Others

నది సార్ధతికోటి!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవనది సార్థత్రికోటికి కొలువది!
తరాల సంస్కృతుల్ని జీవన నాగరికతలు
ప్రవాహార్థ్రతలుగా కాలం వెంబడి
సార్థక్యం దాలుస్తుంది

ఆపావనాదారాలు
సకలకల్మషహరణాలు
నిత్యవిలసితంగా
సత్యమహిమాన్వితమై
లోక హితం కోరే పుణ్యవారాశినది..
సాచిన వేల వందల జలహస్తాలోంచి
దృశ్యమానమయ్యేలా
పధగమనం తెలియజెప్తోంది

అటుభౌతిక - ఆదిభౌతికాలు
తాత్విక - తార్కిక చింతనలకు
బిందువు నుంచి సింధువు
దాకా పయనం
నిత్య తరంగిణి - నిసర్గ సుందరీమణి
ఆ సస్యకేదారాల పురి డింపుల్లా
వినిపిస్తున్న సరసగాంధారాలు
సామగానామృతాల ఆకర్షింపులు

అనుభవేక వేద్యాలుగా
రసప్లావితం చేస్తోంది
జలమే జీవనం - జనం
అన్నలోకోక్తిని ఆచంద్రార్కం
అనుసరణీయం
నీరేజనీరదాల నిత్యత్వం
నీల వవుషాల పరివ్యాపనం
ఎన్ని ఆశల మధు హృదయాల్ని
తాకుతుందో కదా!

జీవనావిష్కరణల్లోంచి-
కాలం సంపుటాల
ఇతిహాసాల్లో -
ఆది గంగా గోదావరి
పేరేదైనా -
ఆ జలం - ఆ సేతు హిమాచలం
జీవన స్పర్శలో
-మాతృకలు నీరాజనాలందుకుంటూ
పాంచభౌతిక ప్రకృతికి ప్రణమిల్లుతూ
సర్వజనహితవరం
నది వర్తమానంలో
ఆపాదించే దైవీ భావనం
అనివార్యతలు

- వి.ఎన్.ఆర్.ఎన్. సోమయాజులు 94411448158