Others

డైరెక్టర్స్ ఛాయిస్.. ( సోగ్గాడి విజయం)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నాగార్జునను బంగార్రాజుగా చూపించి -తొలి సినిమాతోనే హిట్టుపట్టాడు కళ్యాణ్‌కృష్ణ కురసాల. సొగ్గాడే చిన్నినాయినా అంటూ సంక్రాంతి రేసులో నాగార్జునను టాప్‌కు చేర్చిన కళ్యాణ్‌కృష్ణతో చిట్‌చాట్..

సక్సెస్ ఎలా ఉంది?
సోగ్గాడంత ఆనందంగా ఉంది. నన్ను నమ్మిన నాగార్జునకు ముందు థాంక్స్ చెప్పాలి.
ఈ ఛాన్స్ ఎలా వచ్చింది?
నాగచైతన్యతో సినిమా చేయాలని నాగార్జునను ఎక్కువగా కలిసేవాడిని. ఆ క్రమంలో ఉయ్యాల జంపాల నిర్మాత రామ్మోహన్‌తో పరిచయం పెరిగింది. ఓరోజు ఆయన ‘నా దగ్గర కథ ఉంది. దర్శకత్వం చేస్తావా?’ అని అడిగారు. సరే అని, 15 రోజుల తరువాత కథను నాగార్జునకు వినిపించా.
నాగ్‌తో పనిచేయడం.. ?
చాలా హ్యాపీగా ఉంది. నిజంగా ఆయన చాలా ఫ్రీగా ఉంటారు. ప్రతి విషయంలో క్లారిటీతో ఉంటారు. ఈ సినిమా విషయంలో ఆయన దగ్గర చాలా నేర్చుకున్నా.
ఆ టైటిల్‌కు కారణం?
సినిమాలో నాగార్జున రెండు పాత్రల్లో కనిపిస్తాడు. ఒకటి బంగార్రాజు, మరొకటి రాము. బంగార్రాజు పాత్ర చాలా ఊరిలో ఉండే రొమాన్స్ రాజా. అది కూడా ఆత్మలా ఉంటుంది. బంగార్రాజు పాత్ర నాగార్జునకు బాగా నచ్చింది.
మరి నాగచైతన్యతో సినిమా?
తప్పకుండా చేస్తా. ప్రస్తుతం రెండు మూడు సినిమాలతో బిజీగా ఉండటం వల్ల ముందు ఈ సినిమా చేయాల్సి వచ్చింది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్?
ప్రస్తుతానికి అన్నపూర్ణ బ్యానర్‌లోనే మరో సినిమాకు కమిట్ అయ్యా? అది ఎవరితో అనేది త్వరలోనే తెలుస్తుంది.

-శ్రీ