AADIVAVRAM - Others

తొలకరి పలకరింత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొలకరి పలకరింత
పుడమి తల్లి పులకింత
రైతన్న తనువంత
మట్టివాసనల జలదరింత

చినుకు చినుకై రాలి
పుడమి తనువు తడిపి
దివి నుండి భువికేగిన
ఓ చినుకమ్మా నీకు వందనం
చుక్కగా రాలి మొక్కకు ఆయువు పోసి
ఎండిన కొమ్మలకు ఆకుపచ్చ రంగేసి
చక్కని నీ జలధారతో
నదీనదాలు నింపే జీవధారపు నువ్వు

తొలి చినుకుకు
మా ప్రాణం లేచివస్తుంది
మలి చినుకు కోసం ఎదురుచూడడం మొదలవుతుంది
అదే ధారగా కురుస్తుంటే ఇక చాలు ఈ జీవితం అన్పిస్తుంది

నోళ్లు తెరుచుకున్న
పచ్చిక బయళ్లవుతాయి
చేలన్నీ రైతన్నా నా దగ్గరికి రా
అంటూ స్వాగతాలు పలుకుతాయి

ఆ పిలుపునకు రైతన్నకు
తన తల్లే ఆకలి తీర్చడానికి పిలుస్తోందన్నంత సంతోషం
జోడెడ్లతో, కర్రునాగలితో
నెత్తిన రుమాలు, చేతిలో ముళ్లుకర్రతో కదులుతాడు
చెర్వుగట్టున ఎడ్లబండి
పొలం గట్టున సద్దిమూట
పారుతున్న కాల్వకు కట్టేసి
సాలిరువాలు దుక్కిదున్ని
ఇల్లాలు విత్తనాలు అందియ్యంగ
రైతన్న మడిలో అవి జల్లంగ
చల్లిన నాల్గు గింజలు సన్నగా మొలకెత్తంగ
కాల్వ కట్ట గండి తీసి నీరు పారియ్యంగ
పక్షానికే పతీసతులిద్దరు
చేనంతా కలియదిరిగి కలుపంతా దీసేసి
బలంమందు కొట్టంగ
చల్లని పైరగాలికి పైరు హొయలొలుకంగ
పొట్టవిప్పి కంకులన్ని పకపకమని నవ్వంగ

ఆలుమగలిద్దరు కొడవళ్లు చేతబట్టి
పిరికెడు పిరికెడు కంకులు కుప్పలు కుప్పలు కోసి
మోపెడు కట్టను కట్టి వడ్లన్నీ రాలగొట్టి
కుప్పలోని వడ్లన్నీ గాలికి తూర్పారబట్టి
పొలిజేసి, బలి యిచ్చి కొబ్బరికాయలు గొట్టి
కల్లంల వడ్లన్నీ బస్తాల్లో నింపేసి
నింపేసిన వడ్లన్నీ అడ్తీకి పంపించి
వచ్చిన పైసలతోనే ఏడాదంతా బ్రతుకు.

-శ్రీనివాస్ పర్వతాల 9014916532