AADIVAVRAM - Others

అతనో అద్భుతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎవరికి తెలియని జీవిత మర్మాలని అలవోకగా
సంగీకరించగలడు

ఎనే్నళ్ల తపస్సో
వనవికాసం గల ప్రకృతిలో
కలిసిపోయి
వేణుగానంతో బాధలను
దూరంగా తరిమేసి
తన ఊపిరితో
ప్రాణం పోస్తున్నాడు
పుట్టుగుడ్డి కావొచ్చు గానీ
అతని మనస్సు నిండా వేల చక్షువుల
కిలకిలరావాలే

వెండి తెరపై వెలిగి
చెవుల్లో మారుమ్రోగిన ఎన్నో
ఆణిముత్యాల్ని
వెదురు సందుల గుండా
వెదజల్లుతాడు.

అందమైన రాగాల్ని
అలవోకగా వినిపించే ఆ ముసలి చేతులలు
ఆకలి పేగుల కేకల్ని కప్పేయడం
విషాద నిషాదమే కదూ...

లక్షలు తగలేసి ఆనందాల్ని
కొనుక్కుంటున్న ఖరీదులకి అతని
బతుకు తెల్లటి మబ్బుపై
నల్లటి మరకనే

బుక్కెడు బువ్వ కోసమే
గాలిని వేణువుగా మలిచి
వాయులీనమై పోయిన అతని కళ
అజరామరమే

ఆకలి నదుల్ని తనలో కలుపుకొని
సంగీత సంద్రమై ఉవ్వెత్తున ఎగసిపడే
అతను నడిచే అద్భుతమే
ఇది నిజంగా మారిన అబద్ధపు కథ..!! *

-పుష్యమీ సాగర్ 9010350317