Others

గళం విప్పిన గాంధారి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కురుక్షేత్ర యుద్ధం ముగిసింది. రణరంగంలో ఇంకా ఎక్కడి శవాలక్కడే పడి వున్నాయి. పాండవులు శ్రీకృష్ణుని వెంటబెట్టుకుని గాంధారి, ధృతరాష్ట్రుల వద్దకు వెళ్ళారు. పెదతండ్రి పాదాలమీద పడ్డారు. ధర్మరాజు చేతులు జోడించి ‘పెదనాన్నా! వంశ నాశనానికి పాల్పడిన పాపిని నన్ను నిందించు.. శపించు’ అంటూంటే, భీమసేనుడు ‘‘పెద్దమ్మా! నీ కొడుకులందరినీ సంహరించిన పాపిని, నన్ను శపించు’’ అన్నాడు దుఃఖిస్తూ. గాంధారి తన ఆవేదనను అణచుకుంటూ ‘‘పెద్దదాన్ని, నేనెలాగైనా తట్టుకుంటాను. పుత్రశోకంతో విలపిస్తున్న ద్రౌపదిని చూసుకోండి నాయనా’’ అంటుంది. ధృతరాష్ట్రుడు, భీమసేనుని సాహసం నాకెంతో ఆనందం కలిగించింది. ఒక్కసారి అతడ్ని కౌగిలించుకుని అభినందించాలని వుంది అంటాడు. కృష్ణపరమాత్మ ధృతరాష్ట్రుని ఆంతర్యం గ్రహించి, పెదతండ్రి వద్దకు వెళ్ళబోతున్న భీముని ప్రక్కకు నెట్టి అతనికి బదులుగా అతని లోహ విగ్రహాన్ని ధృతరాష్ట్రుని ముందుంచుతాడు. ధృతరాష్ట్రుడు కసితీరా ఆ విగ్రహాన్ని ‘్భమా! భీమసేనా!’ అంటూ కౌగిలించుకుంటాడు. ఆ బిగి కౌగిలిలో ఆ విగ్రహం నుగ్గు నుగ్గయింది. భీమసేనుని పని అయిపోయిందని అంధరాజు మనసుతీరా పెద్ద అట్టహాసం చేస్తాడు. శ్రీకృష్ణుడు నవ్వి ‘‘మామా! నీ ముందుంచినది భీమసేనుని విగ్రహం మాత్రమే! నీ ఉద్దేశ్యం తెలిసి నేను ఈ ఏర్పాటుచేశాను. భీమసేనుడు క్షేమం. ఇపుడు భీముని చంపితే, చనిపోయిన నీ పుత్రుల్లో ఏ ఒక్కరైనా తిరిగి వస్తారా? నీ బుద్ధి చూపించుకున్నావు.. అంతే!’’ అని మందలించాడు. ధృతరాష్ట్రుడు తలదించుకున్నాడు.
సంజయునికి యుద్ధరంగాన్ని చూసి ప్రత్యక్షప్రసారం చెయ్యగల శక్తిని ప్రసాదించినట్లే, వ్యాసుడు తనకు ప్రసాదించిన శక్తివల్ల, తన పతివ్రతా నియమానికి భంగం వాటిల్లనియ్యకుండా యుద్ధ్భూమిలోని దృశ్యాలను అవలోకించగలిగిన గాంధారి, శ్రీకృష్ణుడు పాండవులతో నిష్క్రమించబోతుంటే.. ‘‘వాసుదేవా! నీతో కొంచెం మాట్లాడాలి, వుండ’’మని, ‘‘కృష్ణా! యుద్ధరంగం మధ్య నిలబడి, ఇంత కథ నడిపించిన నీకు జరిగిన విషయాలు తెలియనివి కావు. చూడు! చక్రవర్తుల పాదాభివందనాలు అందుకుంటూ, హంసతూలికా తల్పంమీద పడుకుని, సంగీత నాట్యాలను అవలోకిస్తూ నిద్రపోయే బిడ్డ, కుక్కలు, నక్కల అరుపులు వింటూ బండరాళ్ళమీద తొడలు విరిగి పడి వున్నాడు. వాడు.. వాడు నా కొడుకయ్యా.. పెద్దకొడుకు! అదిగో ఆ శవాన్ని రాబందులు ముక్కులతో పొడుస్తూంటే, వాటి ముక్కులు వంగిపోతున్నాయి కాని లోనికి దిగటంలేదు. ఉక్కులాంటి, మెరుపుతీగలాంటి ఆ శరీరం ఎవరిదనుకున్నావు. నా బిడ్డడు వికర్ణుడిది! నేల కూలి మూడు రోజులయినా కాంతులీనుతున్న ఆ వదనారవిందమెవరితో కాదు, ఎవరిమీదైతే నా కొడుకు ఆశలన్నీ పెట్టుకుని యుద్ధానికి దిగాడో.. అతడిదే.. పరశురాముని శిష్యుడైన కర్ణుడిది! అక్కడ చూడు.. అందరిచే సాష్టాంగ నమస్కారాలందుకున్న పాదాలను కుక్కలు, నక్కలు పీక్కుతింటున్నాయి. ధనురాచార్యుడు ద్రోణాచార్యుని స్థితి అది! ఆయనతోపాటు అస్తవ్రిద్య అస్తమించింది! సహదేవుని చేతిలో హతుడై పడి వున్నాడు నా తమ్ముడు.. ఈ మారణహోమానికంతటికీ కారణభూతుడు వాడే.. వాడే. ఎవరి అని ఏం లాభం? వినాశకాలే విపరీతబుద్ధి అని, పోగాలం సమీపించినప్పుడు హితవచనాలు తలకెక్కవు!
ఇంకా విను.. తండ్రి సవ్యసాచి, గదాదండంతో శత్రువులను నిర్జించగల బహుపరాక్రమశాలి పెదతండ్రి, జగన్నాటక సూత్రధారి మేనమామ! అయినా.. అయినా యుద్ధ్భూమిలో విశ్రాంతిగా నిద్రిస్తున్నట్లున్నాడు. వాడు నీకు తెలియదా?! రణక్రీడా నిపుణుడు, లక్షలాది వీరులను యమపురికి పంపినవాడు, కురువంశోన్నతి కోసం తన సర్వస్వం ధారపోసిన త్యాగశీలికి పట్టిన గతి చూడు! కృష్ణా, ఆ పితామహుని చూడు! అంతఃపురం విడిచి రాని నా కోడళ్ళు.. జుట్లు విరబోసుకుని, నెత్తి నోరు బాదుకుంటూ, గుండెలవిసేలా ఏడుస్తూ రణభూమిలో పిచ్చివాళ్ళలా తిరుగుతున్నారు. చూడు.. గోవిందా! నువ్వు నిజంగా తలుచుకుంటే ఈ మారణహోమాన్ని ఆపలేకపోయేవాడివా?! కావాలని రెచ్చగొట్టి చేసిన పాపానికి ప్రాయశ్చిత్తంగా నీ వంశీయులందరూ కుటుంబ కలహాలతో నాశనమైపోతారు’’ అని తలదించుకుంది గాంధారి! బదులు పలకకుండా చిరునవ్వుతో నిలబడిన శ్రీకృష్ణుని చూసి కడుపుమంట చల్లారని గాంధారి, ‘‘కృష్ణా! ఇంత చేసిన నువ్వు దిక్కులేని చావు చస్తావు’’అంది కసిగా!
సన్మానాలకు, అవమానాలకు అతీతుడైన వాసుదేవుడు, చెరగని చిరునవ్వుతోనే నిష్క్రమిస్తాడు.. ఎవరు చేసిన కర్మలు వారు అనుభవించి తీరుతారు అన్నట్లు! ఎంతటి పతివ్రతలైనా, మహామహులైనా, తమను తాము నిగ్రహించుకోగల శక్తిమంతులైనా, తనవారి వినాశనం కళ్ళారా చూసినప్పుడు విచక్షణను మరపించి కడుపు తీపి వారిని విచలితులను చేస్తుంది. ఆ కడుపు తీపే ‘మంట’గా మారుతుంది. ఎదుటివారు ఎంతటివారైనా, మాటలతోనో (శాపాలు), చేతలతోనో కసి చల్లార్చుకునేలా చేస్తుంది. ఇది లోక సహజం!

-రేవతి