Others

సాహితీ యోధుడు దాశరథి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓ తెలంగాణమా! నీ పెదవులతో ఊదిన శంఖధ్వనులు ఈ భూమండలమంతా ఒక్కమారుగా బొబ్బలు పెట్టినట్లుగా ప్రతిధ్వనించాయి. ఆహా! ఉదయించిన సూర్యుని కిరణాలచేత ప్రీతిపొందిన పద్మాలచే, చలించిన ఆకాశగంగాతరంగాలు అన్ని దిక్కులను తెలవారేటట్లు చేశాయి.
అమ్మా తెలంగాణా! నీ పిల్లల్లో ప్రకాశించే విప్లవాత్మకమైన కదలిక ఊరికే పోలేదు. భూమండలాన్నంతా సవరించి ఉజ్జ్వలమైన కాంతిమంతమైన సూర్యుడిని పిలిచి దేశమంతా కొత్త కాంతి సముద్రాలు నింపారు. వారంతా వీరులు, యోధులేకాదు. న్యాయం తెలిసిన పరోపకారులైన తెలుగువీరులు సుమా!
- ఈ పదునైన మాటలు తలచుకోగానే గుర్తుకొచ్చే సాహితీ యోధుడు డా॥ దాశరథి. వీరుల పురిటిగడ్డ తెలంగాణ. ఎందరో యోధులు తెలంగాణ విముక్తి కోసం తుదిశ్వాస వరకు పోరాడారు. దుర్మార్గులైన రజాకార్ల అరాచకత్వాన్ని ఎదిరించిన రణక్షేత్రం తెలంగాణ. అటువంటి నేల అస్తిత్వ పరిరక్షణ కోసం తెలంగాణ ప్రజాసమూహం తమదైన పద్ధతుల్లో ధిక్కారస్వరం వినిపించింది. అయుధం ధరించి పోరాడినవారు ఒకరైతే.. అక్షరాయుధంతో పోరాడిన సాహితీయోధుడు డా॥ దాశరథి కృష్ణమాచార్యులు. మహాకవి దాశరథి కృష్ణమాచార్యులు ఒకప్పటి వరంగల్ జిల్లాలో ఉన్న గూడూరు గ్రామంలో జన్మించారు. నాటి పాలకులపై వ్యతిరేక ప్రజాపోరాటాల్లో మమేకవౌతూనే సాటి వీరుల సాహసాలను పద్యాల రూపంలో, సాహిత్యరూపంలో ప్రశంసించిన గొప్ప రచయిత దాశరథి కృష్ణమాచార్యులు. ఆచరణాత్మక వైఖరితో ప్రజలను చైతన్యవంతం చేసిన ఉద్యమ కవి. ‘‘నాగీతవళి ఎంత దూరము ప్రయాణంబౌనో అందాక ఈ భూగోళంబునకగ్గి పెట్టెదన్నాడు’’. పవియతను జైలు గోడల మీద రాసి ప్రజల హృదయాల్లో మహాకవిగా స్థానం పొందాడు. అగ్నిధార, రుద్రవీణ, మహాంధ్రోదయం, పునర్నవం, కవితా పుష్పకం, అమరంతో సమరం, అమృతాభిషేకం, ఆలోచనాలోనాలు మొదలైన కవితా సంపుటాలను, నవిమి నాటికలు యాత్రాస్మకృతి వంటి పలు గ్రంథాలను రచించారు. సినీ గేయ కవిగా, ఆణిముత్యాలు వంటి పాటలు రాసి సినిమా పాటలకు సాహిత్య గౌరవాన్ని తీసుకొచ్చిన గొప్ప రచయిత దాశరథి. వీరుల త్యాగాలను చరిత్రపుటల్లోకి ఎక్కించి భావితరాలకు స్ఫూర్తినింపి, ఇటువంటి వీరులను కన్న తెలంగాణ తల్లి గొప్పదనాన్ని కీర్తించిన గొప్ప సాహిత్యవేత్త. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణం పోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్ళను అనువదించారు. ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలు పొందిన తెలంగాణ సత్యాయోధుడు. సముద్రం ఉప్పొంగుతుండగా చూసేవారు చాలామంది ఉంటారు. కాని సముద్రం చెలితులి కట్టదాటడం ఎవరూ ఊహించలేరు. కాని తెలంగాణ నేల ఈ అరుదైన పరిణామాలను అద్భుతాలను ప్రపంచానికి చూపెట్టింది. తెలంగాణ నేలమీద జరిగిన విముక్తి ఉద్యమాలు, సాయుధ పోరాటాలు ప్రత్యేక రాష్ట్ర మహోద్యమాల్లో తెలంగాణ ప్రజలు సముద్రంలో అలలు మాదిరిగా ఉవ్వెత్తున ఉప్పొంగి ఎగిశారు. ఆ హోరును, తెలంగాణ వీరుల తిరుగుబాటు జోరును, మహోన్నత త్యాగాల తీరును దాశరథి సాహిత్య రచనలు విని ఉత్తేజితులు కావడానికి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి బాటలు వేసాయి. తెలుగులో గజల్ ప్రక్రియకు ప్రాణంపోసిన దాశరథి 1961లో గాలిబ్ గజళ్ళను అనువదించిన భాషాసాహిత్యవేత్త ప్రసిద్ధ ఉర్దూ కవుల కవిత్వాన్ని అనువదించి విమర్శకుల ప్రశంసలను పొందాడు. తెలుగు సాహత్యానికి చేసిన సేవకుగాను, ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు (1961), కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు (1974) అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చివరి ఆస్థానకవి అక్షరానికి ఆవేశాన్ని తొడిగి అభ్యుదయ పథాన తన కవిత్వాన్ని నడుపుతూనే సున్నితమైన భావుకతతోనూ ప్రాచీన పద్యశైలితోనూ ప్రజల హృదయాలను ఆకట్టుకున్న సమన్వయ ప్రతిభాశీల ప్రజాకవి డా॥ దాశరథి కృష్ణమాచార్యులు.

- తోట నాగేష్, 9912764580