Others

మితభోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాత్రి తీసుకునే భోజనం మితంగా ఉండాలి. నిద్రకు ఉపక్రమించే ముందు డిన్నర్ తీసుకుంటాం.. కాబట్టి భోజనం తరువాత ఫిజికల్ యాక్టివిటీ ఉండదు. అందుకని పరిమితిని మించి తీసుకునే ఆహారం, నిద్రలేచిన తర్వాత కూడా రోజంతా మైకం ఆవరించి ఉండేలా చేస్తుంది. అతిగా తినడం అజీర్ణానికి దారితీస్తుంది. రాత్రి నిద్రవేళల్లో జరిగే కొన్ని జీవక్రియలు స్థాయిని మించి పనిచేయడం ద్వారా పైత్యప్రకోపాలకు గురయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. క్రమంగా నిద్రపట్టకపోవడం, ఉదయం ఆలస్యంగా నిద్రలేయడం వంటివి జరుగుతుంటుంది. కావున రాత్రివేళల్లో పరిమిత ఆహారాన్ని తీసుకోవలసినదిగా సూచించడమైనది. అలాగని అతితక్కువగా ఆహారం తీసుకోవడం కూడా సరైనది కాదు. ఈ చర్యలు సగం రాత్రిలో ఆకలి మరియు గ్యాస్ సమస్యలకు కారణం అవుతుంది. దీనివల్ల నిద్రాభంగం కలుగుతుంది. కావున సరైన మోతాదులో ఆహారం తీసుకుంటే మంచిది. అంతేకాకుండా నిద్రకు ఉపక్రమించే రెండు గంటల ముందు ఆహారం తీసుకోవలసి ఉంటుంది.