Others

ఓహో మోహన రూపా..(నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

1966లో సురేష్ ప్రొడక్షన్స్‌పై రామానాయుడు నిర్మించిన ‘శ్రీకృష్ణ తులాభారం’ చిత్రంలో శ్రీకృష్ణుడు అష్ట్భార్యలతో గడిపే విధానంలో ఒకవైపు శృంగారం, మరోవైపు నారదుని భక్తితత్వాన్ని శ్రీశ్రీ కలం అందించిన తీరు అద్వితీయం. నారదుడు ‘ఓహో మోహనరూపా కేళీ కలాపా/ నినుగని మురిసెను నా మనసే..’ అంటూ శ్రీకృష్ణుని (రాస)కేళి, జగన్నాటక కేళిని స్తుతిస్థూ ప్రారంభమైన గీతంలో -సత్యభామ తన ప్రేమభావన వినిపిస్తూ ‘మధువులు చిందే మందహాసం మరులూరించే వేణుగానం విని విని పరవశమైతినిలే.. బిగిబిగి కౌగిలి కరిగితిలే’ అంటూ అతడిని తన ప్రేమభావనలతో మురిపించినపుడూ చిరునవ్వుతో ఆదరిస్తాడు కృష్ణుడు. అలాగే రుక్మిణి గృహానికి ఏతెంచినపుడు తానే ఆమెకు ప్రేమ పాఠాలు నేర్పతూ ‘ప్రణయారాధన వేళ బాలపతి పూజలు నీకేల బేల/ వలపు చిలుకునే చూపులు నాపై నిలుపవే శుభాంగి, లతాంగి’ అంటూ దరిచేర్చుకుని శృంగారానికి ప్రేరేపించడం ఆ లీలామానుష వేషధారికే సాధ్యం. అదేవిధంగా జాంబవతి ఇతర అష్ట్భార్యలతో చరిస్తూ ‘మధుర సుధారాగమే మదిలో కదిలే తీయగా, శిఖపించవౌళి ననే్నలగా తనువే ఊగే హాయిగా’ అంటూ వారితో నౌకా విహారంతో మురిపించిన శ్రీకృష్ణుని గాంచిన నారదుడు ‘ఆహా! లీలామానుష వేషధారి, మురారి, తనువార నినుగాంచి ధన్యత నొందితశౌరీ’ అంటూ లీలామానుషుని మహిమ, శృంగారతత్వం కని తరించి పులకించిపోతాడు. ఎన్టీఆర్, జమున, దేవిక, కృష్ణకుమారి, నారదుల అభినయం, పెండ్యాల మహత్తర స్వర రచన, ఘంటసాల అటు నారదునికి భక్తితత్వంతోను, ఇటు కృష్ణునికి ప్రణయతత్వంతోనూ పాడిన తీరు అనితర సాధ్యం. సుశీల, వసంత మధుర గాత్రాలతో అలరారిన ఈ గీతం నేటికీ తెలుగు ప్రేక్షకులను సమ్మోహనపరుస్తోంది.

-ఎస్‌ఎస్‌శాస్ర్తీ,విశాఖపట్నం