Others

జల సంక్షోభం మన తప్పిదమే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఏడాది ఎండలను పరిశీలించినపుడు ప్రకృతి ఎంత విధ్వంసకారిగా మారుతుందో అందరికీ తెలిసొచ్చింది. దీనికి కారణం మనిషి చేస్తున్న చర్యలే. మనిషి సుఖవాంఛతో ప్రకృతికి విరుద్ధంగా పయనిస్తూ దుఃఖాన్ని కొని తెచ్చుకుంటున్నాడు. అడవులను నరుకుతున్నాడు, చెట్ల సంఖ్యను తగి గస్తున్నాడు, గుట్టలను ధ్వంసం చేస్తున్నాడు, ఇసుకను తోడుకుంటున్నాడు. భూమిని కాంక్రీటు మయం చేస్తున్నాడు. గాలి, నీరు, నేల చివరికి ఆహారాన్ని కలుషితం చేస్తున్నాడు. విపరీతంగా ఇంధనం కాలుస్తున్నాడు. విష వాయువులను గాలిలోకి పంపుతున్నాడు, అణుబాంబు ప్రయోగాలు చేస్తున్నాడు. అణుధార్మికతను పెంచే విషతుల్య కిరణాలను గాలిలోకి తద్వారా మనుషుల్లోకి పంపుతున్నాడు. నదులను, చెరువులను, సరస్సులను, చివరకు సముద్రాలను కూడా విషతుల్యం చేస్తున్నాడు. ఫలితంగా వాతావరణం వేడెక్కుతోంది. ఓజోన్ పొరకు ఏర్పడిన చిల్లుల వల్ల సూర్యకిరణాలు నేరుగా భూమిపైకి ప్రసరిస్తున్నాయి. వాతావరణంలో ఉష్ణోగ్రత పెరుగుతోంది. ఈ ఏడాది ప్రపంచమంతటా వేడి తన ప్రభావాన్ని చూపింది. అనేక మరణాలు సంభవించాయి. భూతాపం మరో 3, 4 డిగ్రీలు పెరిగితే ఈ భూమిపై జీవ రాశులతో పాటు మనిషి మనుగడ ప్రశ్నార్థకమేనని శాస్తవ్రేత్తలు హెచ్చ రిస్తున్నారు. అయినా పాలకులెవరూ తమ ఎన్నికల మేనిఫెస్టోల్లో ప్రకృతి సంరక్షణను ముఖ్యాంశంగా పేర్కొనవడం లేదు.
ప్రకృతి సమతుల్యతను కాపాడటంలో నీటిది కూడా ప్రధానపాత్రే. నీటి కాలుష్యాన్ని అదుపు చేయడంతో పాటు, నీటి వనరులను సరిగ్గా ఉప యోగించుకోవడం, ఉన్న కాస్త భూభాగం జలమయం కాకుండా చూడటం ముఖ్యమైనవే. భూమిపై వేడిని తగ్గించడంలో నీరు తన పాత్రను నిర్వహిస్తుంది. మనుషులు గాని, ఇతర జీవరాశులుగాని నివసించడానికి అనువైన స్థలం భూమి ఒక్కటే. జీవరాశికి అవసరమైన గాలి, నీరు, ఆహార పదార్థాలకు అవసరమైన ముడిసరుకులు భూమిపైన మాత్రమే ఉన్నాయి. భూమి పైన దాదాపు 70 శాతం నేలను సముద్రాలే ఆక్రమించుకున్నాయి. అంటే మిగిలిన 30 శాతం నేలపైనే మానవజాతి నివసించాలి, ఆహా రపదార్థాలను పండించుకోవాలి, గృహ నిర్మాణం చేసుకోవాలి. జం తువులుండటానికి, ప్రకృతి సమతుల్యతను కాపాడటానికి అడవులు, గుట్టలు, చెట్లు, పుట్టలన్నీ భూమిపైనే ఉండాలి. ఉన్నాయి కూడా.. వ్యవసా యయోగ్యమైన స్థలమంతా భూభాగం పైనే ఉంది. భూగోళంపై ఆరువేలకోట్ల జనాభా ఇండ్లు కట్టుకొని పంటలు పండించుకొని సుఖంగా బతకగలిగే అవకాశం ఉందని సామాజిక విశే్లషకులు, శాస్తవ్రేత్తలు అభిప్రాయ పడ్డారు. కానీ ప్రపంచ జనాభా ఎనిమిది వందల కోట్లు కూడా లేని సమయంలో కోట్లాది మందికి ఇంటి జాగాలు కూడా లేని పరిస్థితి, ఆకలితో అలమటించే పరిస్థితులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్నాయి. భారత్‌లో ఈ పరిస్థితి మరీ ఎక్కువ. ఇందుకు అధికారవాంఛ, ధనవాంఛ, సుఖవాంఛ, ప్రకృతి వనరులపై అతికొద్ది మంది ఆధిపత్యం. మానవ సమాజం కులాలు, మతాలు, జాతులుగా, ఇంకా అనేక రకాలుగా విడిపోవడం, అసమ సమాజం వంటివి ఇందుకు కారణాలు.
సముద్ర జలాలు పంటలకు ఉపయోగపడవు. ఆ నీరు ఎండకు వేడెక్కి, ఆవిరిగా మారి మేఘాలుగా ఏర్పడుతుంది. ఋతుపవనాల గాలి చల్లబడి వర్షంగా మళ్ళీ భూమిపైకి వస్తుంది. ఈ నీరే మానవ జాతికి, జీవరాశులకు జీవనాధారం. వర్షాకాలం 3, 4 నెలలకు మించి ఉండదు. ఈ సమయంలో పడ్డ నీటినంతా నిలువచేసుకుంటే నీటి కొరతనేదే ఉండదు. కానీ నిలువచేయడం ఎలా? నదులు, చెరువులు, కుంటలు, బావులు, సరస్సులు, ప్రాజెక్టుల ద్వారా నిలువ చేసుకోవాలి. నీరు నిలువచేసుకునే స్థలం భూగర్భం. భూగర్భంలో ఎంత నీరైనా నిలువచేయవచ్చు. సాగునీటి ప్రాజెక్టులనేవి రాకముందు భూగర్భజలాలే బావుల ద్వారా తాగునీటిగాను, వ్యవసాయానికి ఉప యోగించేవారు. ఇప్పుడాపని జరగడం లేదు. మానవ తప్పిదాల వల్ల భూగర్భజలాలు వందలు, వేల అడుగుల లోతుల్లోకి పోయాయి. భూగర్భజలాలను పెంచితే తప్ప నీటి అవసరాలు తీరవు. ఎన్ని ప్రాజెక్టులు కట్టినా పెరుగుతున్న జనాభా, తరుగుతున్న వ్యవసాయ భూమి వల్ల నీటి అవసరాలు తీరే అవకాశం లేదు. భూగర్భ జలాలను పెంచడంతో పాటు, సముద్రపు నీటిని డీ సాలినేషన్ చేయడం ద్వారా తాగు నీటిగా వాడుకోవచ్చు. గల్ఫ్ దేశాల్లో సముద్రపు నీటిలోని లవణాలను తొలగించి (డీ సాలినేషన్ ప్లాంట్స్ ద్వారా) మంచి నీరుగా మార్చి వాడుకుంటున్నారు.
Matter will be neither creator nor destroyed. It is Constant. Changes from one form to another form.
...ఇది సైన్సు సూత్రం. పదార్థం నశించదు. కొత్తగా సృష్టింపబడదు. ఒక రూపం నుండి మరో రూపంలోకి మారుతుందంతే. స్థిరంగా ఉంటుంది. భూగోళం పైనున్న నీరు కూడా అంతే. సముద్రాల్లోని నీరు ఆవిరై మేఘాలుగా ఏర్పడి ఋతుపవనాలతో చల్లబడి వర్షంగా కురుస్తుంది. సైన్సు సూత్రంననుసరించి సముద్రాల్లోని నీరు లక్షల సంవత్సరాలైనా తగ్గడం లేదు, తగ్గదు కూడా. వర్షంగా పడిన నీరు తమ అవసరాలకు ఉప యో గించుకోవడంలోనే మనిషి విజయం ఆధారపడి ఉంది. అది సరైన పద్ధతిలో చేయనందునే నీటి సమస్య ఎదురవుతోంది. భవిష్యత్తులో భూమి కోసం కాకుండా నీళ్ళ కొరకు కొట్లాడే పరిస్థితులున్నాయి. నీటికొరత తీర్చడానికి ప్రాజెక్టులవసరమే. కానీ అవి ఓ మేరకు మాత్రమే. ప్రాజెక్టుల కింద వేలు, లక్షల ఎకరాల భూములను, వ్యవసాయ భూములను, ఊళ్ళను నాశనం చేసి వ్యవసాయ భూమిని తగ్గించడం మానుకోవాల్సిందే. లోతట్టు ప్రాంతాల్లో ప్రాజెక్టుల కట్టడాల వల్ల తక్కువ భూమి పోయి ఎక్కువ లాభం జరుగుతుంది. మైదాన ప్రాంతాల్లో కట్టడం వల్ల నిర్వాసితులతో పాటు పంట భూముల్లో బంగ్లాలు కట్టడం, పరిశ్రమలు పెట్టడం వల్ల వ్యవసాయ భూమి చాలా తగ్గింది. కాంక్రీటు వనాలు భూమిలోకి నీటిని ఇంకనీయడం లేదు. మరో దిక్కు ఉష్ణోగ్రత పెరిగి హిమాలయాల్లోని మంచుతో పాటు, ధృవాల్లోని మంచు కరుగుతుంది. అదంతా నీరుగా మారి సముద్రమట్టాలు పెరుగుతున్నాయి. ఇంకో డిగ్రీ ఉష్ణోగ్రత పెరిగితే తీర ప్రాంత నగరాలు సముద్రంలో కలిసి పోయే అవకాశముంది. ఓ దిక్కు వ్యవసాయ భూమి తగ్గుతుంటే మరోదిక్కు సముద్రమట్టాలు పెరగడంతో భూభాగం తగ్గుతుంది. వాటికి తోడు ప్రాజెక్టులను మైదాన ప్రాంతాల్లో కట్టడం వల్ల భూమి మరింత తగ్గుతుంది. ఎక్కువ నష్టం, తక్కువ లాభం జరుగుతుంది.
మరి నీటి అవసరాలు తీరడమెలా? అంటే ఐదు దశబ్ధాల క్రితం భూగర్భ జలాలు ఎలా లభించేవో అలా లభించేట్టు చేయడం. భూమిని ఊట పండులా మార్చడం వర్షపు నీరు ఎక్కడి దక్కడ ఇంకి పోయేటట్టు చేయడం. ముప్పై నలభై యేళ్ళ క్రితం వరకు గ్రామాల్లో గజం లోతు తవ్వితేనే నీరు చిమ్ముకొచ్చేది. చెలముల్లో తియ్యటి నీరు లభించేది. ఒర్రెల్లో నీటి ఊటలుండేవి, బావుల్లో నీళ్లు చెంబుతో ముంచుకునేంత పైకుండేవి. భూగర్భ జలాలు పెరిగితే భూతాపం తగ్గుతుంది. అందుకోసం ఇంటింటా ఇంకుడు గుంతలు తవ్వాలి. చేల్లలో, పొలాల్లో పడిన వర్షపు నీరు అక్కడే ఇంకేటట్టు బంటాలు తీయాలి. భూగర్భ జలాలను పెంచడం వల్ల వర్షాభావ పరిస్థితులున్నా తట్టుకోవచ్చు. నీరు వృథా కాకుండా రీసైక్లేషన్ ఇంటింటికీ చేసుకునే ఏర్పాటు చేయాలి. సేవేజ్ వాటర్‌ను కూడా మలినాలు తొలగించి వాడవచ్చు. మొక్కల పెంచడం, అరణ్యాలను రక్షించుకోవడం ఎంతో అవసరం. నదుల కడ్డంగా మాత్రమే ప్రాజెక్టులు కడితే కొద్దిపాటి వరదలొచ్చినా అవి నిండుతాయి. సముద్రపు నీటిలోని లవణాలను తొలగించే ప్లాంట్లను పెంచడం ద్వారా నీటి కొరతను తీర్చవచ్చు. పెరుగుతున్న జనాభాను దృష్టిలో పెట్టుకొని పంట భూములు తగ్గకుండా నీటి కొరతను తీర్చే ప్రయత్నాలు చేయాలి. ఉన్న కాస్త భూభాగాన్ని నీళ్ళమయం చేయరాదు. ప్రకృతి విధ్వంసాన్ని ఆపి భూభాగాన్ని రక్షించుకోవాలి. లేకుంటే చరిత్ర మనల్ని క్షమించదు.
ప్రకృతిని మనం కాపాడితే - ప్రకృతి మనల్ని కాపాడుతుంది.

-డా కాలువ మల్లయ్య 91829 18567