Others
కొత్తదనం
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Monday, 15 July 2019
- తిరునగరి శరత్చంద్ర, 6309873682
నాకు నేను
కొత్తగా కనబడుతున్నాను
ఒక కొత్త కవిత రాసుకున్న వేళ
మంచి మనిషితో
మనసు విప్పి తనివితీరా మాట్లాడిన వేళ
కలల సముద్రం దగ్గర నిలబడి
నా ఆలోచనలన్నీ కవితలుగా అల్లుకుని
ఆశయాల తీరమై నిలబడిన వేళ
నాకు నేను కొత్తగా కనబడుతున్నాను
ఎంతో ఉల్లాసంతో హాయగా
ముందుకు సాగిపోతున్నాను
మమతల చెట్టును వాడిపోనీయకుండా
ప్రతి మనిషి కాసిన్ని నీళ్లు పోస్తుంటే
చూసి పులకించిన ప్రతి క్షణం
నేనే కొత్తదనమై కనబడుతున్నాను
మెత్తని మనసుల్లో కురిసిన
సుతిమెత్తని భావాల జల్లులో
తడిసి కొంగ్రొత్తగా నిలబడుతున్నాను
అద్దం ముందు నిలబడి
నా సరికొత్త రూపాన్ని చూసుకుంటున్నాను
బద్దలైపోయన
ప్రతి దృశ్యంలో
సరికొత్త అంతరంగాన్ని
ఆవిష్కరించుకుంటున్నాను