Others

పామాయిల్ రైతులకు స్వల్ప ఊరట!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గిట్టుబాటు ధరకోసం అలుపెరగని పోరాటం చేస్తున్న ఆంధ్రప్రదేశ్‌లో పామాయిల్ తోటల రైతులకు స్వల్ప ఊరట లభించింది. గత ప్రభుత్వం మూడు సంవత్సరాలు నానబెట్టిన సమాన పంటకు సమాన ధర డిమాండ్‌ను నూతన ప్రభుత్వం గద్దెనెక్కిన మూడు వారాల్లోనే పరిష్కరించింది. అయితే చాలామంది రైతులు హర్షం వ్యక్తం చేస్తున్న రీతిలో ఇది పామాయిల్ రైతుల అసలు సమస్యకు పూర్తిస్థాయి జవాబుకాదు. వారు కోరేది టన్నుకు రూ.10,035/=ల కనీస మద్దతు ధర.
పామాయిల్ పంట పూర్వాపరాల జోలికి వెళితే 30 సంవత్సరాల క్రితం భారతదేశంలోకి ప్రవేశించిన పామాయిల్ పంట 19 రాష్ట్రాలలో సాగు చెయ్యటానికి అవకాశాలు ఉన్నా ఇంకా ఆ సంఖ్య తొమ్మిది దగ్గరే ఆగిపోయింది. ఇక సాగు విస్తీర్ణం 40 లక్షల ఎకరాల వరకూ అవకాశం ఉన్నా ఆరున్నర లక్షల ఎకరాలకు మించలేదు. అయితే పామాయిల్ పంట సాగులో ఆంధ్రప్రదేశ్ రైతులు మొనగాళ్ళు అనిపించుకున్నారు. దేశంలో ఉన్న ఆరున్నర లక్షల ఎకరాల్లో ఏకంగా నాలుగు లక్షల ఎకరాల వాటాను తెలుగు రైతులు ఆక్రమించారు. తెలంగాణాలో మరో 50వేల ఎకరాల్లో సాగవుతోంది. పామాయిల్ గెలల ధర ప్రకటన చాలా చిక్కులతో కూడుకొని రైతులను చికాకుపెడుతూ ఉంటుంది. అంతర్జాతీయ ముడిచమురు ధరలు పామాయిల్ ముడి నూనె ధరలపై ప్రభావాన్ని చూపుతాయి.
ఇక్కడే పెద్ద తిరకాసు ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ సంస్థ అయిన మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో పశ్చిమ గోదావరి జిల్లా పెదవేగిలో పామాయిల్ ఫ్యాక్టరీ ఉంది. ఈ ఫ్యాక్టరీ ప్రకటించిన నూనె దిగుబడి శాతాన్ని రాష్ట్రంలోని మిగిలిన 12 నూనె ఫ్యాక్టరీలు ఆమోదించి ఆ ధరను రైతులకు చెల్లించాలి. ఈ కారణంగా పెదవేగి ఫ్యాక్టరీ ఇతర ఫ్యాక్టరీల ఒత్తిడికి గురై ప్రలోభాలపాలై తక్కువ నూనె దిగుబడి శాతాన్ని ప్రకటిస్తోందని పామాయిల్ రైతులు చాలాకాలంగా ఆరోపిస్తున్నారు. దీనికి తగ్గట్టుగానే తెలంగాణాలోని ఖమ్మం జిల్లా అశ్వారావుపేటలో ఉన్న ఫ్యాక్టరీ 19 శాతం నూనె దిగుబడిని ప్రకటిస్తే పెదవేగి ఫ్యాక్టరీ 17 శాతం మాత్రమే ప్రకటిస్తోంది. ఆ కారణంగా టన్నుకు 600నుండి 1000 రూపాయలు వరకు తెలంగాణాతో పోల్చిచూస్తే ఆంధ్రప్రదేశ్ రైతులు నష్టపోతున్నారు. ఈ విషయమై గతంలో రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుపై గట్టి ఒత్తిడి తేవటంతో నిజనిర్ధారణ కమిటీ వేసి అందులో వాస్తవం ఉందని గమనించారు. అశ్వారావుపేటలోని ఫ్యాక్టరీ కొత్త యంత్రాలతో కూడుక్నుది కావటం, పెదవేగి కర్మాగారం 20 సంవత్సరాల నాటిది కావటంతో యంత్రాలు అరిగిపోయి తక్కువ దిగుబడి వస్తోందని నిపుణులు వెల్లడించారు.
అసలు సమస్య ఇదీ...
నూనె శాతం దిగుబడితోగాని అంతర్జాతీయ ముడిచమురు ధరలతో గాని సంబంధం లేకుండా సాగు పెట్టుబడి ఆధారంగా పామాయిల్ గెలల ధరను చెల్లించాలని రైతులు కోరుతున్నారు. కేంద్ర వ్యవసాయ ఉత్పత్తుల ధరల నిర్ణయ కమిటీ పామాయిల్ సాగు ఖర్చును టన్నుకి రూ.10,035/-లుగా అంచనా వేసింది. ఈ కారణంగా ఈ ధరను చెల్లించాలని రాష్ట్ర పామాయిల్ రైతు సంఘం కోరుతోంది. ఇది పూర్తిగా కేంద్రం తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి ఆ దిశగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తేవాలి. అప్పుడే పామాయిల్ రైతులకు పూర్తిస్థాయి న్యాయం జరుగుతుంది.

- పుట్టా సోమన్నచౌదరి