AADIVAVRAM - Others
ఇన్లాండ్ లెటర్
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
Published Saturday, 29 June 2019
-మడిపల్లి హరిహరనాథ్ 9603577655
జ్ఞా పకాల దొంతరలుగా
మనస్సును
పేపరు మడతలలో
పొదిగిన అక్షరాలుగా
భద్రపరచి..
కళ్లలో
వత్తులేసుకొని
ఇంటి గుమ్మము ముందు
భారమైన
ఎదురుచూపులు
పోస్ట్‌మ్యాన్
నగుమోము
సైకిల్ గంట
శ్రావ్యమైన
అనువర్తనంగా
గడపను తాకిన
ఉత్తరము
ధ్వని వేగంతో
పోటీ పడుతూ
ఎద తలుపును
తెరిచింది
ఉభయ కుశలోపరిగా
ప్రేమానురాగాలు
ఆత్మీయతలు
కలబోసుకున్న
బాంధవ్యాలుగా
మేఘసందేశమై
అందమైన చేవ్రాలు
పలుకరింపులు
మనస్సును హత్తుకొని
కంట ముత్యాలుగా
రాలాయి...
సాంకేతిక విప్లవములో
కాలం కరిగిపోయి
ఉత్తరం కనుమరుగైనా
అడపాదడపా
ఇప్పటికినీ
చెదిరిపోని జ్ఞాపకంగా
గడపలపై
చిరునవ్వులు
ఒలకబోస్తూ
అలంకారంగా!