Others

అసలు పరీక్ష తరువాతే.. చదువు పరీక్ష

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మాతృత్వ పరీక్ష తర్వాతే చదువు పరీక్షకు సిద్ధమైంది అల్మాజ్ అనే యువతి. బాల్యవివాహాలు అధికంగా జరిగే దేశాల్లో ఇథియోపియా ఒకటి. ఈ దేశంలో సగానికిపైగా అమ్మాయిలకు పద్దెనిమిది సంవత్సరాల్లోపే పెళ్లిళ్లు చేసేస్తారు. వారికి పెళ్లంటే ఇష్టం లేకపోయినా, చదువుకోవాలనే కోరిక ఉన్నా కూడా తల్లిదండ్రులు చెప్పినట్లు పెళ్లి చేసుకోవాల్సిందే.. ఇలాంటి పరిస్థితిలోనే పదిహేడో సంవత్సరంలో వైవాహిక బంధంలోకి అడుగుపెట్టింది ఆ దేశానికి చెందిన అల్మాజ్ డెరెసె. పెళ్లయినా భర్త సహకారంతో చదువును కొనసాగించింది. గర్భం ధరించినా కూడా పరీక్షలకు సన్నద్ధమైంది. అయితే పరీక్షరోజే ప్రసవం అయ్యింది. ఏడాది కష్టం పనికిరాకుండా పోతుందే అని ఆందోళన చెంది.. ప్రసవమైన అరగంటకే సెకండరీ స్కూల్ వార్షిక పరీక్ష రాసి వార్తల్లో నిలిచింది. ఇలా చదువుపై మక్కువను, అంకిత భావాన్ని చాటుకున్న ఈ అమ్మాయి నెటిజన్ల ప్రశంసలు అందుకుంటోంది.. వివరాల్లోకి వెళితే..
అల్మాజ్ డెరిసెది ఇథియోపియాలోని అబాబోరా రాష్ట్రం. అల్మాజ్‌కు చిన్నతనం నుంచీ చదువంటే ప్రాణం. పెళ్లి తర్వాత చదువు సాగదని తెలుసుకున్న అల్మాజ్ తల్లిదండ్రులతో ఇదే విషయాన్ని చెప్పింది. కానీ వాళ్లు వినిపించుకోకుండా పదిహేడో సంవత్సరంలోనే పెళ్లిచేసేశారు. కానీ ఆమె భర్త చదువుకునేందుకు సహకారం అందించాడు. అలా అల్మాజ్ మళ్లీ పదో తరగతి చదవడం మొదలుపెట్టింది.
స్కూలుకు వెళ్లడం మొదలుపెట్టింది. ఈ సమయంలోనే అల్మాజ్ గర్భం దాల్చింది. పరీక్షల తరువాత ప్రసవం జరుగుతుంది అనుకుంది. కానీ పరీక్ష రోజే ప్రసవం అవుతుందనుకోలేదు. పరీక్ష జరిగే రోజు ఉదయం కాన్పు కోసం ఆసుపత్రిలో చేరాల్సి వచ్చింది. ఏడాది చదువు వృథా అవుతుందేమో అని కంగారుపడింది.. ఏడ్చేసింది. ఇంతలో ఆమె పండండి మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే ఆమె చదువుకు అడుగడుగునా తోడుగా నిలిచిన భర్త ఈసారి కూడా ఆమెకు తోడయ్యాడు. ఆమె డెలివరీ అయిన ఆసుపత్రిలోనే పరీక్ష రాసేందుకు ఏర్పాట్లు చేశాడు. అధికారులకు ఆమె గురించి చెప్పి, వారిని రిక్వెస్ట్ చేసి ఆమెకోసం ప్రత్యేకంగా ఒక ఎగ్జామినర్‌ను ఏర్పాడు చేశాడు. అలా అన్ని సదుపాయాల నడుమ కాన్పు జరిగిన అరగంటకే ఈ తల్లి ఆనందంగా, నవ్వుతూ పరీక్షను రాసిం ది. చదువంటే తనకెంత ప్రాణమో తెలిపిన అల్మాజ్ ప్రస్తుతం వార్తల్లో వ్యక్తిగా మారిపోయింది. పలువురు నెటిజన్లు కూడా ఆమె పట్టుదలను, అంకితభావాన్ని ప్రశంసిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా తదుపరి పరీక్షలు కూడా శ్రద్ధగా రాసి పాసై, కెరీర్‌లో ఉన్నత స్థితికి చేరుకోవాలని ఆశిస్తూ.. ఆల్ ది బెస్ట్ అల్మాజ్.