Others

క్రీడాభివృద్ధి అవసరం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అసోంలో క్రీడా సౌకర్యాలు ఏమాత్రం లేని ఒక మారుమూల గ్రామంలో పుట్టి ప్రపంచ అథ్లెటిక్స్‌లో మన దేశానికి బంగారు పతకం సాధించిన తొలి అథ్లెట్ హిమదాస్. కేవలం 20 రోజుల వ్యవధిలో 5 అంతర్జాతీయ స్వర్ణ పతకాలు సాధించిన ఘనత దక్కించుకున్నది.
థింగ్ ఎక్స్‌ప్రెస్‌గా పిలువబడుతున్న హిమదాస్ సాధించిన విజయాలు ఆషామాషీ కాదు. అంతర్జాతీయ అథ్లెటిక్స్‌లో పతకం సాధించడం అనేది సులువు కాదు యావద్భారతావని హర్షించే విధంగా ఆమె విజయాల పరంపర కొనసాగించడం భారతీయులందరికీ గర్వకారణం కానీ ఆమె సాధించిన విజయాలను ఎవరూ పట్టించుకోలేదని ఆమెకు రావాల్సిన పబ్లిసిటీ దక్కాల్సిన ఖ్యాతి దక్కలేదని సామాజిక మాధ్యమాలలో విమర్శలు వస్తున్నాయి.
హిమదాస్ వెనుకబడిన నిమ్న వర్గాలకు చెందిన క్రీడాకారిణి కాబట్టి ఆమె గురించి ప్రధాన మీడియా, ప్రధాన పత్రికలు ఎంత ప్రాధాన్యం ఇవ్వలేదని విమర్శలు సామాజిక మాధ్యమాలలో చక్కర్లు కొడుతున్నాయి. హిమదాస్‌కు రావాల్సిన ప్రోత్సాహకాలు రాలేదనే విషయంతో ఏకీభవించవచ్చు. కానీ ఈ విషయంలో కులం కోణం తీసుకురావడం సమంజసం కాదు.
కళాకారులకు క్రీడాకారులకు కులం, మతం, ప్రాంతం, వర్గం, వర్ణం అంటగట్టడం పద్ధతికాదు. క్రీడాభిమానులు తమ అభిమాన క్రీడాకారుడి కులం మతం గురించి పట్టించుకోరు. హుస్సేన్‌బోల్ట్‌కు, ఫెదర్, మహమ్మద్ అలీ, సెరీనా విలియమ్స్, మార్టినా హింగిస్, అలెన్ బోర్డర్, బ్రియాన్‌లారా వంటి క్రీడాకారులకు మన దేశంలో ఎందరో అభిమానులు ఉన్నారు. ధ్యాన్‌చంద్, మిల్కాసింగ్, సునీల్ గవాస్కర్, కపిల్‌దేవ్, సచిన్ టెండూల్కర్‌లకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. అభిమానమంటేనే ఎల్లలెరుగనిది.
క్రీడాకారులకు దేశవిదేశాల్లో తన జాతీయ జెండాను ఎగురవేయాలనే తపన, తన జాతీయ గీతాన్ని మారుమోగించాలని కసి ఉంటుంది. దేశంకోసం పతకాలు సాధించిన క్రీడాకారులకు జీవితకాలం గౌరవం ఉంటుంది. కాకపోతే మన దేశంలో క్రికెట్‌కు ఉన్న ప్రాధాన్యత ఆదరణ మరే క్రీడకు లేదనేది నిజం. ఆ మ్యాచ్‌లకు ప్రజలు, పత్రికలు, మీడియా ఇస్తున్న ప్రాధాన్యత మిగతా క్రీడలకు ఇవ్వడంలేదనే విమర్శలు వాస్తవమే కావచ్చు. 120కోట్ల జనాభా కలిగిన మన దేశం క్రీడల్లో చాలా వెనుకబడి ఉంది. స్వాతంత్య్రంవచ్చి ఏడు దశాబ్దాలుదాటినా ఒక స్పష్టమైన సమగ్రమైన క్రీడావిధానం మనం అమలుచేయలేక పోతున్నాం. ప్రభుత్వాలు క్రీడారంగాన్ని విస్మరించడం క్రీడాసంఘాల్లో నెలకొని ఉన్న రాజకీయాలు, ఆధిపత్య ధోరణి, దీర్ఘకాలిక వ్యూహం లోపించడం మొదలైనవి క్రీడారంగానికి గొట్టలిపెట్టులాగా పరిణమిస్తున్నాయి. మన దేశంలో క్రీడలు అంటే కేవలం క్రికెట్ పోటీలు. ఆ పోటీలను చూడటానికి పిచ్చిగా ఎగబడి టిక్కెట్లకు వేలాది లక్షలాది రూపాయలు వెచ్చించడం, టీవీల ముందు మోకరిల్లడం, అదే సమయంలో అద్భుతమైన విజయాలు సాధించిన ఇతర క్రీడలను క్రీడాకారులను పట్టించుకోకపోవడం దారుణమైన విషయం. క్రికెట్లోకూడా ఐపీఎల్ సంస్కృతి వచ్చాక యావత్ క్రీడాస్ఫూర్తి దెబ్బతింటున్నది. అన్ని క్రీడలులాగే క్రికెట్ కూడా ఒక ఆట అని, క్రికెట్‌కు ఆదరణ ఉండాల్సిందే కానీ, ఈ క్రీడను వ్యాపార వస్తువుగా మార్చి తమ వ్యాపార విస్తరణకు ఒక సాధనంగా మార్చుకోవడం గమనించదగిన విషయం. కార్పొరేట్ సంస్థలు క్రికెట్ మానియాను దేశప్రజల మెదడులోకి ఎక్కిస్తున్న వైనాన్ని, తద్వారా జరుగుతున్న పరిణామాలన్నింటిపైన క్రీడారంగం మేధావులు దృష్టిసారించాలి. ప్రపంచంలో అతిపెద్ద క్రీడల పండుగ ఒలింపిక్స్. విశ్వవ్యాప్తంగా వందలాది దేశాలు వేలాదిమంది క్రీడాకారులు పాల్గొనే ఈ పోటీలలో మనదేశం చాలా క్రీడాంశాలలో కనీస అర్హత సాధించలేని స్థితి. జాతీయ క్రీడాశాఖ, వివిధ రాష్ట్ర క్రీడా శాఖలు ప్రతి సంవత్సరం వేలాది కోట్ల రూపాయలు ఖర్చుపెడుతున్నాయి. శిక్షణా కేంద్రాలు, శిక్షకులు, క్రీడా సామాగ్రి, పోటీల నిర్వహణకు చేస్తున్న ఖర్చుకు సాధించుకున్న ఫలితాలకు పొంతనలేకుండా పోతుంది. ఈ అంశాలపై చర్చ జరగాల్సిన అవసరం ఉంది. రాబోయే ఒలింపిక్స్ మరియు ఆసియాక్రీడలు, వివిధ ప్రపంచస్థాయి పోటీలలో ఎక్కడెక్కడ మనకు అవకాశాలు ఉన్నాయి అన్నదానిపై ముందస్తుగానే దృష్టిసారించి పథకాల సాధనే లక్ష్యంగా పెట్టుకొని దీర్ఘకాలిక ప్రణాళికలు రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది. క్రీడలు అంటే కేవలం క్రికెట్ మాత్ర కాదనే విషయాన్ని అర్థంచేసుకుని, వివిధ క్రీడలలో మన దేశానికి ప్రాతినిధ్యం వహించి అద్భుతమైన ఫలితాలు సాధిస్తున్న ప్రతిఒక్క క్రీడాకారుడిని సమున్నత రీతిలో సత్కరించుకోవాల్సిన, ప్రోత్సహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. మట్టిలో మాణిక్యాలను గుర్తించాల్సిన అవసరం ఉంది.

- సురేష్ కాలేరు 98661 74474