AADIVAVRAM - Others

వౌన సాక్ష్యాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వసుధ గర్భంలో నిర్మలత్వంగా పురుడు పోసుకొని
జీవకోటి మనుగడ కోసం ఆటుపోట్లు భరిస్తున్నా
సుగంధ పరిమళాలు వెదజల్లుతున్నాయి వృక్షాలు!

తల్లి కడుపులో పవిత్రంగా జన్మించిన మానవుడా...
వృక్షాలను చూసైనా స్వార్థపూరిత ఆలోచనలు వదలి
మానవత్వంతో మంచిని పెంచి మెలుగుతూ ఉండు!!

వౌనంగా ఎదుగుతూ అమ్మ వలే చేరదీస్తున్నాయి
కట్టె కడతేరే వరకూ అవసరానికి వాడుకోమంటూ
చిరునవ్వుతో స్వాగతాలు పలుకుతున్నాయి చెట్లు!

స్వచ్ఛమైన పూల వలే పరిమళాలు పూయించి
తరువులా నీ జన్మ సార్థకత చేసుకొని సాగుతూ
పరోపకారియై దేదీప్యమానంగా విరాజిల్లుతూ ఉండు!!

ప్రాణవాయువు నిస్తున్నా వౌనంగా వొదుగుతూ
కలతల్ని మాపే కల్పవృక్షమై ప్రాణికోటికి నీడనిస్తూ
ఆదర్శ జీవితానికి నిలువెత్తు నిదర్శనాలు తరువులు!

అలుపెరుగని సూర్యుడివై వెలుగులు ప్రసరించి
అందరి గుండెల్లో చంద్రుడివై వెనె్నల కురిపించి
కల్మషమెరుగని వ్యక్తిగా సంతోషాలు అందిస్తూ ఉండు!!

-శివేగారి చిన్నికృష్ణ 6300318230