Others

బ్లెండర్ వాడుతున్నారా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తరచూ మేకప్‌లు వేసుకునేవారు ఎప్పటికప్పుడు అప్‌డేట్ అవుతూనే ఉంటారు. అలాంటివారు మేకప్ బ్రష్‌ల స్థానంలో బ్యూటీ బ్లెండర్లను వాడటం మొదలుపెట్టేశారు. వీటిని వాడటం కూడా సులువవడంతో చాలామంది బ్రష్‌లను వదిలేసి వీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వీటి వాడకంలోనూ కొన్ని జాగ్రత్తలు, చిట్కాలూ పాటించాలి.
* మేకప్ బ్రష్‌ను వాడుతున్నప్డు దాన్ని చర్మంపై రుద్దుతూ ఉంటాం. కానీ బ్లెండర్‌తో అలా చేయాల్సిన అవసరం ఉండదు. పైపైన అంటే పౌడర్ అద్దినట్లు అద్దితే సరిపోతుంది. దీనికి కాస్త సమయం పట్టినా మేకప్ చాలా బాగుంటుంది.
* ఫౌండేషన్ వేసుకోవడానికి కొంతమంది బ్లెండర్‌ను నేరుగా వాడేస్తుంటారు. అలాకాకుండా ముందుగా బ్లెండర్‌ను కొద్దిగా తడిపి వాడితే మేకప్ వేసుకోవడం సులువవుతుంది.
* బ్లెండర్‌తో ఫౌండేషన్ వేసుకుంటే ముఖం అంతా ఒకేలా అంటుతుంది. దీన్ని నీళ్లలో ముంచడం, మేకప్ లిక్విడ్ స్ప్రే ఉండే దాన్ని వాడినా సరిపోతుంది. అయితే దీంట్లో నీళ్లు ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. ఒకవేళ అలా ఉన్నట్లయితే ఒకసారి సున్నితంగా పిండేసి తరువాత ఉపయోగించాలి.
* మేకప్ వేసుకున్న తరువాత బ్లెండర్‌ను తప్పనిసరిగా శుభ్రం చేయాలి. తరువాత మరోసారి వాడాలి. లేదంటే బాక్టీరియా చేరి చర్మవ్యాధులు వచ్చే అవకాశం ఉంది.
* వీటిని ఎలా పడితే అలా శుభ్రం చేయకూడదు. దీనకంటూ ఒక పద్ధతుంది. ఎక్కువ సువాసన లేని సబ్బుతోనే దీన్ని శుభ్రం చేయాలి. దీన్ని గట్టిగా పిండకూడదు. దీనిలోని నీళ్లు మొత్తం పోయేదాకా టిష్యూతో అద్దుతూ ఉండాలి. లేదా ఫ్యాన్‌గాలి కింద ఉంచితే సరిపోతుంది.
* బ్లెండర్‌ను కేవలం ఫౌండేషన్ రాసుకోడానికే పరిమితం చేయాల్సిన అవసరం లేదు. పౌడర్, సన్‌స్క్రీన్, బ్లష్.. ఇలా ఏది రాసుకోడానికైనా దీన్ని చక్కగా వాడుకోవచ్చు.
* ఇది పై నుంచి కింది వరకు ఒకే ఆకారంలో ఉండదు. అందువల్లే దీన్ని రకరకాలుగా ఉపయోగించుకోవచ్చు. అవసరమైన వైపు మాత్రమే ఉపయోగించుకుని, శుభ్రపరచుకోవచ్చు.