Others

వ్యాయామం ఎప్పుడు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొద్దుపొద్దునే్న చాలా హడావుడి. పిల్లలకు క్యారేజీలు కట్టాలి.. వారిని స్కూలుకు పంపాలి. భర్తకు కూడా క్యారేజీలు సర్ది, మనమూ క్యారేజీలు కట్టుకుని ఆఫీసులకు బయల్దేరాలి. ఇంత హడావుడిలో వ్యాయామం సాధ్యమేనా? కుదరనుకాక కుదరదు.. అందుకని వ్యాయామం సాయంత్రం చేయడమే మేలని కొందరనుకుంటారు. మరికొందరేమో సాయంత్రమయ్యే సరికి రోజువారీ పనుల్లో బాగా అలసిపోయి ఉంటాం. అప్పుడిక ఓపిక ఎక్కడుంటుంది? అందుకే పొద్దునే్న వ్యాయామం చేయడం మంచిది అనుకుంటారు మరికొందరు. ఇలా ఏ సమయం సౌకర్యవంతమో మనం ఆలోచిస్తాం. సౌకర్యం మాట సరే.. వ్యాయామం ఏ వేళ చేస్తే ఎక్కువ ప్రయోజనం అనేది అసలు మీమాంస. మిగతా అందరి మాట ఎలా ఉన్నా, శాస్తవ్రేత్తలు ఈ విషయంలో ఇటీవల కాస్త భిన్నమైన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏ వేళ వ్యాయామం చేస్తే బెటర్ అని కాకుండా రెండే వేర్వేరు వేళల్లో చేసే వ్యాయామ ఫలితాలు వేరువేరుగా ఉంటున్నాయని మాత్రం వారు చెబుతున్నారు.
* ఉదయం వ్యాయామాలు షుగర్, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలను తేజోవంతం చేస్తాయి. దీనివల్ల అధిక బరువు, టైప్-2 మధుమేహం తగ్గుముఖం పడతాయి.
* ఉదయం చేసే వ్యాయామాలు జన్యు ప్రణాళికను చైతన్యపరుస్తాయనీ, అదే సమయంలో కండర కణాల సామర్థ్యాన్ని కూడా పెంచుతాయని శాస్తవ్రేత్తలు పేర్కొన్నారు.
* ముఖ్యంగా ఉదయం వ్యాయామాలు షుగర్, ఫ్యాట్‌లకు సంబంధించిన జీవక్రియలకు తేజోవంతం చేస్తాయని కనుగొన్నారు. దీనివల్ల అధిక బరువు, టైప్-2 మధుమేహం తగ్గుముఖం పడతాయని కూడా వారు చెబుతున్నారు. ఉదయం చేసే వ్యాయామాల వల్ల ఎంతోకాలంగా వేధిస్తున్న జీవక్రియలకు సంబంధించిన కొన్ని రకాల జబ్బులు కూడా నయమవుతాయని కూడా శాస్తవ్రేత్తలు వివరించారు.
* సాయంత్రం చేసే వ్యాయామాల వల్ల ఆ తర్వాత చేసే విధుల్లో ఎక్కువ శక్తినీ, అంటే ఎక్కువ శ్రమించి కేలరీలను బాగా ఖర్చుచేసే సత్తా పెరుగుతుందని కూడా శాస్తవ్రేత్తలు చెబుతున్నారు.
వీటన్నింటిని సమీక్షించుకుని, మీకు తగిన సమయాన్ని కూడా చూసుకుని, మొత్తానికి ఏ వేళ వ్యాయామాలు తమకు అనుకూలమో, ఏ ప్రయోజనాలు తమకు ముఖ్యమో తెలుసుకుని ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే.. ఏదిఏమైనా దినచర్యలో వ్యాయామాన్ని చేర్చుకోవడం మాత్రం తప్పనిసరి.