Others

యమగోల (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1977లో విడుదలైన సోషియో ఫాంటసీ సినిమా -యమగోల. ఎన్టీఆర్ -జయప్రద జోడీ. అప్పట్లో ఈ పెయిర్ పెద్ద సెనే్సషన్. ఇద్దరిమధ్యా అద్భుతమైన కెమిస్ట్రీ నడిచేది. అప్పట్లోని అన్ని చిత్రాల మాదిరిగానే హీరో -విలన్ కూతురును ప్రేమించే ఆనవాయితీతో సినిమా నిర్మితమైంది. ఒక కారణంగా కథానాయకుడు యమలోకానికి వెళ్తాడు. అక్కడ యమ భటులకు ప్రజాస్వామ్య పాఠాలు చెప్పడం ఇందులో ప్రత్యేకత. ‘మీకు ఓటి ఉందా?’ అని అడిగినప్పుడు ‘అంటే ఏమిటి?’ అని యమభటులు తిరిగి ప్రశ్నిస్తారు. అంటే ‘ఎక్కువ పని గంటలు చేస్తే ఎక్కువ వేతనం’ అంటూ, ‘అది మీకు దొరకడం లేదా?’ అని ప్రశ్నిస్తాడు. ‘అయ్యా! మా పూర్వీకులు పని చేసినప్పటినుండి అదే జీతం అంటారు’. ‘మీకు సంఘం ఉందా?’ అని కథానాయకుడు అడిగి, మీరు ఏర్పాటు చేసుకోవాలి, ఒక నాయకుడిని ఎన్నుకోండి అంటూ హితబోధ చేస్తాడు. అందుకు వాళ్లు ‘మీరే మా నాయకుడు’ అంటారు. యముడు, చిత్రగుప్తుడు భూలోకంలోకి రాగానే వాళ్లకూ ఆకలి మొదలవుతుంది. ‘నాకు కడుపులో ఎలుకలు తిరుగుచున్నవి’ అని యముడు- ‘ఔను నాకునూ ఆకలేయుచున్నది’ అని చెబుతూ చిత్రగుప్తుడు, ‘ప్రభూ’ మనకు లేనిదీ వాళ్లకు ఉన్నది అదే అని చెప్పే సమాధానం ఇవన్నీ ప్రేక్షకులను ఆకట్టుకొన్నాయి. చిత్రగుప్తుడు దొంగిలించిన వస్తువులను ఒక పెద్ద భోషాణపు పెట్టెలో భద్రపరచుకొంటాడు. ఒకసారి ఆ సొమ్ములన్నీ కింద పడిపోతాయి. అప్పుడు యముడు ‘తాళం వేయలేదే’ అని అడగ్గా ‘తాళము వేసితిని, గొళ్లెము వేయుట మరిచితిని’ వంటి సంభాషణలు కడుపుబ్బ నవ్విస్తాయి. భూమీద హీరో చనిపోయి యమలోకానికి వెళ్లడం, అక్కడ విప్లవాగ్ని పుట్టించి సమ్మె లేపడం, తిరిగి యముడి సాయంతో భూమీదికొచ్చి -ఇక్కడ విలన్ల భరతం పట్టడంలాంటి సన్నివేశాలతో పిట్టకథలా సాగే యమగోల బ్లాక్‌బస్టర్ హిట్టుకొట్టింది. యమలోకానికి వెళ్లిన కథానాయకుడిగా ఎన్టీఆర్, ఎక్స్ ప్రసిడెంట్ రుద్రయ్యగా రావు గోపాలరావు, అతని కూతురు హీరోయిన్‌గా జయప్రద, కిల్లర్ రామశాస్ర్తీగా ప్రభాకర్ రెడ్డి, ఇంద్రుడిగా కాంతారావు, అతి ముఖ్యమైన యముడిగా సత్యనారాయణ, చిత్రగుప్తుడిగా అల్లు రామలింగయ్య అద్భుతమైన పాత్రలు పోషించారు. ఒకవిధంగా ఆధునిక సినిమా కాలంలో సోషియో పాంటసీలకు తాతినేని రామారావు దర్శకత్వం వహించిన యమగోల ఆదర్శమైంది.

-కాకుటూరి సుబ్రహ్మణ్యం