Others

బుజ్జిబుజ్జి పాపాయి (నాకు నచ్చిన సినిమా)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘బుజ్జి బుజ్జి పాపాయి/ బుల్లిబుల్లి పాపాయి/ నీ బోసి నవ్వులలో పూచే పున్నమి వెనె్నలలోయి...’ అనే పల్లవితో ప్రారంభమై ప్రేక్షకులందరి ఎదలను ఊయలలూగించింది -ఆడబ్రతుకు చిత్రంలోని ఓ పాట. ఈ గీత రచన ఆచార్య ఆత్రేయ. స్వర కూర్పు -సంగీత యశస్వి ఎంఎస్ విశ్వనాథన్. వేదాంతం రాఘవయ్య దర్శక సారథ్యంలో జెమిని సంస్థ నిర్మించింది ఆడబ్రతుకు చిత్రాన్ని.
చరణాల్లోకి వెళ్తే...
‘పాలుగారు ప్రాయంలో నీలాగే ఉన్నాను/ బంగారు ఊయలలో పవళించి ఊగాను/ ఆనాటి అచ్చటలే ఈనాటి ముచ్చటలై/ మనసే మురిసెనురా... మమతే పెరిగెనురా’ అంటాడు రచయిత. -బాల్యంలోని వైభవాన్ని, అరమరికలులేని సుఖ సంతోషాలని, కల్లకపటమెరుగని పసివయసుని, నిర్మలత్వాన్ని విశే్లషిస్తూ చేసిన రచన అందర్నీ ఆకట్టుకుంటుంది.
ఒక హృదయం పొంగితే ఉరికేది కవితరా/ ఇరు హృదయాలొకటైతే పాడేది లాలిరా/ ఏ తల్లికన్నదో... ఏ బంధమున్నదో/ మనసే మురిసెనురా.. మమతే పెరిగెనురా.. అంటాడు రెండో చరణంలో. పిల్లాడికి, తనకీవున్న తండ్రి కొడుకుల అనుబంధాన్ని చెప్పకనే చెప్పాలన్న భావన ఆ తాదాత్మ్యంలో కలిగిస్తోంది -రక్తస్పర్శతో అచేతనంగా ఆ భగ్న హృదయానికి.
పూవంటి మనసులో ముల్లున్న జగతిరా/ మోసాలు, ద్వేషాలు ముసిరే బ్రతుకురా/ నమ్ముకున్న నావారు నాకిదే నేర్పారు -అంటూ ముక్తాయింపుగా తన భగ్న దాంపత్యాన్ని, అపార్థాల కాపురాన్ని గుర్తు చేసుకుంటాడు హీరో. ఈ గీతం భావగర్భితమైన సన్నివేశానికి రాసిందని వేరుగా చెప్పనక్కరలేదు. కాని పాటవల్ల సన్నివేశం రక్తికట్టించడంలో తెరవెనుక సాంకేతికంగా చేసిన పరిశ్రమకు ఎన్టీఆర్ అభినయం తోడై తెరమీద స్థిరంగా, చిరంతరంగా ఆవిష్కృతమైంది. తండ్రి సొంత పాపని అక్కున చేర్చుకున్నప్పుడు తల్లి కళ్లలో ఆనందాన్ని... గతాన్ని నెమరేసుకున్నపుడు విడివడిన భర్త మనస్తాపాన్ని దేవిక, తల్లి టిఎన్ రాజమ్మ హావభావ ప్రకటనలు సన్నివేశానికి మరింత బలాన్నిచ్చాయి.

-ఆచార్య క్రిష్ణోదయ 74168 88505