Others

మార్పు మొదలైంది..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియాలో మహిళలకు స్వతంత్రత పెరుగుతోంది. ఇకపై పురుషుడి రక్షణ లేకుండా వారు స్వతత్రంగా ఎక్కడికైనా ప్రయాణించవచ్చని ఆదేశాలు జారీ అయ్యాయి. శుక్రవారం నాడు ప్రకటించిన కొత్త నిబంధనల ప్రకారం 21 ఏళ్ళ వయసు పైబడిన మహిళలు, పురుష సంరక్షకుడి అనుమతితో నిమిత్తం లేకుండా పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇకపై దేశంలోని వయోజనులందరూ పాస్‌పోర్టుకు దరఖాస్తు చేసుకుని ఎక్కడికైనా ప్రయాణించవచ్చు. దీనితో మహిళలకు పురుషులతో సమానంగా ప్రయాణ హక్కు లభించినట్లయింది. ఇంతేకాకుండా మహిళలకు బిడ్డ జననం, పెళ్ళి, విడాకులను రిజిస్టర్ చేసుకునే హక్కు కూడా ఈ ఆదేశలతోనే సమకూరింది. ఇటీవలే మహిళల డ్రైవింగ్ పైన నిషేధం ఎత్తివేయాలనే ప్రకటన జారీ చేశారు. రాచరిక ఆదేశాలలో మహిళలకు ఉద్యోగావకాశాలు కల్పించే విధంగా ఉద్యోగ నియామకాల విధానంలో మార్పులు చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అంటే.. ఇకముందు దేశంలో ఎవరైనా వయో, లింగ, వైకల్య బేధాలతో నిమిత్తం లేకండా, ఎలాంటి వివక్ష లేకుండా ఉద్యోగం చేసే హక్కును పొందుతారు. ఇప్పటివరకు.. ఎవరైనా సౌదీ మహిళ పాస్‌పోర్టు పొందాలన్నా, విదేశాలకు ప్రయాణం చేయాలన్నా పురుష సంరక్షుడు తప్పనిసరి. ముఖ్యంగా భర్త, తండ్రి లేదా పురుష బంధువు అనుమతి తీసుకోవాల్సి వచ్చేది.
సౌదీ అరేబియా పాలకుడు క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ దేశంలో భారీ సంస్కరణలను అమలు చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే మహిళలు స్వతంత్రంగా డ్రైవ్ చేయడంపై ఉన్న ఆంక్షలు ఎత్తి వేయడం వంటి నిర్ణయాలు వెలుగు చూశాయి. మహమ్మద్ బిన్ సల్మాన్ 2016లో తన ఆర్థిక విధానాన్ని ప్రకటించారు. పనిచేసే చోట మహిళల ప్రాతినిధ్యాన్ని 22 శాతం నుంచి 30 శాతానికి పెంచుతూ 2030 నాటికి దేశ ఆర్థిక స్వరూపాన్ని మార్చేయాలన్నదే ఆయన ప్రణాళిక. సౌదీలోని కొంతమంది ఉన్నత వర్గాల మహిళలు చాలాకాలంగా లింగ వివక్ష వేధింపుల మూలంగా కెనడా వంటి దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు. ఇటీవలే రహాఫ్ మహమ్మద్ అల్ కునన్‌కు కెనడా ఆశ్రయం కల్పించిన సంగతి అందరికీ తెలిసిందే.. ఆమె సౌదీ అరేబియా నుంచి పారిపోయి ఆస్ట్రేలియా చేరుకోవాలనుకుంది. కానీ ఆమె థాయ్‌లాండ్ రాజధాని బ్యాంకాక్ విమానాశ్రయంలోని హోటల్ గదిలో దొరికిపోయింది. ఎంతమంది నచ్చజెప్పినా ఆమె స్వదేశానికి వెళ్లకుండా.. తను తన దేశానికి వెళ్లనని అంతర్జాతీయ సంస్థలకు విజ్ఞప్తి చేసింది. సౌదీలో మహిళలను ద్వితీయ శ్రేణి పౌరులుగా చూస్తున్నారని అంతర్జాతీయ మానవహక్కుల సంఘాలు తరచూ చెబుతున్నాయి. కానీ నెమ్మదిగా మార్పు మొదలైంది. సౌదీలో మహిళలకు స్వతంత్రత పెరుగుతోంది.