AADIVAVRAM - Others

బాహుబలం’ అంటే..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రసాయన శాస్త్రంలో ‘వేలన్సీ’ (valency) అనే మాట వస్తుంది. దీని మూలం లేటిన్ భాషలో ఉంది. లేటిన్‌లో ఈ మాట విలువ, బలం, స్థోమత మొదలైన అర్థాలు ఉన్నాయి. ఒక అణువు మరొక అణువుతో సంగం చెందటానికి ఎన్ని అవకాశాలు ఉన్నాయో తెలియపరచటానికి ‘వేలన్సీ’ అనే మాట వాడతారు. ఈ మాట రసాయన శాస్త్రంలో బాగా పాతుకుపోయింది. ఇదేదో బాగుందే అని భాషా శాస్తవ్రేత్తలు ఈ మాటని వ్యాకరణంలో ఉపయోగించటం మొదలుపెట్టేరు. ముందు వ్యాకరణంలో ప్రయోగాన్ని చూద్దాం.
భాషా శాస్త్రంలో కానీ, వ్యాకరణంలో కానీ క్రియకి కొంత బలం ఉంటుంది. ఈ బలాన్ని ఇంగ్లీషులో ‘వేలన్సీ’ అంటారు. ‘వాడు నిద్రపోతున్నాడు’ అన్నప్పుడు ‘నిద్ర పోతున్నాడు’ అనే క్రియ యొక్క బాహు బలం 1; ఎందుకంటే ఆ క్రియ ఒకే ఒక ప్రశ్నకి సమాధానం చెబుతుంది: ‘ఎవరు నిద్రపోతున్నారు?’ అన్న ప్రశ్నకి ‘వాడు’ అని సమాధానం చెబుతుంది. ‘వాడు బంతిని తనే్నడు’ అన్న వాక్యంలో ‘తనే్నడు’ అన్న క్రియ యొక్క బాహుబలం 2; ఎందుకంటే ఈ క్రియ రెండు ప్రశ్నలకి సమాధానం చెప్పగలదు: ‘ఎవరు తనే్నరు? దేనిని తనే్నరు?’ ఇదే విధంగా బాహుబలం 3 ఉన్న క్రియ కి ఉదాహరణ: ‘వాడు ఆమెకి పువ్వులు ఇచ్చేడు’ ఇక్కడ ఇచ్చేడు అన్న క్రియ ఎవరు, ఎవరికి, ఏమిటి ఇచ్చేరు అనే మూడు ప్రశ్నలకి సమాధానం చెబుతుంది.
ఇదే విధంగా ఇప్పుడు రసాయన శాస్త్రంలో మనందరికీ అందుబాటులో ఉన్న ఒక ఉదాహరణ చూద్దాం. నీటి బణువులో రెండు ఉదజని (హైడ్రోజన్) అణువులు, ఒక ఆమ్లజని (ఆక్సిజన్) అణువు ఉన్నాయని మనం ఉన్నత పాఠశాలలోనే చదువుకున్నాం. అంటే ఒకే ఒక ఆమ్లజని అణువు రెండు ఉదజని అణువులతో సంయోగం చెందగలదు. ఈ విషయం చెప్పటానికి ఆమ్లజని బాహుబలం 2 అంటారు. ఒక్కొక్క ఉదజని ఒక ఆమ్లజనితోనే కలువగలదు కనుక ఉదజని బాహు బలం 1.
మరో ఉదాహరణ. మిథేను (methane) అనే వాయు పదార్థం ఉంది. ఒక మిథేను బణువులో ఒక కర్బనం (కార్బన్) అణువు, నాలుగు ఉదజని అణువులు ఉంటాయి. అంటే ఒక్కొక్క కర్బనం అణువు నాలుగు ఉదజని అణువులని పట్టుకోగలదు కనుక కర్బనం బాహుబలం 4. ఇందాకటిలాగే ఒక్కొక్క ఉదజని అణువు ఒక్కొక్క కర్బనానే్న పట్టుకోగలదు. కనుక ఉదజని బాహుబలం - ఇందాకటిలాగే - ఒకటి.
ఇక్కడ ‘వేలన్సీ’ అన్న మాటకి ‘బాహుబలం’ అన్న తెలుగు మాట వాడేను. దీనికి కారణం అర్థం అవాలంటే ఒక బణువులో అణువుల అమరిక ఎలా ఉంటుందో చూపే బొమ్మలు కావాలి. ఈ రకం బొమ్మలని నిర్మాణ క్రమం (స్ట్రక్చరల్ ఫార్ములా) అంటారు. ఒక బణువు యొక్క నిర్మాణ క్రమం చూపేటప్పుడు ఆ బణువు పేరు సంక్షిప్తంగా రాసి, దానికి అటో ఇటో పైనో కిందో చిన్నచిన్న గీతలు గీస్తారు. ఈ గీతలని చేతులులా ఊహించుకుంటే అప్పుడు ఒక అణువు చుట్టూ ఎన్ని గీతలు ఉంటే అదే ఆ అణువు బాహుబలం అవుతుంది. వేలన్సీకి సంయోజకత, సంయోజనీయత వంటి నానార్థాలు కూడా ఉన్నాయి.
దీనిని బట్టి తేలినది ఏమిటంటే ప్రతి మూలకానికి కొంత బాహుబలం ఉంటుంది. చూడండి. మానవుల బాహుబలం 2, విష్ణు మూర్తి బాహుబలం 4, కుమారస్వామి బాహుబలం 6. అదే విధంగా ఉదజని బాహుబలం 1, ఆమ్లజని బాహుబలం 2, నత్రజని (నైట్రోజన్) బాహుబలం 3, కర్బనం బాహుబలం 4, సిలికాన్ బాహుబలం 4, అలా, అలా ప్రతి మూలకానికి ఒక నిర్దిష్టమైన బాహుబలం ఉంటుంది.
నేను రాసిన రసగంధాయ రసాయనం (లేదా, నిత్య జీవితంలో రసాయన శాస్త్రం, కినిగె ప్రచురణ) అనే పుస్తకంలో ఈ బాహుబలానే్న కుదించి బాలం అని వాడేను. బాలం అనే మాట వాలంలా ఉంది కనుక తోక గుర్తుకి వస్తుంది కదా. రసాయన శాస్త్రంలో బాహుబలాన్ని (లేదా బాలాన్ని) సూచించటానికి ఆ మూలకం యొక్క సంక్షిప్త నామం రాసి దాని పక్క ఒకటో, రెండో, మూడో, నాలుగో గీతలు (తోకలు) గీస్తారు. ఉదాహరణకి ఉదజని అని చెప్పవలసి వచ్చినపుడు ‘ఎచ్’ అనీ, ఆమ్లజని కావలసి వచ్చినప్పుడు ‘ఒ’ అనీ రాస్తారు. అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారం ఇక్కడ ఇంగ్లీషు వర్ణక్రమంలో ఉన్న అక్షరాలే వాడి తీరాలి. నాకు తెలుగు మీద ఎంత అభిమానం ఉన్నప్పటికీ అంతర్జాతీయంగా ఎన్నడో జరిగిపోయిన ఒప్పందాలని ఉల్లంఘించటం సాధు సమ్మతం కాదు.

- వేమూరి వేంకటేశ్వరరావు ప్లెజన్‌టన్, కేలిఫోర్నియా