Others

మునగాకుతో థైరాయిడిజం దూరం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శరీరం పనితీరుపై హార్మోన్ల ప్రభావం చాలానే ఉంటుంది. హార్మోన్ల సమతుల్యతకు కారణమైన దానిలో ఒకటైన థైరాయిడ్ గ్రంథి గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది గొంతుభాగంలో ఉంటుంది. దీని పనితీరులో తేడాల వల్ల థైరాయిడ్ సమస్య ఎదురవుతుంది. ఇది రెండు రకాలుగా ఉంటుంది. అందులో ఒకటి ‘హైపో థైరాయిడిజం’. నేటి జీవనశైలి కారణంగా దీని బారినపడే వారి సంఖ్య పెరుగుతోంది. దీన్ని అదుపులో ఉంచాలంటే వైద్యులు సూచించిన మందులతో పాటు ఆహార నియమాలు కూడా పాటించాలి.
* బరువు పెరగడం
* చలిగా ఉండటం
* అతి నిద్ర
* బద్ధకం
* జుట్టు రాలిపోవడం
* చర్మం పొడిబారడం
* నీరసం, అలసట
* కండరాల నొప్పలు
* మానసికంగా కుంగిపోవడం వంటివి హైపో థైరాయిడిజం లక్షణాలు. ఇదో ఆటో ఇమ్యూనిటీ సమస్య. అయోడిన్ లోపం, ఒత్తిడి, జీవన విధానంలో లోపాలు వంటివి కొన్ని కారణాలు. కొంతమందిలో ఇది ఎందుకు వస్తుందో కారణాలు కూడా చెప్పలేం. ఈ సమస్యను అదుపులో ఉంచాలంటే థైరాయిడ్ గ్రంథి పనితీరుని ఇబ్బంది పెట్టే పదార్థాలను తగ్గించాలి. క్యాబేజీ, కాలీఫ్లవర్, పాలకూర, ముల్లంగి, సోయాబీన్స్, స్ట్రాబెర్రీల వంటివాటిని తినకూడదు.
హైపోథైరాయిడిజం సమస్యకు మునగాకు చక్కగా పనిచేస్తుంది. మునగాకు పప్పు లేదా పచ్చడిని రోజూ తింటే హైపోథైరాయిడిజం సమస్య తగ్గుతుంది. అలాగే గ్లాసు నీటిలో గుప్పెడు మునగాకుల్ని కషాయంలా కాచుకుని ప్రతిరోజూ తీసుకున్నా కూడా థైరాయిడ్ పనితీరు మెరుగవుతుంది. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి.
జీవనశైలిలో మార్పులు చేసుకోవాలి. యోగాసనాలు చేయడం వల్ల ఇంకా మంచి ఫలితాలు ఉంటాయని చెబుతున్నారు గురువులు. ముఖ్యంగా మత్స్య, భుజంగ, బ్రహ్మ ముద్ర సింహాసనం, జిహా ముద్రలు వేస్తూ ఉజ్జరుూ ప్రాణాయామం చేయడంతో మంచి ప్రయోజనం ఉంటుందని చెబుతారు యోగ గురువులు.
*