Others

మూగవైన ఏమిలే! (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మూగవైన ఏమిలే/ నగుమోమే చాలులే/ సైగలింక చాలింపుము- జాణతనము తెలిసెనులే
ఆపలేని అనురాగం చూపులలో తొణికెనులే/ దొంగమనసు దాగదులే/ సంగతెల్ల తెలిపెనులే..
పలుకకున్న ఏమాయెను వలపు బాసలింతేలే/ నను దయతో ఏలుకొనుము/ కనుసన్నల మెలిగెదెలే..
అందాలే బందాలై నను బందీ చేసెనులే/ కలవరమిక ఎందుకులే/ వలదన్నా వదలనులే..
మూడు చరణాల పాటను పింగళి నాగేంద్ర విజయావారి ‘అప్పుచేసి పప్పుకూడు’ చిత్రం కోసం రచించారు. స్వరరాజు యస్ రాజేశ్వరరావు స్వరాలు కూర్చిన మధురమైన పాటను ఏఎం రాజా సుమధురంగా ఆలపించారు. తెరపై జగ్గయ్య.. మూగగా నటించే జమునను ఆటపట్టిస్తూ సందర్భోచితంగా వచ్చే పాట ఇది.
‘మాల్‌కౌస్’ రాగంలో ‘తిశ్రగతి’లో సాగిన పాటను అత్యంత హుషారైన బాణీలతో మలిచారు సాలూరి. ఎఎమ్ రాజా చిత్ర సంగీత గానాలాపన జీవితంలో మరచిపోలేని హిట్‌ని ఆయనకు ఇచ్చిన మరో మంచి పాట ఇది. పాటలో ఉచ్ఛారణకు సంబంధించిన విశేషముంది. ‘అందాలే బందాలైనను బందీ చేసెనులే’ అనే వాక్యంలో ‘బందాలై’ అనే పద ప్రయోగం కొంతమందికి ఆశ్చర్యం కలిగించొచ్చు. అది ‘బంధాలై’ అని కదాని అనుమానం రావచ్చు. బందాలై అనే ప్రయోగం సరియైనదే. గాయనీ గాయకుల ఉచ్ఛారణనుబట్టి భాష ఆలాపన ప్రయోగం ఉంటుంది. అందరికన్నా ఎఎమ్ రాజా స్వరం విభిన్నంగా ఉంటుంది. యాస తమాషాగా అనిపిస్తుంది. రాగశ్రుతిలో రచయితను తప్పుపట్టే రోజులు కావవి. వినేవారికి అంతగా అనిపించవు కూడ!
ఈ చిత్రంలోని కొన్ని పాటలలో ప్రత్యేకత ఉంది. సాహిత్యాన్ని పక్కనపెట్టేసి పాటను మాత్రం ఆలపించుకుంటూపోతే పల్లవికి, చరణాలకు ట్యూన్‌లో తేడా పెద్దగా ఉండదు. అయినా ఎక్కడా విసుగుపుట్టని రీతిలో పాటలుంటాయ. కారణం పింగళి సాహిత్యం, సాలూరి సంగీతమే. వీరి చిత్రాలకు సంగీతం మధురమైన పాటలే సగం బలం. విజయాలకు సోపానాలయ్యాయి. విజయా చిత్రంలోని పాటలు మొత్తం సుమధురాలే!

-పి లక్ష్మీసుజాత, అద్దంకి