Others

మరో దీపం కొడిగట్టింది

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అక్షరాల వెలుగు హఠాత్తుగా ఆరిపోయింది
అంధకారంలో సాహితీలోకం కన్నీరు మున్నీరై!

‘గమనం’ వౌనంగా ఒదిగి స్వర్గప్రాప్తికి చేరువైంది
‘వీక్షణం’ విహంగమై అంబరంలో చోటు చేసుకుని!

‘జూకామల్లి’ సౌరభాలు అమావాస్య నిశీధిలో
కొట్టుమిట్టాడుతున్నాయి ఒంటరిగా బ్రతకలేక!

‘మనసున మనసై’ హృదయాలను కదిపిన కథలతో
అక్షరలక్ష్మిగా వెలుగులకు నెలవైన కవనతల్లి కె.బి. లక్ష్మి!

మీ అక్షరాలే ఆనవాళ్ళుగా పదాలే గుర్తుగా
వాక్యాలే వేదమంత్రాలుగా ప్రతిధ్వనిస్తున్నాయి మాలో!

తిరిగిరామ్మా! అక్షరమ్మ తల్లి అలిగి కూర్చుంది!
మీ నోటితో పలికించిన అక్షరవర్షంలో తడవాలని
సాహితీ కుటుంబం ఎదురీతలో పడిందిపుడు!

జగమంత సాహితీ కుటుంబం కన్నీటి వీడ్కోలు పలికి అక్షరాలతో
బాధను తిరగరాస్తున్నాయి!
మీ స్వర్ణాక్షరాలతో మమ్మల్ని దీవించి
పునీతులను చేయడానికి వేం చేయవమ్మా!

అక్షర ఒత్తులను వేసి వెలుగు దీపాలు పంచి
మాలో చైతన్యం నింపడానికి
తెలుగుతల్లి ముద్దుబిడ్డగా సరస్వతీరూపంగా మరోసారి జన్మించు తల్లీ!

- శివేగారి చిన్నికృష్ణ 63003 18230