Others

తెల్లవారుజాము కల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఓటమి, గెలుపు సరిహద్దులు చెరిగిపోయ
తలలు తెగిన మొండాల్నుండి
నెత్తురు చిచ్చుబుడ్ల వెలుగుల్లా చిమ్ముతుంది!
ఉదయం లేని, మధ్యాహం లేని,
సాయంత్రం లేని
ఆకాశం పడగలు విప్పుతూ
ఇంద్రధనుస్సులని మింగేస్తుంది!
వేల జతల దుస్తులు ధరిస్తున్నా
దేహ నగ్నత్వ దర్శనం దరిదాపుల్లోనే!
కాళ్లూ చేతులూ కన్నీటి సాగరంలోనే
జలియన్ వాలా బాగ్ సర్పం
జరాజరా పాక్కుంటూ మంచాల్ని చుట్టేస్తుంది!
అంటుకున్న మంటలతో
నేల బంతి దొర్లుకుంటూ
మానవాళిని కౌగిలించుకుంటుంది!
చుక్కలన్నీ బటానీ తొక్కల్లా రాలిపోతున్నాయ
చిగుళ్ళ జిగేలు జగురుగారిపోతుంది
అమ్మవారి కిరీటంలో
తుమ్మ ముళ్ళు తచ్చాడుతున్నాయ
పశ్చాత్తాపము మచ్చుకైనా కనిపించడం లేదు
పుట్టుమచ్చలు చెరిగిపోతున్నా...
అలల సముద్రుడులా
కాళ్ళూ చేతులూ ఊపుతున్న ఓ శిశువు
రాత్రిపూట గోల్కొండ కోటలా అగుపించిన
మలక్‌పేట మెట్రో స్టేషన్ బొమ్మని
గేట్‌వే ఆఫ్ ఇండియా బొమ్మని
విక్టోరియా స్మారకాలని
సముద్రంలోకి విసిరేస్తూ
దేశీయ జనం బొమ్మలతో
ఆడుకుంటున్నాడు

- ఒబ్బిని, 9849558842