Others

సూర్య శతకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తే.గీ. తప్పుదారల ఁ దండో పతండములుగఁ
దరలిపోదురు సన్మార్గమరయఁబోరు
మనుజ జన్మకు మచ్చగ మనుటయేల?
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!
భావం: ఈరోజుల్లో అంతాసన్మార్గాన్ని చూడకుండా వక్రమార్గంలో అంటే తప్పుడు త్రోవలోనే తరలిపోతున్నారు. ఇది కూడదన్న ఆలోచన లేశమాత్రంలేకుండా పోతున్నారు. మహోదాత్తమయిన, భగవంతుని వరప్రసాదంగా లభించిన మానవజన్మకే మచ్చతెచ్చే విధంగా ఆ బ్రతుకు బ్రతకడం కన్నా చావడమే నయం. కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! చూడవయ్య.
తే.గీ. పిలచినను వినిపించుకోవేల? యనిన
దృష్టి మరలించబోనయ్య కష్టమనుచు
తెగనరికినట్లు ఁ బల్కెనో తీరుభామ
చూడుమో కర్మసాక్షి! యోసూర్యదేవ!
భావం: ఒకటికి పదిసార్లు పిలిచినా పట్టించుకోని భార్యను గాంచి, ఎంత పిలిచినా వినిపించుకోవెందుకు ? అని కాస్త బాధగా అడిగిన భర్తనుద్దేశించి టీవీ సీరియల్ పూర్తయ్యేవరకు నేను దృష్టి మరల్చనని ఆ భామ తెగేసి మరీ చెప్పేసింది. ఇటువంటి స్ర్తిమూర్తులు భారతదేశం లో ఉండడం ఏంటయ్యా? కర్మసాక్షివైన ఓ సూర్యదేవ! అఘాయిత్యం చూడవయ్య.

- కొడుకుల సూర్యసుబ్రహ్మణ్యం 9492457262