Others

ప్రధాని ప్రశంస

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వెనకబడిన వర్గం నుంచి వచ్చిన గుజరాతీ జానపద గాయని గీతా రబారీ కృషిని మోదీ ప్రశంసించారు. స్వయంకృషితో ఎదిగిన ఆమె నేటి యువతకు స్ఫూర్తిదాయకమని, గుజరాతీ జానపదాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి ఆమె ఎంతో కృషి చేస్తున్నారని కొనియాడారు. ఆమె పాడిన ఓ పాటను కూడా మోదీ ట్విట్టర్‌లో పంచుకున్నారు. సోమవారం ఆమె మోదీని పార్లమెంటు ఆవరణలో కలిసిన విషయం అందరికీ తెలిసిందే.. ప్రధానిని కలిసిన అనంతరం గీతారబారీ తన అనుభవాల్ని పంచుకుంది. ‘మేము అడవుల్లో నివసించే మల్ధారీ తెగకు చెందిన వారం. చిన్నతనంలో ఉన్నప్పుడే నేను మోదీని కలిశాను. పాట పాడినందుకుగానూ అప్పట్లో ఆయన రూ. 250 బహుమతిగా ఇచ్చారు. అప్పుడే నాకు గాయకురాలిగా మంచి భవిష్యత్తు ఉందని, సాధన కొనసాగించమని అప్పట్లో మోదీ చెప్పారు’ అని గతాన్ని గుర్తుచేసుకుంది గీత. ఈ సందర్భంగా ఆమె ఓ పాట పాడి ప్రధానికి అంకితమిచ్చింది.