Others

నాలుగు బాలనాగమ్మలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒకే కథవున్న సాంఘికాలు మళ్లీమళ్లీ చిత్రాలు (బ్రతుకుతెరువు, భార్యబిడ్డలు)గా రావడం అరుదు. కాని, పురాణకథలు, జనపదాలూ మళ్లీమళ్లీ వచ్చిన ఉదాహరణలు చాలా కనిపిస్తాయి. గొల్లభామ, మంగమ్మ శపథం, అపూర్వ సహోదరులు వంటి కొన్ని కథలు పునర్జన్మ ఎత్తాయి. అయతే జానపద కథల్లో అగ్ర తాంబూలం బాలనాగమ్మది. మొదటిసారిగా జెమినీ సంస్థ బాలనాగమ్మ (1942)తీసిన ఏడాదిలోనే ఇంకో బాలనాగమ్మ, శాంత బాలనాగమ్మ పేరిట వచ్చింది. జెమినీ వారి బాలనాగమ్మ విజయపతాక ఎగరేస్తే, రెండో బాలనాగమ్మ చతికిలపడింది.
మళ్లీ బాలనాగమ్మ కథ అదే పేరుతో 1959లో వచ్చింది. ఇందులో ఎన్టీఆర్, అంజలీదేవి, యస్వీఆర్ మొదలైన తారాగణం. కాని ఇదీ అంత విజయం సాధించలేదు. 1996లో ఇంకో బాలనాగమ్మ వచ్చింది. ఇది 1980లోనే ఆరంభమైనా మధ్యలో ఆగిపోయింది. ఆ రెండూ బ్లాక్ అండ్ వైట్ అయతే, ఇది కలర్ సినిమా. అతికష్టంమీద ఒకటిరెండు చోట్ల మాత్రం ఈ సినిమా విడుదలచేశారు. ఎవరికీ అంతగా తెలీదు. మొత్తానికి అనే్నళ్ల నిరీక్షణ శ్రమా వృధా అయిపోయాయి. ఇవి ఇలా వుండగా తమిళంలో ఇదే పేరుతో వచ్చిన బాలనాగమ్మ 1982లో విడుదలైంది. బాలనాగమ్మ పాత్రను కాంచనమాల, మిస్ చెలం (1942), అంజలిదేవి (1959), జమున (1996), శ్రీదేవి (1982) ధరించారు. హీరోకంటే ముఖ్యమైన మాయలమరాఠీ పాత్రను డాక్టరు గోవిందరాజుల సుబ్బారావు, మంజులూరి కృష్ణారావు, యస్‌వి రంగారావు, సత్యనారాయణ ధరించగా డబ్బింగ్ సినిమాలో సుదర్శన్ ధరించారు. ఏదైమైనా తలమానికం జెమినీవారి బాలనాగమ్మ.

-కె శ్రీనివాసరావు