Others

మృగాళ్లు..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కుబుసం విడిచిన
కుసంస్కారానికి ఆనవాళ్లవుతున్న
‘మృగాళ్ల’ను చూసి..
నేడు సభ్యసమాజం తలదించుకుంటోంది!

కామంతో కళ్లు మూసుకుపోయి..
వావి వరసలు మరిచి..
పాశవికంగా ఘోరాలకు
తెగబడుతున్న నేరగాళ్లను చూసి..
దేశ ప్రతిష్ట మంట కలుస్తోంది!

మానవ తోడేళ్ల ఉరవడి
పెరగడంతో..
తల్లి పొత్తిళ్లలో నిద్రిస్తున్న
పసిపాపకు సైతం
రక్షణ లేని వైనం చూసి..
గుండె తరుక్కుపోతోంది!

ఉత్తమ విలువలు
నైతిక బోధనలు
పాఠ్యాంశాల్లో మచ్చుకైనా..
లేనందుకు..
‘మృగోన్మాదం’కు
తెరలేపినట్లవుతోంది!

అంతర్జాలంలో
విశృంఖలంగా వికటాట్టహాసం చేస్తున్న
చౌకబారు అశ్లీల వీడియోలకు
చరమగీతం పాడితే తప్ప..
కర్కశంగా పైశాచికత్వానికి
బలైపోతున్న..
లే మొగ్గలను కాపాడుకోలేము!

యువత
మత్తులో జోగకుండా
మాదకద్రవ్యాలపై
ఉక్కుపాదం మోపితే గానీ..
కామాంధుల ఆగడాలను ఆపలేము!

- దాస్యం సేనాధిపతి 94405 25544