Others

నైషధమ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

(హంస దౌత్యం)
అట్లు ప్రవర్తించుచున్న వేనుని వద్దకు 34మరీచి (బ్రహ్మమానస పుత్రుడు) ప్రముఖులును ఋషులు వచ్చిరి... అధర్మములను చేయవద్దని, సనాతన ధర్మమును అతిక్రమించవద్దని, 3అత్రిమహర్షి తరువాత ప్రజాపతిగా అవతరించావని, ప్రజలను పాలించెదనని చెప్పి రాజువయ్యావని, అందువలన అధర్మవర్తుడవు కావద్దని వేనునికి హితబోధ చేశారు. మహర్షుల మాటలు విన్న వేనుడు.
34ధర్మమునకు నాకంటె కర్తయెవ్వడు? నేనెవ్వని మాటలు వినవలయును? శ్రుతమున (పాండిత్యమున) వీర్యమందు, తపస్సులో, సత్యములో నాతో సమానుడెవ్వడు? సర్వ భూతములయొక్కయు మొదలు తుదియు తెలియని మూర్ఖులు మీరు.! నిజముగ ననె్నవరెరుగరు. నేను తలచితినేని ఈ 3ఇలాతలము2నంతను దహించి వేయగలను. నీటివెల్లువల ముంచెత్తి వేయగలను. భూమ్యాకాశములదారులను బంధించగలను.22అని మూర్ఖుడై పలికెను.
మహర్షులందరూ వాడిని సరిచేయుట అసంభవమని క్రుద్ధలైరి. వేనుని చూచి 3హూంకరించగా2 వాడు ప్రాణాలను కోల్పోయెను. వేనుని తల్లిఅయిన సునీధ దుఃఖించి, కుమారుని శరీరంపై వ్యామోహంతో తన యోగశక్తితో ఆ శరీరం చెడిపోకుండా కాపాడింది.
రాజులేని రాజ్యం అరాచకమవుతుందని భావించిన మహర్షులు, అంగుని వంశం నిలబెట్టడానికై వచ్చి, సునీధ అనుమతితో వేనుని కళేబరంవద్దకు వెళ్ళారు. వేనుని యెడమతొడను మధించారు.
అప్పుడు వాని తొడనుండి మబ్బురంగు, కాకి రంగుగల ఒక పొట్టివాడు పుట్టాడు. మరుగుజ్జు అవయవాలు, కురచ చేతులు, కురచ పాదాలు, పొట్టికాళ్ళు, సొట్ట ముక్కు, ఎర్రని కండ్లు, రాగి రంగు వెంట్రుకలు, మీసాలు కలిగి అశుచియైన అతడి ముఖం నిస్సహాయ స్థితిని తెలిపింది. అతడు భయపడి, దోసిలి యొగ్గి నిలబడ్డాడు.
34నేనేమి చేసేది22అని దీనంగా అడిగాడు.
వానిని చూచిన3అత్రి2మహర్షి నిషీద22నిషీద నిషీద2 (కూర్చుండుము) అని పలికెను.
అందుచేత అతడు 34నిషద వంశమునకు 3మూలపురుషుడు అయ్యాడు. 3నిషాదుడు2అనే పేరుగల వాడయ్యాడు. నిషాదుడు చేపలు పట్టువారిని (ధవరులు) మేని కల్మషమున కనెను. కోయలు, మొదలుగాగల 3కొండ జాతుల వాండ్రు జన్మించారు. వేనుని కల్మషముచే వారందరు అధర్మప్రియులైరి.
వీరు 3వింధ్య పర్వతం2మొదలుకొనియున్న వనప్రదేశాలలో 3నిషధ2పర్వత ప్రదేశాలలో నివసించసాగారు.
నిషాదులు సముద్రతీర వాసులు. సముద్రంలోని అనేక ద్వీపాలలో నివసించేవారు. వీరు నరరూప రాక్షసుల జాతులకు చెందినవారు
3నిషాద నరేషుడు2 లోకప్రసిద్ధుడు. ఇతడు 3కశ్యప ప్రజాపతికి2 భార్య 3కాల2యందు జన్మించిన 3కాలకేయులలో2 ఒకడు 3నిషాదుడుగా2 పుట్టాడు
నిషధుడు (ఇతడు నీలుని వంశజుడు) అనేవాడు ఒకడు 3మాహిష్మతీ పురాధీశుడు.
నిషాదము అనే ఒక ప్రాంతము కలదు. అది సముద్ర ద్వీపము. ఇక్కడ నివసించేవారికి 3నిషాదులు2అని పేరు. ధర్మరాజు అశ్వమేధయాగం చేసినపుడు 34ఏకలవ్యుడు22అనేవాడు దీనికి రాజు.జంబూద్వీపానికి ఉత్తర దక్షిణ దిక్కులందు 34హిమాలయ22 34నిషధ22 పర్వతాలు కలవు.
(ఈ విషయాలు ఇది 34బ్రహ్మపురాణంలోని (శ్లో॥ 28నుండి 62వరకు), ఇదే విషయం కవిత్రయ భారతంలోని శాంతి పర్వం ద్వితీయ అధ్యాయం 205 నుండి 207లో కూడా కలదు. కవిత్రయ భారతం సభాపర్వము ప్రథమ అధ్యాయం- 261 క.త్ర.భా. ఆదిపర్వము... 80 , క.త్ర.భారతం. సభాపర్వము ప్ర.అ.249 క.త్ర.భా. సభాపర్వము ప్ర.అ. 261 అశ్వమేధ పర్వము చ.అ.111. కలవు. చూసుకొనుడు)
- ఇంకాఉంది