Others

అంతస్తులు (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ సినిమా జగపతి ఆర్ట్స్ పతాకంపై విబి రాజేంద్రప్రసాద్ నిర్మాణ సారథ్యంలో విక్టరీ మధుసూధనరావు నిర్దేశకత్వంలో రూపొంది, నేషనల్ బెస్ట్ఫిల్మ్ అవార్డు సొంతం చేసుకుంది.
ఈ కథ జమీందారి వ్యవస్థకి ప్రతీకగా రూపొందింది. జమీందారు రాజా జగన్నాథరావు పాత్రలో గుమ్మడి హుందాగా, ఆయన సతీమణి రూపాదేవి పాత్రలో జి.వరలక్ష్మి సహజంగా అభినయించారు. వారికి ఇరువురు కుమారులు ఒకరు అక్కినేని, మరొకరు లవకుశ ఫేం నాగరాజు. స్వేచ్ఛా జీవనం కోరుతున్న నాగరాజు, తండ్రి ఆంక్షలకి ఆహుతి అవుతాడు. దాంతో రాజా జగన్నాథరావు కుంగిపోతాడు. ఆ తరుణంలో పెదబాబు ఇల్లువదలిపోతుంటే తండ్రి మన హోదాకు తగ్గట్టుగా వ్యవహరించు, లోకానుభవాన్ని సంపాదించు అని వెన్నుతట్టి పంపుతాడు. ఇలా ఇల్లువదలి వెళ్ళిన పెదబాబుకి నాగు (జగ్గయ్య) తారసపడి వీలైనంత తప్పుదోవ పట్టిస్తాడు. మగువలు, తాగుడుకు అలవాటైన పెదబాబు కథానాయకి (కృష్ణకుమారి) చేత చిక్కి సన్మార్గంలో మళ్ళీ ‘యు’ టర్న్ తీసుకొనే సమయానికి -తండ్రి రాజా జగన్నాథరావు అస్వస్తులైన విషయం తెలిసి ఇల్లుచేరతాడు. తండ్రి పెదబాబుని చేరబిలిచి తన గుండె లోతుల్లో గూడుకట్టుకున్న గరళాన్ని వెళ్ళగక్కి మాట తీసుకుంటాడు. తల్లికి తెలియకుండా... తనకి ఇంకొక స్ర్తిద్వారా కలిగిన స్ర్తి సంతానం రాణిని ఆదరించమని మాట తీసుకుని కన్నుమూస్తాడు. కథ అక్కడనుంచి కొన్ని మలుపులు తిరిగి శుభానికి తెరతీస్తుంది. ఈ కథాకథనంలో పాత్రలపై సాగిన సంభాషణలు బహు సమర్ధవంతంగా వ్రాశారు ఆచార్య ఆత్రేయ. మచ్చుకి ఇక్కడ ఒక సంభాషణ ముచ్చటించుకుందాం-
‘ఆడది కప్పు కాఫీ కాదు...కాఫీ కప్పుకాదు’’ అంటూ కథానాయకి కథానాయకుడిని బుద్ధిచెప్తుంది. బహుశా ఈ సంభాషణ ఎంతో క్లుప్తంగా, భావభరితంగా అన్పిస్తుంది. ఇలాటివెన్నో సంభాషణలు పాత్రల్ని తెరపై పండించాయి.
ఇక పాటల పరిమళాలకి వస్తే దిగ్గజాల్లాంటి సినీ కవులు ఆచార్య ఆత్రేయ, ఆరుద్ర, కొసరాజు ఎంతో భావస్ఫోరకంగా రచించారు. పై వారందరూ ఆస్థానకవులు జగపతి సంస్థకు. ఈ చిత్రానికి ప్రత్యేకత భానుమతి. ఒక వినూత్నమైన పాత్రలో (రాజా జగన్నాథరావు) అజ్ఞాన పుత్రికగా బ్యానర్‌కి, చిత్రానికి మకుటాయమానంగా నిలిచారు. భారీ తారాగణంతో రూపొందిన ఈ చిత్రం బహుధా ప్రశంసనీయం. అందుకే నంది అవార్డు పురస్కారం అందుకుంది. బెస్ట్‌యాక్ట్రెస్ క్యాటగిరీ క్రింద భానుమతి రాష్టప్రతి చేతులమీదుగా అవార్డుగ్రహీత అయింది.