Others

నగల మురికి వదిలిద్దాం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రతిరోజూ మనం ధరించే బంగారు నగలనున నెలకోసారైనా శుభ్రం చేయాలి. లేదంటే మురికి, దుమ్ము పట్టుకుని పాతవాటిలా కనిపిస్తాయి. చూడ్డానికి కూడా బాగోవు. మరి వాటిని కొత్తవాటిలా మెరిపించాలంటే..
* వేడినీళ్లలో నాలుగు చుక్కలు గినె్నలు తోమడానికి ఉపయోగించే సబ్బు వేయాలి. ఆ నీళ్లు గోరువెచ్చగా అయ్యాక అందులో నగలు వేయాలి. పది నిముషాల తర్వాత వాటిని బయటకు తీసి మెత్తని టూత్‌బ్రష్‌తో రుద్దాలి. లేదంటే కనుబొమలకు వాడే బ్రష్‌తో రుద్ది కడిగినా వాటికున్న మురికి పూర్తిగా వదిలిపోతుంది.
* నగల్ని సింకులో ధారగా వస్తోన్న నీటి ప్రవాహం అడుగున ఉంచినా వాటికి పట్టిన మురికి వదిలిపోతుంది. అయితే సింకు అడుగున చిన్న తువాలు లాంటిదాన్ని పరిస్తే.. చిన్న చిన్న దిద్దులు, ముక్కు పుడక వంటివి సింకు గొట్టంలోకి పడిపోకుండా ఉంటాయి. లేదంటే చిన్న చిన్న వాటిని టీ ఫిల్టర్‌లో వేసి శుభ్రం చేయవచ్చు.
* టూత్‌పేస్ట్‌లో కాసిని నీళ్లు కలపాలి. ఇందులో బ్రష్‌ను ముంచి నగల్ని శుభ్రం చేయాలి. ఆ తరువాత చల్లని నీళ్లతో కడిగేస్తే అవి కొత్తవాటిలా మెరిసిపోతాయి.
* ఘాటైన రసాయనాలు ఉపయోగించడం వల్ల నగలు నాణ్యతను కోల్పోతాయి. వాటికి బదులు వేడినీళ్లలో కాస్త పసుపు వేసి మరిగించాలి. కాసేపయ్యాక నీళ్లను దింపేయాలి. వీటిలో నగల్ని వేయాలి. నీళ్లు గోరువెచ్చగా మారిన తరువాత బ్రష్‌తో తోమితే నగలు మురికిని వదిలించుకుని కొత్తవాటిలా మెరిసిపోతాయి.