Others

పాడవోయి భారతీయుడా (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దేశభక్తి గీతాల్లో అత్యంత ప్రాచుర్యం పొందిన పాట. నవీన భావాలతో వాసి కలిగిన పది పాటల్లో ఇదొకటి. ఈ పాట 1961లో అన్నపూర్ణ సినీ బ్యానర్‌పై వచ్చిన ‘వెలుగు నీడలు’ చిత్రంలోది. ఆధునిక భావాలతో మహాకవి శ్రీశ్రీ రచిస్తే, పెండ్యాల తన సుస్వరాలతో ప్రాణం పోశారు. ఘంటశాల, పి సుశీల తన గాత్రంతో పాటను అజరామరం చేశారు. వెలుగు నీడలు చిత్రంలో హీరో హీరోయిన్లు అక్కినేని నాగేశ్వర రావు, సావిత్రి. సినిమాలో వీరి అభినయం అజరామరం.
ఒక మంచి గీతాన్ని, సామరస్య వాతావరణాన్ని, దేశభక్తి ప్రబోధం, పెద్ద రచనను ప్రోత్సహించటం నాటి దర్శక, నిర్మాతల, నటీనటుల గొప్పదనం. దానిని వినేటట్లుగా సంగీత బాణీని, గళాలను అందించినవారు ప్రాతఃస్మరణీయులే. ఆదుర్తి సుబ్బారావు దర్శకుడిగా అక్కినేనికి అందించిన హిట్ సినిమా ఇది.
శ్రీశ్రీ మార్క్సిజమ్‌ను మనసంతా నింపుకున్నా, సందర్భాన్నిబట్టి సుకుమారమైనా పాటలూ వెలువరించారు. ప్రేమ గీతాలూ, విరహగీతాలు రాయటం ఏ కొద్దిమందో హక్కుగా భావించే రోజుల్లో, వాటిని తనదైన శైలిలో రచించి మెప్పుపొందిన ఈ శతాబ్దపు శబ్దబ్రహ్మ శ్రీశ్రీ. అందుకే -వెలుగునీడలు చిత్రంలోని ఈ గీతం పంధ్రాగస్టు వచ్చిందంటే వాడవాడలా మోగే సంచలనమే. దాదాపు ఆరు దశాబ్దాల కిందట రాసిన ఈ గీతంలోని భావం.. ధరలు, అవినీతి, బంధుప్రీతి, కులమత బేధాలు, భాషాద్వేషాలు, పదవీ వ్యామోహాలు, ప్రతి మనిషీ మరొకరిని దోచుకొనే దుష్ట సంప్రదాయం.. అనే పదాలు ప్రతి వ్యక్తినీ మేల్కొలిపేవే. పాడవోయి భారతీయుడా/ ఆడి పాడవోయి విజయ గీతికా..
నేడే స్వాతంత్య్ర దినం/ వీరుల త్యాగఫలం/ నేడే నవోదయం నీదే ఆనందం అంటూ స్వాతంత్య్రవీరుల త్యాగాలు గుర్తుచేశాడు శ్రీశ్రీ. హక్కులెంత అవసరమో బాధ్యతలూ అంతే అవసరమని గుర్తు చేశాడు. సాధించిన దానికి సంతృప్తిని పొందీ అదే విజయమనుకొంటే పొరపాటోయి -అంటూ ప్రభోదాత్మకాన్ని గుర్తు చేశారు. ఇది ఎప్పుడు విన్నా స్ఫూర్తిదాయకమే.

ఎల్ శ్రీనివాస రావు, అద్దంకి