Others

ఎన్నికల తంతు ఒకేసారి సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

లోక్‌సభ, శాసనసభలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించడం మంచిది అంటూ, ఆ దిశగా ప్రధాని నరేంద్ర మోదీ చర్చకు బీజం వేశారు. అఖిల పక్షాల సమావేశం ఏర్పరిచి, వివిధ పార్టీల వారి అభిప్రాయాలు తీసుకున్నారు. ‘ఒకే దేశం- ఒకే ఎన్నికల’కు మద్దతుగా ఉన్నవారు చెప్పేదొకటే- ‘తద్వారా ఖర్చు తగ్గుతుంది. పాలనలో స్పీడ్‌బ్రేకర్లు ఎదురవ్వవు. ఎప్పటికప్పుడు ఏదో ఒకచోట ఎన్నికలు ఉండడంతో పాలనా రథం దిగి, ప్రచార రథం ఎక్కాల్సి వచ్చి అభివృద్ధికి నష్టం జరుగుతోంది’ అని. ఈ ప్రతిపాదనను వ్యతిరేకించేవారు చెప్పేది- ‘ప్రజల అభిప్రాయానికి విలువ తగ్గుతుంది. జాతీయ అంశాలు స్థానిక అంశాల్ని మింగి అప్రధానం చేస్తాయి కనుక సమాఖ్య స్ఫూర్తి తగ్గిపోతుంది. ‘జమిలి’ ఎన్నికలకు అనుగుణంగా రాజ్యాంగ సవరణలు చెయ్యాలి. వాటితో నష్టాలు ఎక్కువ’అని. అయితే లాభనష్టాలు పూర్తిగా సమస్య లోతుల్ని తరచి చూస్తే తప్ప అవగాహనకు రావు. అందుకోసం విస్తృతంగా ప్రజల్లో చర్చ జరగాలి. ఒకే దఫా ఎన్నికలు జరగగలిగితే మంచిదేకానీ అది ప్రజాతీర్పు విస్పష్టంగా ఉన్నపుడు మాత్రమే వివాద రహితం. ఏ పార్టీకీ మెజారిటీ రానప్పుడు లేదా పాలక పక్షం సభ విశ్వాసాన్ని కోల్పోయినప్పుడేం చెయ్యాలి? అల్పాయుష్షు ప్రభుత్వాన్ని ఐదేళ్లూ వెంటిలేటర్ మీద ఉంచి కొనసాగించాలా? లేదా రాష్టప్రతి లేదా గవర్నర్ పాలనను సంవత్సరాలుగా కొనసాగించాలా! అందాకా ప్రజలు సదరు ప్రభుత్వాన్ని భరించాల్సిందేనా? బొటాబొటీ మెజారిటీల ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు, ఫిరాయింపులు సాధారణమైనప్పుడు సంక్షోభాలు ఏర్పడవా? ఇలాంటి విషయాలన్నిటిలో రాజ్యాంగ స్ఫూర్తి గీటురాయిగా మేధోమథనం జరగాలి. ఒకే దఫా ఎన్నికల అంశంతోపాటు అంతకన్నా- ఎన్నికల్లో డబ్బు, నేరాల పాత్రపై చర్చ జరగాలి. ఈ సార్వత్రిక ఎన్నికల్లో అరవై వేల కోట్లు తెర వెనుక ఖర్చు (అనధికార ఖర్చు) జరిగినట్టు సమాచారం. ఆ స్థాయిలో డబ్బుమయం, నేరమయం అయిన ఎన్నికలు ఏమేరకు ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి? ఎన్నికలు ఎన్నిసార్లు జరుగుతున్నాయన్న దానికన్నా ఎలా జరుగుతున్నాయన్నది ముఖ్యం. ఆ దిశగా సంస్కరణలు ప్రధానం.

-డా. డీవీజీ శంకరరావు, పార్వతీపురం