Others

పంద్రాగస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొన్ని తరాల త్యాగాన్ని
ఒక్క రోజు.. కాదు కాదు ఒక్క పూట
గాంధీ తాత బొమ్మ సాక్షిగా
కొద్ది గంటలు
అలా గడిచిపోతాయి

ముసలి ముతక లాంటి నిన్నటి తరం
వాళ్ళు మిఠాయిలు పంచుతూ
మైకులో పాతకాలపు
దేశభక్తి పాటలు
వినిపిస్తారు.
ఈ జనం అనుభవిస్తున్న
స్వేచ్ఛ వెనుక ఎన్ని కష్టాలున్నాయో
నెమరువేసుకుంటారు
అయినాకూడా ఎవరికీ పట్టదు

ఇప్పటి కాలం వారికి
అదొక సెలవుదినం
సినిమాకి పోవడానికో
మిగిలిపోయిన పనులు
చేసుకోవడానికో
అదనంగా కలిసి వచ్చే
అయాచిత వరం

ఒకప్పటిలా
బళ్ళో పిల్లల మూకుమ్మడి
మార్చ్ఫాస్టులు లేవు
జెండా చేతబూని
వందేమాతరం జైహిందుల నినాదాలు
అస్సలు వినపడవు
కార్పొరేట్ పాము మింగేశాక
జాతీయత కాస్త
విదేశీపరమయింది

జనవరి ఫస్ట్‌లు
వాలెంటైన్‌లు
రోజుకో వారోత్సవం
చేసుకునే వైపరీత్యాల
నడుమ స్వాతంత్య్రం ఎలా
మనగలుగుతుంది?

చరిత్రగా మిగిలిన ఆనాటి గాథల్ని
పుటలలో భద్రపరిచిన వాటిని
తెరిచి చూడాల్సిన
సమయమిదే

అవ్వడానికి పండగే గాని
నీ ఘన చరిత్రని తలుచుకొని
బాధ్యతా రాహిత్యపు
జనాల నడుమ సిగ్గుతో
తలవంచుకుంటావెందుకు?
తల ఎత్తుకొని గర్వంగా
నిలబడు జాతీయమా..

పంద్రాగస్టు అంటే
అదనంగా వచ్చే సెలవు దినం కాదు
అదొక చరిత్ర
బానిసత్వపు సంకెళ్ల నుంచి
మనిషిగా పుట్టిన రోజు

ఏ దేశమేగినా ఎందుకాలిడినా
పంద్రాగస్టు కలకాలం మనలో
నిలిచిపోవాలని కోరుకుందాం!

-పుష్యమీ సాగర్ 90103 50317