Others

శోభన్ అంటేనే.. అందమైన డిసిప్లిన్ ( ఆనాటి హృదయాల..)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శోభన్‌బాబు అప్పుడప్పుడే పైకొస్తున్నాడు.
ప్రేక్షకుల దృష్టి.. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల దృష్టిని బాగా ఆకర్షించాడు. అదే సమయంలో శోభన్‌బాబు వున్నఫళంగా కొన్ని కండిషన్సు పెట్టాడు. ఆ కండిషన్స్ విన్న ఇండస్ట్రీ అంతా మూతులు కొరుక్కున్నారు. ఇక శోభన్‌బాబు పని అయిపోయినట్లే అనుకున్నారు. అప్పట్లో నేను సినీ హెరాల్డ్‌లో సీనియర్ రిపోర్టర్‌గా వుండేవాడ్ని. సినిమా విషయాలు గాకుండా.. సమకాలీన సాహిత్యం మీద.. ముఖ్యంగా హాస్యరచనల మీద మా సంభాషణ కొనసాగుతుండేది. పక్కనే ఉమామహేశ్వరావు అని.. శోభన్‌బాబు చదువుకున్న రోజుల్లో హిందీ మాస్టారు వుండేవారు. ఇదీ మా కాంబినేషను. మా ముగ్గురి మధ్య సుదీర్ఘమైన ముచ్చట్లు కొనసాగుతుండేవి.
ఇంతకీ ఆ కండిషన్సు ఏవిటో చెప్పనే లేదు కదూ.
మొదటిది.. ఆరుగంటలు సాయంత్రం దాటితే షూటింగు చెయ్యను. రెండవది ఆరునూరైనా నూరుఆరైనా..(అవ్వదులెండి) ఆదివారాలు షూటింగు చెయ్యను. మూడవది డబ్బింగ్ చెబుతున్న సమయంలోనే ఎగ్రిమెంట్ ప్రకారం డబ్బు చెల్లించాలి.. నాలుగవది నాకంటూ ప్రత్యేకమైన టీమ్ వుంటుంది. నన్ను నమ్ముకున్నవాళ్ళకి అన్యాయం చెయ్యను.. నాతోబాటూ నా టీమ్ వుంటారు. నా విజయంలో వాళ్ళూ భాగస్వాములవుతారు. ఇవీ కండిషన్సు. కండిషన్సు పెట్టడమేకాదు. ఆచరణలో పెట్టడంకూడా జరిగిపోయింది. సాయంత్రం ఆరు గంటలయ్యేసరికి విగ్గు తీసేసేవాడు. ఓ పావుగంట సమయం యూనిట్ సభ్యులతో ముచ్చట్లు పెట్టుకొని ఆరుగంటల పదిహేను నిముషాలకు కారెక్కి అందరికీ బాయ్ చెప్పేవాడు.
ఇన్ని కండిషన్స్ పెట్టిన మొట్టమొదటి హీరో శోభన్‌బాబే. కొందరు కినుక వహించారు కూడా. అయినా శోభన్ భయపడలేదు. శోభన్‌లోవున్న మరో గొప్పదనం ఏవిటంటే.. ఏరోజూ ఎవర్ని గురించి చెడుగా మాట్లాడేవాడు కాదు. ఎవరైనా పొరపాటున మాట్లాడితే దూరంగా వుంచేవాడు. నిండుకుండలా తొణక్కుండా బెణక్కుండా వుండేవాడు.
‘శోభన్‌బాబు పిసినారి. ఎంగిలిచేత్తో కాకిని తోలడు’ అన్న అపప్రద వుంది. కానీ ఇది నిజంకాదు. ఎవరైనా నిజాయితీగా తన కష్టసుఖాలు తెలియపరిస్తే క్షణం ఆలస్యం చెయ్యకుండా, రెండోకంటికి తెలియకుండా సమస్యను పరిష్కరించేవాడు.
ఆదుర్తి సుబ్బారావు దగ్గర ఎడిటర్ కమ్ అసోసియేట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న టి కృష్ణ తన తొలి చిత్రం ‘ఖైదీ బాబాయ్’ కథ వినిపించాడు. నిజానికి అప్పటికే శోభన్ భారీ పారితోషికం తీసుకొంటున్నాడు. అయినా ఇంతే ఇవ్వగలను అని చెప్పి నిజాయితీగా అభ్యర్థించాడు. శోభన్ మారుమాట్లాడకుండా ఒప్పుకున్నాడు.
‘ఖైదీబాబాయ్’ చిత్రంలో జానకి, వాణిశ్రీ, రమాప్రభ ఇత్యాది అగ్ర నటీనటులే వున్నారు. సందడి సందడిగా షూటింగు వుండేది. కేరియర్లు పోటీపడి తెచ్చుకొనేవారు. సహపంక్తి భోజనాలు- అందరి కారియర్లలో వున్న స్పెషల్ ఐటమ్స్‌తీసి.. అందరికీ రుచి చూపించేవారు. ఇది కొంతకాలం సాగింది. నిజానికి ఈ కార్యక్రమం మొట్టమొదట ప్రారంభించిన వ్యక్తి సూర్యకాంతమ్మ. అందరి నోళ్లూ తీపి చేసేది. తర్వాత జానకి. జానకి వంట చేసిందంటే, అది రుచిచూడని జన్మ వృధా అనుకొనేవారు. ఆమేంచేసినా అంత గొప్పగా వుండేది. వెజ్ చేసినా నాన్‌వెజ్ చేసినా అంత గొప్పగా వుండేది. ఆరోజు రెండు కారియర్లనిండా అన్ని స్పెషల్ ఐటమ్స్... మద్రాసులో దొరకని ఐటెమ్స్‌చేసి పెట్టింది. కారియర్ ఘుమఘుమలకి యూనిట్ మొత్తం అక్కడే తిష్ఠవేసుక్కూర్చుంది.
లంచ్ బ్రేకులో భోజనాలు ప్రారంభమయ్యాయి. శోభన్‌బాబు తను తెచ్చుకున్న కేరియర్ దగ్గరకు తెప్పించుకున్నాడు. ఆ కేరియర్‌ని తీసి పక్కన పెట్టేసి.. ఈరోజు నా కేరియర్‌లోవున్న ఐటెమ్స్ అన్ని రుచి చూడవల్సిందే’ అంటూ మొండికేసి కూర్చుంది.
‘అక్కా! అది వృధాప్రయాస. ఆయన్ని బ్రతిమాలి బ్రతిమాలి ఆయాసమొస్తుంది. ఆయనకి బదులు యూనిట్ అందరికీ పెట్టు. ఎంజాయ్ చేస్తూ తింటారు’ అంది వాణిశ్రీ. డైరెక్టరు కృష్ణ ‘అమ్మా! నీ అమృత హస్తంతో నువ్వొండిన పంచామృతాలూ ఇలా దానంచెయ్యి తల్లీ!’ అన్నాడు. వుండండి! బాబు రుచి చూసిన తరువాత అందరికీ పెడతాను. అందుకే రెండు కేరియర్లు తెచ్చాను’ అంది. శోభన్‌బాబు ఆమె కేరియర్ ఓపెన్ చేసినా, ఆమె వంటకాలు నోరూరించినా చలించలేదు. సున్నితంగా తిరస్కరించాడు. ‘నేను కొన్ని కండిషన్సు పెట్టుకున్నాను జానకిగారూ. వాటిని తప్పను’ అన్నాడు సున్నితంగా. ‘మీ కండిషన్స్‌లో ఇది లేదుగా’ అంది. దాదాపు ఏడ్చినంత పనిచేసింది. శోభన్ జానకిని ఓదార్చి.. చివరికి తన కేరియర్ విప్పాడు. అందులో డ్రైఫ్రూట్స్, పెరుగన్నం, జీరారైస్, సలాడ్స్. చిన్న చిన్న కప్పుతో రెండువందల యాభై గ్రాముల ఆహారం. అంతే. అంతకుమించి ఒక్క గ్రాము కూడా తీసుకోరు. ఎదురుగా అంత గొప్ప రుచులు కనిపిస్తున్నా ఏమాత్రం చలించకుండా తననుతాను నిగ్రహించుకోవడం ఇండస్ట్రీలో ఒక్క శోభన్‌బాబుకే చెల్లింది.

-ఇమంది రామారావు 9010133844