Others

ముత్యాలముగ్గు (నాకు నచ్చిన పాట )

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముత్యాలముగ్గు. బాపు-రమణల రూపకల్పనలో కథా కథన సంవిధానం వినూత్నపంథాలో నడిచింది. కథకి సంభాషణలు, సన్నివేశాలు ఒకతీరైతే, ఇందలి పాత్రలు ఇంకొక తీరై మొదట్లో సామాన్య ప్రేక్షకుడి నాడికి అందలేదు. ఆ తర్వాత మక్కువ ఏర్పడి బాపు-రమణల కృషిని ఇనుమడింప చేశారు. శతాధిక చిత్రాలవైపు దూసుకెళ్లి, ఆర్థికంగా నిర్మాతలను అబ్బురపర్చింది.
కథాంశానికి వస్తే రామాయణానికి రావణాబ్రహ్మ ప్రతినాయకుడైతే, ఈ చిత్రానికి నాయకుడు, ప్రతి నాయకుడు రావు గోపాలరావు. కాంట్రాక్టర్ పాత్రలో తనదైన ముద్రవేశాడు. ఈ చిత్రంతో మడమ తిప్పని మహానటుడై.. ఆయన ఆడింది మాట, చేసింది పాత్ర అయ్యింది తెలుగు సినీ పరిశ్రమలో. ఇక సూర్యకాంతం పాత్ర బహు సాత్వికం (అప్పటి వరకూ ఆమె చేసిన పాత్రలకు విరుద్ధం). శ్రీ్ధర్, సంగీత కథానాయకా నాయికలు. అల్లు రామలింగయ్య పాత్రకి ఆనాటి కథానాయకుడులో పాత్ర తరువాత అంత బ్రేకువచ్చింది. నూతన్‌ప్రసాద్ అంటే తెలిసొచ్చింది తెలుగు ప్రజలకి. తర్వాత ఆయన కూడా మడమతిప్పని రీతిలో ఎదిగిపోయారు. కథాంశానికి వెళ్తే...
విలన్ రావుగోపాలరావు. ఆ పాత్ర చుట్టూరా అల్లురామలింగయ్య, నర్తకి, కాంతారావు, ముక్కామల, కాకరాల తదితర అతిరథ మహారథులు తారా పల్లకినలంకరించారు. విలన్ మేనరిజం -ఎదురు తిరిగితే డిక్కీలో తొంగోపెట్టడం, డబ్బు సంపాదించడం. అలా విడదీయబడిన జంట శ్రీ్ధర్, సంగీతలు- చివరాకరికి విలన్ ఆడిన డ్రామానే రివర్స్‌చేసి అతనికి కనువిప్పు కలిగించి కథను సుఖాంతం చేయడంలో బాపూ రమణలు కృతకృత్యులై నిర్మాతలకి, బ్యానర్‌కి ప్రశంసలు, పైకం కురిపించారు. జనాన్ని మురిపించారు. ఈ చిత్రానికి పాటలు, మాటలు మంచిగా నప్పాయి. జన బాహుళ్యపు హృదయాంతరాలకు చొచ్చుకుపోయాయి. కొన్ని పాటల్ని గుర్తు చేసుకుంటే, -ముత్యమంత పసుపు ముఖమెంతో ఛాయ/ గోగులు పూచే గోగులు పూచె/ నిదురించే తోటలోకి../ శ్రీరామ నీ నామం బహుతీపి/ ఏదో ఏదో అన్నది/ ఎంతటి రసికుడవో/ శ్రీరామ జయరామ. గీత రచయితలు సి నారాయణరెడ్డి, ఆరుద్ర మరియు సినిమా రచనలో నూతనంగా కురిసిన కలం గుంటూరు శేషేంద్రశర్మ. గానం మంగళంపల్లి బాలమురళీకృష్ణ, ఎస్‌పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీలమ్మ, రామకృష్ణ. కెవి మహదేవన్ సంగీత సారథ్యంలో పాటల్ని ప్రేక్షక రసహృదయాలకు చేరువచేశారు. బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ కింద జాతీయ అవార్డు, సినిమాటోగ్రఫీకి మరో అవార్డు లభించింది. చిత్రానికి నిర్మాణ బాధ్యతలు చేపట్టి ఇంతటి కృషికి, ప్రశంసలకి ఆద్యుడు నిర్మాత మద్దాలి వెంకట లక్ష్మీనరసింహారావు మూలస్థానంలో ఉన్నారు. అందరికీ ఇష్టమయ్యే చిత్రం -ముత్యాలముగ్గు.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505