Others

శ్రీకృష్ణ రమ్య రామాయణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తన ఆసనమిచ్చి తాను తలవంచుకు నిలిచెను
వటువు ఎదుట ఆకసమ్మె తలవంచుకు నిలిచెననగ.

‘‘ఏమియాజ్ఞ యోమహాత్మ? ఏమి సేయగలను?
భూదానమ? గోదానమ? స్వర్ణతులాభారమ?

ఏమి స్వీకరింతురయ్య? ఏమి కోరుకొందురొ?
పుడమినొక్క పుష్పమట్లు చేత నుంచమందురొ?’’

అనగా విని వటుడు నవ్వె- నవ్వెనంతరిక్షము
ఆ నవ్వుల కెరటాలను మునిగి తేలె విశ్వము

‘‘ఏమి చేసి కొందునోయి? బడుగును! నేబావడ!
విశ్వమేమి చేసికొందు? విశ్వవరిత నోరేడా?

మూడడుగుల వాని నేను- మూడడుగులె చాలిక
నా అడుగులె ప్రమాణమ్ము- నేనె కొలతు నేలిక!’’

అటుల దాత యాచకుడై అడిగికొనిన యంత
ధరిణికెంతొ సిగ్గాయెను ముఖము వంచెనంత.

ఆ మాటకు ప్రభువు మోము- ఆశ్చర్యార్థకము!
‘‘ఇల నేలెడు రాజుచేత- తిల యొక్కటి దానమొ?’’

‘‘చిన్నదొ! మిన్నదొ! యేదో- నాకది సర్వస్వము
ఇవ్వగలుగుదో లేదో, యోచించుకు తెలుపుము!’’
ఇంకావుంది...

- గన్ను కృష్ణమూర్తి, 9247227087