Others

భలే భలే బ్లౌజ్‌లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చీరలపైకి మ్యాచింగ్ జాకెట్లను కుట్టించుకోవడం పాత ట్రెండ్.. చీరలకు తగిన డిజైనర్ జాకెట్లను వేసుకోవడం నేటి ట్రెండ్. డిజైనర్ చీరల హవా పెరిగిన తరువాత జాకెట్లుకూడా వాటి దారిని మార్చుకున్నాయి. కొత్త కొత్త రంగుల్లో, కొత్త కొత్త డిజైన్లతో డిజైనర్ చీరల తలదనే్నలా తయారవుతున్నాయి. రోజుకో కొత్త డిజైన్‌తో ముస్తాబై మార్కెట్లోకి వస్తున్నాయి. ఇప్పుడైతే ఏకంగా పమిటలపైకే ఎక్కేసాయి. వీటినే నేడు ‘బ్లౌజ్ ఓవర్ శారీ’ పేరుతో పిలుస్తున్నారు. నేటి ట్రెండ్ ఇదే మరి.. నేటి అమ్మాయిలు చీరకంటే జాకెట్ డామినేటింగ్ ఉండాలని, నలుగురిలో ప్రత్యేకంగా ఉండాలనే ప్రయత్నం చేస్తున్నారు. అందుకే సింపుల్‌గా కనిపించేలా సాదా చీరను కొన్నా సరే జాకెట్‌ను మాత్రం చాలా హెవీగా తయారుచేసుకుంటున్నారు. చీరను అనుసరించి ఎంబ్రాయిడరీ, అద్దాలను ఉపయోగించి మగ్గం వర్క్, జర్దోసి వర్క్ అంటే ఎన్నో రకాలుగా రవికలు తయారవుతున్నాయి. అలాగే జాకెట్ కుట్టుతీరు కూడా కొత్తగా ఉండాలని, కోల్డ్ షోల్డర్స్, ప్రిన్స్ కట్, క్రాప్‌టాప్ కట్, బ్యాక్ త్రెడ్స్ ఓన్లీ.. వంటి రకాలను ఎన్నింటినో ఎంచుకుంటున్నారు. అంతేకాదు కేవలం ఒక చీరకు మాత్రమే నప్పేలా జాకెట్ కుట్టించుకోవడం లేదు. ఒకే జాకెట్ ఐదారు చీరలకు నప్పేలా కుట్టించుకుంటున్నారు. మునుపు ఎన్ని రకాల మోడల్స్‌ని ఎంచుకున్నా ఆ జాకెట్లన్నీ పమిట చాటునే ఒదిగిపోయేవి. కానీ నేటి అమ్మాయిలు జాకెట్‌పై పమిటకాదు.. పమిట మీద జాకెట్ ఉంటే ఎలా ఉంటుంది అని ఆలోచించారో ఏమో చీరపైకి జాకెట్టును ఎక్కించేస్తున్నారు. ఈ చిత్రమైన ఆలోచన ఏ డిజైనర్‌కు వచ్చిందో కానీ భలే భలే బ్లౌజులను తయారుచేశారు. నేటి అమ్మాయిలందరికీ ఈ బ్లౌజ్ ఓవర్ శారీ మోడల్స్ తెగ నచ్చేశాయి. ఈ రకం రవికలను వెనక హుక్కులతో కుట్టించుకుంటున్నారు. అయితే వీటిపై కోటులాగానో, పమిటను జాకెట్‌లోంచి బయటకు తెప్పించేందుకు ప్రత్యేక డిజైన్ వచ్చేలాగానో జాకెట్‌ను డిజైన్ చేశారు. అంటే ఈ జాకెట్‌ను వేసుకున్న తర్వాత, దానిపై పమిటను వేసి పిన్ పెట్టేశాక, ఈ మోడల్ కోసం ప్రత్యేకంగా కుట్టిన భాగం ఆ పమిట పై నుంచి ఒక డిజైన్‌లా కనిపిస్తుందన్నమాట. ఇందులోనే మెడ దగ్గర ఉండే లేసు మధ్య నుంచి పమిట వెళ్లినట్లు ఉండే వాటితో పాటు, ఒక వైపు చేతి దగ్గర నుంచి చిన్న కోటు తరహాలో వచ్చే ముక్కను మరో చేయి కిందివైపు ముడివేసి కట్టే సైడ్ నాట్ మోడళ్లు ఎక్కువయ్యాయి. అలాగే జాకెట్‌కూ దానిపై వేసుకున్న కోటుకీ మధ్యలో నుంచి పమిట వెళ్లినట్లు కనిపించేలా చేసే జాకెట్ స్టైల్ రకాలు కూడా బాగుంటాయి. వీటిలోనే రకరకాలు మోడళ్లు వస్తున్నాయి. చీరరంగుని, డిజైన్‌ను బట్టి ఏ తరహా, ఎలాంటి మోడల్ నప్పుతుందో చూసుకుని కుట్టించుకోవడమే.. ఇప్పుడు ఈ రకం జాకెట్లతో చీరకట్టు కొత్త లుక్కుతో అమ్మాయిలు హొయలుపోతున్నారు.
*