AADIVAVRAM - Others

ఓ సాయంకాలం ఛంద్రుడి కోసం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

యువ పరువం పరుగులు తీసింది
ప్రణయం ఉరకలు వేసింది
పూల పరిమళాల గులాబీల గుబాళింపు సాక్షిగా
వెచ్చని ఊహల నెచ్చెలి ఊహ మది ప్రోత్సహించగా
ఆ కోమలి నయనాల కమ్మకమ్మని కథనాల
ఎద లోయల హసనాల ప్రణయానికి (ప్ర)హసనాల
పొద్దు పొడుపులో ఎంకి కొప్పులో
ఎంకి కొప్పులో ఒదిగిన ముద్దబంతిలా
నా కన్నుల జాడల ఆ పున్నమి నీడల
ప్రణయిని రాధికలా విరహిణి నాగినిలా
తళుకులీను తారకలా నా కథా కావ్య నాయికలా
కుహుకుహు కోయిలమ్మ రస గీతికలా
కన్నియ పరువం పారే ఏరై
ఆమె తీరే వేరై నన్నల్లేసింది
మురిపాల పెనవేసింది
పందిరికెగ పాకేసింది. *

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505