Others

పిల్లల్లో సృజనను చూడండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిన్నారుల్లో ఉన్న సృజనాత్మక శక్తిని కాపాడుకోవడం, దాన్ని ప్రోత్సహించడం, వాటిని పెంపొందించటం పెద్దవాళ్లుగా మన కర్తవ్యం, బాధ్యత. పిల్లలు నిత్య సృజనశీలురు. ప్రతిదాన్నీ తరచి తరచి చూసే ఆసక్తి, లోగుట్టును తెలుసుకోవాలనే జిజ్ఞాస వారి సొంతం. ఇవి వారిలో అనుక్షణం కొత్త ఆలోచనలను రేకెత్తేలా చేస్తాయి. మానసిక వికాసాన్ని పెంపొందిస్తాయి. పారాడుతూ అప్పుడప్పుడే నడక నేర్చుకునే పిల్లలు విచిత్రమైన చేష్టలు చేస్తూ అన్నింట్లోనూ వేలు పెట్టాలని చూస్తుంటారు. గచ్చుపై నీళ్లు పడితే చేత్తో రాయడం, బట్టలు ఉతుకుతున్నప్పుడు సబ్బు నీళ్లతో ఆడుకోవడం, ఇంట్లోని వస్తువులు చిందర వందరగా పడేయడం వంటివి చాలా చేస్తుంటారు. ఇవి మనకు పిచ్చి పనుల్లా కనిపిస్తాయి, కానీ ఈ పనులు ఆ లేత హృదయాల ఉత్సుకతకు నిదర్శనాలు. ఒకరకంగా ఇవన్నీ సృజనాత్మక దృష్టికి సోపానాలనే చెప్పవచ్చు. పిల్లల చేతులకు మట్టి అంటుకుంటుందేమో, దుస్తులు మాసిపోయి, మరకలు పడతాయేమో అని చాలామంది తల్లిదండ్రులు తమ పిల్లలను బయటకు పంపరు. ఇంట్లోనే ఆడుకోమని చెబుతారు. అది పట్టుకోవద్దు, ఇది ముట్టుకోవద్దనే ఆంక్షలు పెడుతుంటారు. ఇలాంటివి చెప్పడం వల్ల వారి పరిధి తగ్గిపోతుంటుంది. బయటి వాతావరణాన్ని, పరిస్థితులను ఆకళింపు చేసుకోవటం, నేర్చుకోవటం తగ్గుతుంది. ఇది సృజనాత్మకశక్తిని దెబ్బతీస్తుంది. పిల్లల రక్షణ గురించి ఆలోచించటం తప్పు కాదు కానీ అది వారిలో ఆలోచనా శక్తిని దెబ్బతీసేలా ఉండకూడదు. కాబట్టి వారు బయట ఆడుకుంటానంటే బయటకు వెళ్లనివ్వాలి.
‘ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్‌ఫెక్ట్’ అన్నది ఆంగ్ల నానుడి. ‘సాధనమున పనులు సమకూరు ధరలోన’ అని మన వేమన ఏనాడో చెప్పాడు. కాబట్టి ఏదైనా నేర్చుకోవడానికి, చేసి చూపటానికి పిల్లలకు కొంత సమయం ఇవ్వాలి. కాస్త పెద్ద పిల్లలనైనా సరే.. ఎప్పుడూ అన్ని పనులనూ కచ్చితంగా చేయాలని ఆశించడం, అలా చేయకపోతే నిందించడం మంచిది కాదు. దీంతో వారిలో కొత్తగా ఆలోచించే నైపుణ్యం కొరవడుతుంది. బొమ్మలు వేయడం లేదా వాటికి రంగులు వేయడం వంటి పనులను వారికి నచ్చిన రీతిలో పూర్తిచేసే అవకాశం ఇవ్వాలి. తప్పులు చేసినప్పుడు నేర్చుకున్న గుణపాఠాల ద్వారానే విజయానికి మార్గం ఏర్పడుతుందన్న సంగతిని మరువకూడదు. ఏదైనా సరిగా చేయనప్పుడు అలా ఎందుకు జరిగిందని పిల్లలు దాని గురించి ఆలోచిస్తారు. తమదైన శైలిలో విశే్లషిస్తారు. మళ్లీ అలా జరగకుండా చూసుకోవటమెలాగో నేర్చుకుంటారు. అంటే ఓటములు పిల్లల్లో ఎదుగుదలకు, సృజనాత్మక దృక్పథానికి అవకాశం కలుగజేస్తాయన్నమాట.