AADIVAVRAM - Others

ఆలోచనలే మాటల రూపంలో.. అద్భుత ఆవిష్కరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మనసులోని మాటలు ఇక అక్కడే దాగవు. మనుషుల ఆలోచనలను చదివి వారు ఏమనుకుంటున్నారో మాటల రూపంలో బయటకు వినిపించే సాంకేతికతను శాస్తవ్రేత్తలు అభివృద్ధి చేస్తున్నారు. ఇందుకోసం మెదడుకు అమర్చే ఓ పరికరాన్ని అమెరికాలోని యూనివర్శిటీ ఆప్ కాలిఫోర్నియా పరిశోధకులు రూపొందించారు. మాట పడిపోయిన చాలామందికి ఈ సాంకేతికత ద్వారా ఎంతో మేలు జరిగే అవకాశం ఉందని వారు అంటున్నారు.
ఇలా పనిచేస్తుంది..
* మనసును చదివే ఈ సాంకేతికత రెండు దశల్లో పనిచేస్తుంది. మొదట మెదడులో ఓ ఎలక్రోడ్‌ను అమర్చాల్సి ఉంటుంది. పెదవులు, నాలుక, స్వరపేటిక, దవడలకు మెదడు పంపే ఎలక్ట్రిక్ సంకేతాలను ఇది గ్రహిస్తుంది.
* రెండో దశలో.. గ్రహించిన సంకేతాలను ఓ శక్తివంతమైన కంప్యూటింగ్ వ్యవస్థ విశే్లషించాయి, ఆయా కదలికల వల్ల ఏర్పడే ధ్వనులను కృత్రిమంగా ఏర్పరుస్తుంది. ఓ కృత్రిమ గొంతు వీటిని బయటకు వినిపిస్తుంది.
ఒక్కో పదం పలికే సమయంలో మెదడులో ఉత్పన్నమయ్యే ఎలక్ట్రిక్ సంకేతాల సరళిని పరిశీలించడం ద్వారా ఆలోచనలు చదవడం సులువన్న అభిప్రాయాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకూ ఇలా చేసిన ప్రయత్నాలు పెద్దగా విజయవంతం కాలేదు. అందుకే శాస్తవ్రేత్తలు ఈ మార్గాన్ని ఎంచుకున్నారు. నోటి కదలికలు, ధ్వనులను విశే్లషించి, వాటి ద్వారా ఏర్పడే పదాలను గుర్తించే పద్ధతిని అనుసరించారు. మెదడులోని చర్యల ఆధారంగా ఓ మనిషి మాట్లాడే పూర్తి వాక్యాలను గుర్తించగలగడం ఇదే తొలిసారని ఈ పరిశోధనలో పాలు పంచుకున్న ప్రొఫెసర్ ఎడ్వర్డ్ చాంగ్ అన్నారు. మనకు అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానంతోనే ఈ పరికరాన్ని రూపొందించవచ్చని వీళ్లు రుజువు చేశారు. మాట్లాడే సామర్థ్యం కోల్పోయినవారికి దీని ద్వారా మేలు చేయొచ్చు. చాలా తక్కువ సమయంలో పలికే ధ్వనుల కన్నా.. సుదీర్ఘంగా పలికే ధ్వనుల విషయంలో ఈ సాంకేతిక మెరుగ్గా పనిచేస్తుంది. ఐదుగురు వ్యక్తులతో కొన్ని వందల వాక్యాలను చదివించి ఈ సాంకేతికతపై పరిశోధకులు ప్రయోగాలు నిర్వహించారు. వారి కృత్రిమ మాటలను వింటున్న శ్రోతలకు పదాల జాబితాను ఇచ్చారు. కృత్రిమ మాటల్లో దాదాపు 70 శాతాన్ని శ్రోతలు సరిగ్గా అర్థం చేసుకోగలిగారు.
నాడీ సంబంధ వ్యాధులు, మెదడు గాయాలు, గొంతు కేన్సర్, పక్షవాతం, పార్కిన్సన్, మల్టిపుల్ సెలోరోసిస్ వంటి వాటి బారిన పడ్డ వారికి ఈ కొత్త సాంకేతికత సాయపడే అవకాశం ఉందని పరిశోధకులు అంటున్నారు. పెదవులు, నాలుక, స్వరపేటిక, దవడ కదలికలతో సంబంధం ఉండే మెదడులోని భాగాలపై ఆధారపడి ఈ సాంకేతికత పనిచేస్తుంది. అందుకే కొన్ని రకాల పక్షవాతాలకు గురైన వారికి దీని ద్వారా ప్రయోజనం ఉండదు. సెరెబ్రల్ పాల్సీ ఉండే చిన్నారులతో జీవితంలో ఎప్పుడూ మాట్లాడని వారికి మాట్లాడటంపై తర్ఫీదునిచ్చేందుకు దీని ద్వారా కొంతవరకూ అవకాశాలున్నాయి. మెదడును చదివే ఇలాంటి సాంకేతికతలు ఉండాలా? వద్దా? అన్న అంశంపై శాస్తవ్రేత్తల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మాట్లాడే సామర్థ్యం కోల్పోయినవారికి మాత్రం ఇదో వరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ సాంకేతికత ఆరంభ దశల్లోనే ఉందని, వినియోగానికి ఇప్పుడిప్పుడే అందుబాటులోకి రాకపోవచ్చని యూనివర్శిటీ కాలేజ్ ఆఫ్ లండన్ ప్రొఫెసర్స్ చెబుతున్నారు.

-మహి