Others

అసహనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిమిరానికి అసహనం
ఉషస్సును చూస్తే
గాఢాంధకారానికి
వెలుగు రుచి చూపిస్తుందని
అంధకారాన్ని తరిమేస్తుందని

నిజాయతీకి అసహనం
అబద్ధాన్ని చూస్తే
తన నిజాయతీకి
కళంకం తీసుకొస్తుందని

మతవ్ఢ్యౌనికి అసహనం
లౌకికతత్వాన్ని చూసి
ఎక్కడ తన అభిమతం
మార్చేస్తుందోనని

కాగితానికి అసహనం
కలాన్ని చూస్తే
తన ఖాయాన్కి ఎన్నో
గాయాలు, వ్యధలతో
బాధిస్తుందని
కోపానికి అసహనం
నవ్వును చూస్తే
సర్వకాలాల, సర్వావస్థలందు
ఎలా నవ్వగలుతున్నావని

అసూయకి అసహనం
తనకంటె చెడ్డవాళ్ళు
ఈ ధరణి మీదే
లేరంటున్నారని

దుర్గంధానికి అసహనం
సుగంధాన్ని చూసి
తన స్వభావానికి విరుద్ధంగా
దాని పరిమళాన్ని పంచేస్తుందని..

అసహనమా
నీకెందుకే ఇంత అసహనం
సహనం అలవర్చుకుని చూడు
నీ బ్రతుకు ఎలా మారుతుందో

- వెలగా శేఖర్, 7981376195