Others

ఆయుధం.. ధర్మం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరణ్యవాసంలో శ్రీరాముడు, సీతా లక్ష్మణ సమేతుడై చిత్రకూట పర్వతంపై పర్ణశాల లో నివసిస్తున్నారు. ఓరోజు నీలమేఘ శ్యాముడైన శ్రీరామచంద్రుడు, లక్ష్మణస్వామి రోజూ లాగే ఆ రోజు కూడా తినడానికి అవసరమైన కందమూ లాలు, అడవిలో దొరికే పండ్లు ఫలాలు కోసం బయలుదేరారు. వారికి అలవాటు ప్రకారమే సీతమ్మ రామభద్రునికి, లక్ష్మణునికీ వారి ధనుర్బాణాలు అందించింది. కాని ఆ తల్లి మోములో కనిపించకుండా దాచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న నవ్వు శ్రీరాముడి కళ్లకు కనిపించింది. దేవీ గారు ఎందుకో నవ్వుతున్నారు. ఇపుడు నవ్వు తెప్పించే సంఘటన ఏమి ఉందా అని ఆలోచించసాగాడు శ్రీరాముడు రాముని దీర్ఘాలో చన చూసి సీతమ్మ కిసుక్కున నవ్వింది ‘‘దేవీ! నీ నవ్వు నీకు అలంకారంగా ఉంది. కాని విషయమేమిటి? ఆ నవ్వుకు కారణమేమిటి? అన్నాడు రాముడు. అడిగిన మాటను దాట వేయకుసుమా ఇపుడు నవ్వు ఎందుకు వచ్చిందో తెలుసుకోవాలన్ని ఆసక్తి నాకే కాదు నా తమ్మునిలోను అంకురించింది అన్నాడు రాముడు.
‘‘ప్రభూ! మరేం లేదు. మీరు అరణ్య వాసానికి వచ్చారు కదా! ఎవరితోనో యుద్ధానికి వెళ్లుతున్నట్టు ఈ భుజాలపై విల్లంబులూ అమ్ముల పొదలు మోయడం ఎందుకు అని పించి నవ్వొచ్చిందంతే! అంది సీతమ్మ.
‘‘అదేమి మనకు స్వీయ రక్షణ అవసరమేగా సీతా!’’ అన్నాడు రామయ్య.
నిజమే కానీ మిమ్ములను చూస్తుంటే నాకు ఓ కథ గుర్తుకు వచ్చింది అంది సీతమ్మ. ఆ కథమేటిటో మాకు చెప్పు. ఆ తరువాత నే మేము మా పనికి వెళ్తాం అన్నారిద్దరూ అన్నదమ్ములు. అప్పుడు సీత వారికి ఓ కథ చెప్పింది.
ఒకానొక కాలంలో ఒక ఋషి ఏకాంత ప్రదేశంలో తీవ్రమైన తపస్సు చేసుకొం టున్నాడు. ఆ తపోదీక్ష చాలా కఠినంగా సాగుతోంది. ఆ తపస్సుకు ఇంద్రుడు భయ పడ్డాడు. ఆయన తపోదీక్ష ఎంత ధృడమైనదో చూడాలనుకొన్నాడు.
దేవేంద్రుడు ఒక బ్రాహ్మణ రూపం దాల్చాడు. పదునైన తళతళలాడే ఒక పొడవైన కరావాలాన్ని పట్టుకున్నాడు. ఆ ఋషి తపస్సు చేసుకుంటున్న తపోవాటికను వెళ్లాడు. ఆ ముని ఎపుడెప్పుడు కళ్లు తెరుస్తాడా అని చూశాడు ఇంద్రుడు. కాల మహిమ వల్ల ఆ ఋషి సంధ్యావందన నిమిత్తం కళ్లు తెరిచాడు.
వెంటనే ఇంద్రుడు ‘‘ ఋషీశ్వరా! రక్ష రక్ష’’ అంటూ నన్ను కాపాడండి. నాకు మీరే దిక్కు అన్నాడు. ఆ ఋషి ప్రశాంత వదనంతో నీకొచ్చిన కష్టమేమిటి అని అడిగాడు. ఆలసించక చెప్పు. నీ ఇబ్బంది తప్పక తీర్చే ప్రయత్నం చేస్తాను’’ అని అభయమిచ్చాడు.
‘‘మరేంలేదు స్వామీ! నేను కార్యార్ధినై దూర ప్రాంతంవెళ్లాల్సి వచ్చింది. నా ఈ కరవాలం నా పయనానికి పెద్ద సమస్యగా వుంది. దీన్ని జాగ్రత్త పరచడానికి ఎవ్వరూ లేరు.. ఇది నాకు నా తాతముత్తాతల నుంచి వచ్చిన సొమ్ము ఇది. అందుకే ఇంతగా ఆలోచిస్తున్నాను. దీన్ని ఎక్కడైనా వదిలి వెళ్లితే ఎవరైనా తీసుకొంటే ఎలా అని ఆలోచించి ఆలోచించి మీ దగ్గరరకు వచ్చాను అని అన్నాడు.
కానీ నేను దీనికోసం ఏమి చేయగలను? అన్నాడు అమాయకుడు తాపసి.‘‘ ఏం లేదు మునీంద్ర మీరు శ్రమ అనుకోకుండా ఎట్లాగు మీరిక్కడే ధ్యానం చేసుకొంటూ ఉంటారు కనుక నేను తిరిగి వచ్చేవరకు ఈ కరవాలానికి పదును తరగకుండా ప్రతినిత్యం తైలం అద్ది తుడిచి శుభ్రపరిచి ఒరలో ఉంచాలి.ఈ ఒక్క పని చేయండి మునీంద్రా!’’ అంటూ వినయంగా చేతులు జోడించి నమస్కరించాడు
‘‘అదెంత భాగ్యం? లోకోపకారమే కదా మా ధర్మం! తప్పక నీ కరవాలాన్ని మాఆశ్రమంలో వుంచి వెళ్ళిరా బ్రాహ్మణోత్తమా!’’ ఆవిప్రుడిని పంపాడు. ప్రతిరోజు స్వయంగా ఆ కరవాలాన్ని ఒరలోంచి తీసి తైలం అద్ది శుభ్రపరిచి మెత్తని వస్త్రంతో తుడిచి తిరిగి దాన్ని ఒరలో ఉంచడం తన పనిలో భాగం చేసుకొన్నాడు ఆ ఋషి.
కొంతకాలానికి తాను ఇచ్చిన మాట మేరకు దాన్ని చక్కగా శుద్ధి చేసానో లేదోనన్న భావన ఋషి మనసులో బయలుదేరింది. దాన్ని ఎలా తెలుసుకోవడం అని కేవలం పదునుగా ఉందా లేదా అని చూడడానికే పరీక్షించడం మొదలుపెట్టాడు.
అంతే ఆరోజుటి నుంచి మెల్లమెల్లగా అతడి తపస్సు, ధ్యానం దారి తప్పాయ. రోజంతా ఈ కరవాలానికి పదును పెట్టడం, అది సరిగా ఉందా లేదా చూసుకోవడం ఇట్లా మనస్సంతా ఆ కరవాలం మీదే!
ఇంకొంత కాలమయ్యాక ఆ కరవాలాన్ని చేత్తో పట్టుకుని నడిస్తే ఎలా ఉంటుంది అనుకొన్నాడు. తన చేతిలో పట్టుకుని నడవసాగాడు. అట్లా నడిచే రోజుల్లో ఒకదినం ఋషి కరవాలం తగిలి ఒక చిన్న మొక్క మధ్యకు తెగిపోయింది. ఆ ఋషి ‘‘ఆహా! కరవాలం తగలగానే మొక్క తెగి పోయిందంటే దానికి పదును చక్కగా ఉంది. మరి ఈ వృక్ష శాఖ తెగుతుందేమో చూద్దా’’మని అనుకొన్నాడు. వెంటనే ఓ వృక్ష శాఖను నరికాడు. ఒక్క వేటుతో అది తెగిపడింది. ఆ మునివరునికి ఎంతో ఆనందం కలిగింది. నేను ఇచ్చిన మాటను బాగా నిర్వర్తిస్తున్నాను అనుకొన్నాడు. అలా ఆ అడవిలోని మొక్కలు, వృక్ష శాఖలను నరకసాగాడు. రాను రాను ఎదురైన జంతువులను, అడవిలో కనిపించిన మానవులను సైతం నరికి నరహంతకునిగా మారిపోయాడు. అతని ధ్యానం, తపస్సు అన్నీ నశించి ఒక క్రూరునిగా తయారైనాడు.
చూశారా కేవలం ఒక్క కత్తి పట్టుకుని ఉంటేనే ఇంత అనర్థం జరిగింది కదా. మరి మీరు ధనుర్బాణాలను అమ్ముల పొదను ధరించి తిరుగుతుంటే మనం చేయాలనుకొన్న వనవాస దీక్షకు భంగం వాటిల్లుతుందేమో నని నాకు నవ్వు వచ్చింది అంది సీతమ్మ.
మనం వనవాసులుగా వనవాసం చేస్తాము కానీ ఎక్కడైనా అధర్మం జరిగితే , తాపసులకు, సాధువులకు అన్యాయం జరిగితే మాత్రం నేను వారిని ఈ ఆయుధసంపత్తితో నిలువరిస్తాను. అవసరమైతే వారిని సంహరిస్తాను కూడా అని సీతమ్మకు అసలు విషయం రాముడు విడమర్చి చెప్పాడనే ఐతిహ్యం ఒకటి వినిపిస్తుంటుంది. ధీని వ్లల ధర్మధారణ ఎంత ముఖ్యమో తెలుసుకోవాలి.

- సీతా రామారావు