Others

‘ప్రతిభ’కే ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణలో ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. మార్కెట్ అవసరాలకనుగుణంగా విద్యాబుద్ధులు విద్యార్థులకు అందించే దిశగా ఈ యూనివర్సిటీలు పనిచేయనున్నాయి. ఇందులో రిజర్వేషన్లను తావులేకుండా ‘ప్రతిభ’కే పట్టం కట్టబోతున్నారు. ప్రతి రంగం తేజోవంతంగా విలసిల్లాలంటే ‘ప్రతిభ’ను వెలికితీసి దాన్ని గౌరవించాల్సిన ఆవశ్యకత ఉన్న సందర్భమిది. పాశ్చాత్య దేశాల్లో ఎన్నో ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు పనిచేస్తున్నాయి. అవి తమతమ ‘బెంచ్ మార్క్’ను చూపాయి. దేశంలోనూ కొన్నిచోట్ల ఈ రకమైన విద్యాసంస్థలు వేగంగా విస్తరిస్తున్నాయి. ప్రపంచంతో కలిసి నడిచేందుకు అవి తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ఆ దారిలో తెలంగాణ ప్రభుత్వం పయనించడానికి ముందుకొచ్చింది.
ఇది ఇలా ఉండగా ఉద్యోగ అవకాశాలు తక్కువ ఉన్న ఇంజినీరింగ్ కోర్సులను నిలిపివేయనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. ఉద్యోగ అవకాశాలు దండిగా ఉన్న కృత్రిమమేథ, బ్లాక్‌చెయిన్, ఇంటర్‌నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటి), సైబర్ సెక్యూరిటీ, రోబోటిక్స్, డేటా అనాలిసిస్, 3డి ప్రింటింగ్ లాంటి వర్తమాన సాంకేతిక కోర్సులకు ఎక్కువ ప్రాధాన్యతనిచ్చి అనుమతులు మంజూరు చేయనున్నది. ‘్భరత్‌లో తయారీ’ అన్న నినాదం కీలకంగా మారనున్నది. పరిశ్రమల డిమాండ్‌కు అనుగుణంగా కోర్సుల రూపకల్పనకు ప్రాధాన్యత ఉంటుందని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.
ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, ఉపాధికి ఉపకరించే కొత్త కోర్సులను ప్రవేశపెట్టే యోచన వర్తమాన సమాజ పోకడను తెలియజేస్తోంది. ఇంకా సాంప్రదాయ పద్ధతినే పట్టుకుని వేలాడుతామని భావించే వారికి మనుగడ లేదని స్పష్టంగా తేలిపోయింది. ఇది అన్ని జీవన పార్శ్వాలకూ వర్తిస్తుందని గమనించినప్పుడే ప్రగతి మెట్లు ఎక్కేందుకు అవకాశముంది.
వచ్చే ఐదేళ్ళలో ఐటి రంగంలో ఉద్యోగాల సంఖ్య రెట్టింపు అవుతుందని హైదరాబాద్ సాఫ్ట్‌వేర్ ఎక్స్‌పోర్టర్స్ అసోసియేషన్ (హైసియా) ఇటీవల పేర్కొన్నది. బహుళ జాతి ఐటీ కంపెనీలు మరిన్ని హైదరాబాద్‌కు వస్తున్నాయని, ఇప్పటికే ఉన్నవి విస్తరిస్తున్నాయని ఆ సంస్థ వెల్లడించింది. స్టార్టప్ సంస్థల విస్తరణకు సైతం ఈ వాతావరణం దోహదపడుతోందని, తదనుగుణంగా ఉపాధి పెరుగుతోందని వారు చెప్పారు. అలాగే కౌశల్ యువ సంవాద్ కార్యక్రమాన్ని ఇటీవల కేంద్ర నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వశాఖ నిర్వహించింది. దేశవ్యాప్త శిక్షణా కేంద్రాల్లో యువతతో ముఖాముఖిని ఏర్పాటుచేసింది. నూతన ఆలోచనలు, నైపుణ్యాలే నేటి ఆవశ్యకతగా భావిస్తున్నారు. యువతకు అవసరమైన ఉద్యోగ అవకాశాలను మెరుగుపరిచేందుకు సరైన దిశ-దశను చూపుతున్నారు.
ఇటీవల హైదరాబాద్‌లో ‘‘ఉన్నత విద్యాసంస్థల్లో గుర్తింపు, నాణ్యతాభివృద్ధి - ర్యాంకింగ్’’ అన్న అంశంపై జాతీయ సదస్సు జరిగింది. అందులో నీతి ఆయోగ్ సభ్యుడు వీకే సారస్వత్ మాట్లాడుతూ ఇన్నోవేషన్స్‌కు పెద్దపీట వేయాలని సూచించారు. పాఠశాల విద్యలోనే ఫౌండేషన్ శిక్షణపై దృష్టిసారించాలని సూచించారు. ఉద్యోగాలకు ఉపయోగపడే విద్యను అందించాలని పేర్కొన్నారు. ఇందుకుగాను నాలుగు ‘సీ’లు అవసరమని అవి... కమ్యూనికేషన్, కొలాబరేషన్, క్రిటికల్ థింకింగ్, క్రియేటివిటి అని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇది ఇలా ఉంటే... మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్‌వర్క్స్ సమాహారమే కృత్రిమమేథ (ఏఐ) అని నిపుణులు చెబుతున్నారు. చాలా సమస్యలకు పరిష్కారాలను తెలుసుకునేందుకు ఇది మార్గం చూపుతోంది. శాస్త్ర విజ్ఞాన ‘‘జ్ఞానం’’ ఎంతో కీలకంగా మారిన తరుణంలో మనిషి గొంతును యంత్రం గుర్తుపట్టడం, ముఖాన్ని గుర్తించడం (ఫేస్ రికగ్నిషన్), వస్తువులను సైతం గుర్తించే నైపుణ్యం బాగా వృద్ధి చెందింది. గత రెండు దశాబ్దాలలో కృత్రిమ మేథపై జరిగిన విస్తృత పరిశోధనల కారణంగా రోబోటిక్స్, స్వయంచాలక వాహనాలు, వైద్య రంగంలో మార్పులు చోటుచేసుకున్నాయి. అటు ప్రభుత్వాలకు, ఇటు ప్రజలకు ఈ కృత్రిమమేథ ఆధారిత టెక్నాలజీ ఎంతో ఉపకరిస్తోందన్న సంగతి ఇప్పటికే రుజువైంది. దాన్ని మరింత సమర్థవంతంగా, విస్తృతంగా ఎలా ఉపయోగించుకోవాలన్న అంశంపై అనేక అధ్యయనాలు - పరిశోధనలు జరుగుతున్నాయి. ఈ నూతన సాంకేతిక పరిజ్ఞానం వల్లనే వచ్చే ఐదేళ్ళలో భారతదేశం ఐదులక్షల కోట్ల ఆర్థిక వ్యవస్థ ‘కల’గంటోంది. ఆ కల సాకారమయ్యే అవకాశాలు దండిగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.
ప్రపంచంలో పలు బడా ఐటీ కంపెనీలు ఇప్పుడు కృత్రిమమేథను మరింత మెరుగుపరిచి అన్వయించుకునేందుకు పెద్దఎత్తున పరిశోధనలు నిర్వహిస్తున్నాయి. ఇందుకోసం భారీఎత్తున డబ్బు ఖర్చుచేస్తున్నాయి. నవ్యత లేకపోతే రాణింపు లేదన్న సూత్రం ఆధారంగా అందరూ ఆ రంగంపై విశేష శ్రద్ధపెట్టి పరిశోధనలు జరుపుతున్నారు. తగిన ఫలితాలు లభిస్తున్నాయి. అవి ప్రజల కళ్ళముందు కనిపిస్తున్నాయి.
టెక్ శిక్షణ
ఈ నేపథ్యంలో బీటెక్ పూర్తిచేసిన అమ్మాయిలకు టాలెంట్ స్ప్రింట్ సంస్థ తాజా సాంకేతికతపై ప్రత్యేక శిక్షణ ఇచ్చేందుకు సిద్ధమైంది. ఇందుకోసం దరఖాస్తులు ఆహ్వానించగా తెలంగాణ, ఏపీ తదితర రాష్ట్రాలనుంచి వేల మంది పోటీపడ్డారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన అమ్మాయిలే ఎక్కువ మంది దరఖాస్తు చేసుకున్నారని తెలిసింది. వచ్చే మూడేళ్ళలో 600 మంది బిటెక్ పూర్తిచేసిన అమ్మాయిలను టెక్ నిపుణులుగా తీర్చిదిద్దుతామని ఆ సంస్థ సిఈఓ డాక్టర్ శాంతనుపాల్ పేర్కొన్నారు.
ఈ ఏడాది బ్రిటన్ ఆర్థిక వ్యవస్థను భారత్ దాటేసి ముందుకు వెళుతుందని ఐహెచ్‌ఎస్ మార్కిట్ అనే అధ్యయన సంస్థ పేర్కొన్నది. ఈ ‘దూకుడు’తో మరో ఆరేళ్ళలో జపాన్‌ను సైతం భారత ఆర్థిక వ్యవస్థ అధిగమిస్తుందని అంచనా వేసింది. అప్పటికి ప్రపంచ జీడీపీ వృద్ధిలో భారత భాగస్వామ్యం బాగా పెరుగుతుందని అభిప్రాయపడింది. ఏ విధంగా చూసినా ఇది ఆశావహ వాతావరణమే.
ఇది ఇలా ఉండగా చైనా ఆర్థిక వృద్ధిరేటు బాగా పడిపోయిందని గణాంకాలు చెబుతున్నాయి. గత 27 ఏళ్ళలో ఎన్నడూ లేనంత కనిష్టంగా అంటే 6.2 శాతం మాత్రమే వృద్ధిని చైనా నమోదు చేసింది. అమెరికా చైనాపై వాణిజ్య యుద్ధం ప్రారంభించిన అనంతరం ఈ క్షీణత స్పష్టంగా కనిపిస్తోంది. ఇది ఆందోళనకర పరిస్థితేనని ఆ దేశ ఆర్థిక నిపుణులే అంగీకరిస్తున్నారు. ఈ అమెరికా-చైనా వాణిజ్య యుద్ధ వాతావరణం భారత్‌కు కలిసొస్తుందని విశే్లషకుల భావన. ఈ అనుకూల పరిస్థితి భారత ఆర్థికశక్తి పెరిగేందుకు ఎంతో ఉపకరిస్తుందని ఆశాభావం వ్యక్తమవుతోంది.
చంద్రుడు అందడంతో మారనున్న సమీకరణాలు!
భూకక్ష్యలో పరిభ్రమిస్తున్న అంతర్జాతీయ అంతరిక్ష వేదికను సందర్శించేందుకు ఎందరో ఆసక్తి కనబరుస్తున్నారు. అమెరికాకు చెందిన స్పేస్-ఎక్స్ సంస్థ అలాంటి వారిని తీసుకెళ్ళేందుకు సిద్ధమవుతోంది. 2023 సంవత్సరంలో అంతరిక్ష పర్యాటకులను తీసుకెళ్ళడానికి ఆ సంస్థ ఏర్పాట్లుచేసుకుంటోంది. ఇలాన్‌మస్క్ కార్యదక్షతకు ఇది నిదర్శనంగా నిలువనున్నది. మొత్తం మీద ఇప్పటి వరకున్న మానవ సమీకరణాలన్నీ మారబోతున్నాయి. సహజంగానే అవి మానవ జీవన విధానంపై ప్రభావం చూపనున్నాయి.
ఇదిలా ఉండగా... భారతదేశ చంద్రయాన్-2 ప్రాజెక్టుపై పలు దేశాలు ప్రశంసలు కురిపించాయి. ఎన్నో పత్రికలు శ్లాఘించాయి. అంతరిక్ష రంగంలో భారత్ నిర్దేశించుకున్న లక్ష్యాలకు సాక్ష్యం ఈ ప్రాజెక్టు అని ‘న్యూయార్క్ టైమ్స్’ పత్రిక కొనియాడింది. చంద్రుడిపై నీటి జాడకు సంబంధించిన కీలక సమాచారాన్ని రాబట్టే అవకాశం కనిపిస్తోందని ‘సైంటిఫిక్ అమెరికన్’ అనే వెబ్‌సైట్ రాసింది.
ఈ పరిణామాలన్నీ నూతన భారతదేశ ముఖచిత్రాన్ని పట్టి చూపుతున్నాయి. ఓ కొత్త కక్ష్యలోకి దేశం ప్రవేశించిన వైనాన్ని తెలుపుతున్నాయి. ప్రపంచంతో ‘్భజం’ కలిపి గర్వంగా అడుగులేస్తున్న ‘దృశ్యం’ కనిపిస్తోంది. విచిత్రమేమిటంటే.. వామపక్ష ఆలోచనాపరుల, ముఖ్యంగా మావోయిస్టుల అంచనాలన్నీ తలకిందులయ్యాయి. వారి ‘డైలెక్టిక్స్’ అన్నీ గల్లంతయ్యాయి. అగమ్యగోచర స్థితిలోకి వారు నెట్టబడ్డారు. అయినా మంత్రాల బలం లేకపోయినా తుప్పిళ్ళ బలం ప్రదర్శిస్తున్నారు. ప్రజాస్వామ్యయుగంలో ఈ విధానం వినోదకరమైనదని ఇంకెప్పటికి వారు గ్రహిస్తారో?...

- వుప్పల నరసింహం