Others

రాసక్రీడా వినోదుడు యశోదాసుతుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సర్వ పురాణ శిరోమణి అయిన శ్రీమద్భాగవత సందేశాన్ని శ్రీ శుకదేవుడు పరీక్షిన్మమహారాజుకు అందిస్తూ , రాజుకు ఉత్తమగతులను కల్గించుటకు రాధాసహితుడైన శ్రీకృష్ణుని రాసక్రీడను వర్ణించి సర్వదేశశిరోమణియైన శ్రీకృష్ణుని దర్శింపచేశాడు. ఈ రాసక్రీడలో ప్రధాన నాయిక రాధాదేవి.
‘రాసకూపజలోపమం’ అను శాస్త్ర వచనానుసారం దిగుడు బావిలో నీరుజాగ్రత్తగా పరిశీలిస్తేనే గాని కన్పడవు. భాగవతంలోని రాసక్రీడ కూడా ఇలాంటిద. ఈ రాసక్రీడలోని పరమార్థాన్ని గుర్తించిన వారు ధన్యులు. పూజ్యులౌతారు. భక్తులు గాని వారికి రాధావిషయాలు తెలుపరాదని, తన ఉపాసనా దేవత పేరును పదిమందిలో పేర్కొన రాదని శ్రీ శుకదేవులు రాధాదేవి పేరును తెలుపలేదని ఆరోక్తి. శరీరంలో ఆత్మదాగి ఉన్నట్లు భాగవతంలో రాధని గూఢంగా ఉన్నది.
ఇంక గోపికల విషయానికి వస్తే రాసక్రీడకు రావడం శ్రీకృష్ణునికి ఆలస్యం అయినదని గోపికలు విరహవియోగ బాధతో కృష్ణుని పలురకాలుగా ఆహ్వానించారు. వర్ణించారు. వారి మానసిక స్థితిని భాగవతంలో పోతన పలురకాలుగా రచించి గోపికలు తీవ్రంగా తమ బాధను వ్యక్తం చేసిన పిమ్మట మాధవుడు రానే వచ్చాడు.
రాసక్రీడలో పాల్గొన్న గోపికలు జ్ఞానానికి ప్రతీకలు. వారి జ్ఞానానికి ప్రతీకగా ఫలించినది పరతత్త్వ వస్తువే సర్వేశ్వరుడైన శ్రీకృష్ణ భగవానుడు. వేదం ఇలా తెలిపింది. ‘సర్వేశ్వరాణాం- పరమం మహేశ్వరం’ అని శ్రీకృష్ణుడే తెలిపాడు. గోపికలు నగవత్ ప్రీత్యర్థం జీవన ధారణ చేసినవారు. ముక్తి వారికి కరమతలామలకమైన పూర్ణ్ఫలం. కానీ వారు దాన్ని కూడా నిరసించారు. భగవత్ స్వరూప విషయంలో సంపూర్ణ జ్ఞానం కల్గినవారు గోపికలుఅమాయకులుగా గోచరిస్తారు. లోకం దృష్టిల మహాభక్తులైన వారు అలానే ఉంటారని భాగవతం వర్ణించింది. ఈ గోపికారమణులు భగవంతుని యందు ప్రియ తమ భావం కలవారు సర్వం అర్పించినవారు . కష్టసుఖాలను త్యజించినవారు. భగవానుడైన శ్రీకృష్ణుని సంపూర్ణ ప్రేమతో అనుభవించి పరిశుద్ధమైన ప్రేమ భక్తితో విలసిల్లినవారు గోపికలు. రాసలీలల్లో గోపికల దేప్రధాన పాత్ర. రసస్వరూపుడు శ్రీకృష్ణుడు. రాస శబ్దాకి మూలం రసం. రసో వైసః అని శృతివాక్యం. రాధాకృష్ణులు ప్రేమభక్తులు. సాధకుల హితం కొరకు భక్తిక్షేత్రమైన బృందావన దివ్యధామంలో ఈ రాసలీలలను జరిపినారు. ఈ రాసలీలావినోదాన్ని ఆటను దర్శించి శ్రీవణం చేసినా, గానం చేసినా, స్మరించినా, చింతన చేసినా భక్తి బంధువులకు ఈ లీలబ్రహ్మానందానుభవాన్ని కల్గిస్తుంది. ఈ రాసలీలలో మిళితమైన వారుధన్యులు.
శ్రీకృష్ణుని వంశీరవము. గోపికల అనే్వషణ. అ దైవంతో సంభాషణ రాధతో బాటు పరమాత్మ మాయ మవడం తిరిగి దర్శనమివ్వడం మనోజ్ఞచిత్రం. దర్శనమివ్వగనే గోపికలు శ్రీకృష్ణుని కొరకు వస్త్రాలు పరచినారు. వాటిపై పరమాత్మ ఆసీనుడైనాడు. గోపికల రసహ్యమైన ప్రశ్నలకు ప్రత్యుత్తరమందించాడు. రాసనృత్యం , క్రీడ, జలకేళం, వనవిహారం మున్నగునవి మానవ భాషలో వ్యక్తమైనప్పటికీ అవి సుపవిత్రములు. దివ్యములై అలరారినవి. భగవంతుని దివ్యలీలలు వర్ణింప ఎవరి తరముకాదు.

-పి.వి.సీతారామమూర్తి 9490386015