Others

వెన్నెలలో మల్లియలు (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనె్నలలో మల్లియలు/ మల్లియలో ఘుమఘుమలు/ ఘుమ ఘుమలో గుసగుసలు/ ఏవేవో కోరికలు... ఏవేవో కోరికలు...’
ఈ గీతాన్ని రచించింది దాశరధి క్రిష్ణమాచార్య. సంగీత రచన తాతినేని చలపతిరావు. ‘‘మనుషులు- మమతలు’’ చిత్రం కోసం రూపుదిద్దుకున్న గీతం. దర్శకుడు కె.ప్రత్యగాత్మ నేతృత్వంలో ప్రసాద్ ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌లో నిర్మితమైన కుటుంబ కథాచిత్రమిది. ఈ ఖ్యాతి మొత్తం ఉత్తమాభిరుచిగల నిర్మాత ఏవి సుబ్బారావు ఖాతాకి చెంది అత్యంత కళాత్మక విలువలతోపాటు ఆర్థిక పరిపుష్టిని కలిగించింది.
ఈ పాట ఎత్తుగడలోనే యువ హృదయాల ఉర్రూతలూగించే సంగీత సాహిత్య వస్తువులు ఇమిడిపోయాయి. పల్లవిని అనుసరిస్తూ అమరిన చరణాలు చాలా అందంగా, పొందికగా, లలిత భావగర్భితంగా ఉంటాయ. పి.సుశీలమ్మ గళంలో, తెరమీద మహానటి సావిత్రి హావభావాలలో -చంద్రుని వెనె్నలతో పోటీపడేటంట హాయగా దర్శకుడు కె.ప్రత్యగాత్మ చిత్రీకరించారు. ఛాయాగ్రాహకులు, కళాదర్శకులు అందుకు సహకరించారు.
నీ హృదయంలో నిలవాలని/ నీ కౌగిలిలో కరగాలని/
నీవే నీవే కావాలని/ ఏవేవో కోరికలు...
కనె్న మనసు కనే కలలకు అద్దం పడ్తోంది ఈ చరణం. యువ జంటలకు తెరపై వలపు రుచి చూపెడ్తోంది సావిత్రి, ఏఎన్‌ఆర్‌ల అభినయం.
ఇక మలి చరణానికి వస్తే/ పూల పల్లకిలోన తేలిపోయే సమయాన/ బుగ్గలు సిగ్గులు తొణకాలని అవి నీకే నీకే ఇవ్వాలని...
ఏవేవో కోరికలు’ అను పల్లవి అనుసరిస్తుంటే... ఆ కమ్మటి గీతాన్ని మనకందించి కలలు, కలవరింతలు కలిగించి మన మనసులను గిలిగింతలు పెట్టించిన కళాగీతమిది. సంగీత, సాహిత్య, దర్శక, ఆర్టిస్టులు - ఆనంద డోలల ఓలలాడించారు అనునది నిర్వివాదాంశం- ఈ అంశం మీకందరికీ నచ్చేదే... మీ అందరు మెచ్చిందే... ఇకపై విన్నా మెచ్చేదే-