సామర్థ్యం, దేశభౌతిక సంపదలను పెంచాలి.
* శాంతి సామరస్య భారతాన్ని నిర్మించుకోవాలి.
* అక్షరాస్యత, కార్యశీలతతోపాటు, ఆకలి-అజ్ఞానం లేని ధాత్రిగా భారత్ వెలిగిపోవాలి.
* శాస్తవ్రిజ్ఞానం విస్తరించి ప్రజాసంక్షేమ కార్యక్రమాలు జరగాలి.
* ప్రపంచంలో భారత్ గుర్తించబడాలి; నవ్యవిజ్ఞానాన్ని ఆశ్రయించాలి.
* సాంకేతిక విజ్ఞానం ద్వారా ఉన్నత స్థానంలో దేశం నిలవాలి.
* ప్రజల సుఖ సౌభాగ్యాలకు రక్షణ అత్యవసరం.
* నీతి కలిగిన, నిర్ణయాత్మక, సుస్థిరమ్మగు పాలనే శుభం శుభం.
* ప్రభుత్వం సుదృఢంగా ఉండాలి; పారదర్శకంగా ఉండాలి; నిత్య చైతన్యంతో పనులు చేయాలి; ప్రజలపై శ్రద్ధ ఉంచాలి. ప్రజారక్షణ ప్రభుత్వంగా వ్యవహరించాలి.
ఇన్ని ఆలోచనలున్న క్రియాశీల కార్యకర్తగా వాజపేయి ఎదగడానికి- ఆయన వెనుక ప్రాచీన- అర్వాచీన భారతీయ విజ్ఞానశాస్త్ర సంపద ఉన్నది. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శిక్షణ ఉన్నది. జమ్మూ కశ్మీరు నిమిత్తం ప్రాణాలర్పించిన శ్యాంప్రసాద్ ముఖర్జీ నేతృత్వమున్నది. ఏకాత్మ మానవతావాద ప్రవక్త పండిత దీనదయాళ్‌జీ మార్గదర్శనమున్నది. అందుకే అటల్జీ మన కళ్లముందు భారత జాతీయాత్మగా కనిపిస్తారు.
*
(నేడు అటల్ బిహారీ వాజపేయి వర్థంతి)

-ఆచార్య కసిరెడ్డి 98669 56250